Latest Updates
-
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు!
హనుమాన్ జయంతి రోజు యాదృశ్చిక రాజయోగాలు.. ఈ రాశుల వారికి జన్మలో లేని అదృష్టం!
ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి నాడు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. పౌరాణిక కథనాల ప్రకారం, ఈ పవిత్ర రోజున వాయుపుత్రుడు శ్రీ హనుమంతుడు అంజనీ మాత, కేసరి మహర్షులకు జన్మించారని నమ్ముతుంటారు. దాని ఆధారంగానే చైత్ర పౌర్ణమి నాడు హనుమాన్ జయంతి జరుపుకుంటారని చెబుతుంటారు. హిందూ భక్తుల్లో అత్యంత విశ్వాసం కలిగిన ఈ పవిత్ర దినాన్ని ఎంతో ఘనంగా ఉత్సవంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం 2025లో హనుమాన్ జయంతి ఏప్రిల్ 12న వస్తోంది.
ఈ రోజు కేవలం ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా, జ్యోతిష పరంగా కూడా చాలా ప్రాధాన్యం కలిగిన రోజు. ఈసారి పంచాంగం ప్రకారం అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా రవి యోగం, జయ యోగం వంటివి మానవ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ శుభ యోగాలు, అలాగే హస్త, చిత్ర నక్షత్ర సమయాలు ఈ హనుమాన్ జయంతి రోజున ఉండటం విశేషం.

ఇంకా ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే, అదే రోజున బుధుడు, శుక్రుడు, శని, రాహువు, సూర్యుడు.. ఐదు గ్రహాలు ఒకే రాశిలో, అంటే మీన రాశిలో సంచరించనున్నాయి. ఈ ప్రత్యేక గ్రహ సంయోగం వల్ల బుధాదిత్య యోగం, శుక్రాదిత్య యోగం, మాలవ్య యోగం, లక్ష్మీ నారాయణ యోగం వంటి శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడతాయి. ఈ యోగాలు కొన్ని రాశులపై శుభ ఫలితాలను చూపిస్తాయి. ఈ స్టోరీలో హనుమాన్ జయంతి రోజున జరుగుతున్న ఈ యాదృశ్చిక ఘటనల కారణంగా ఏ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి? ఏ రాశి వారికి చెడు ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకుందాం.
వృషభ రాశి
ఈ హనుమాన్ జయంతి రోజున వృషభ రాశి వారికి శుభవార్తలు ఎదురవుతాయి. పలు నెలలుగా వాయిదా పడిన పనులు సాఫీగా పూర్తవుతాయి. ముఖ్యంగా ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది. ఉద్యోగార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో పెట్టుబడులు లాభదాయకంగా మారతాయి. హనుమంతుని అనుగ్రహంతో మీరు మానసికంగా దృఢంగా మారుతారు.
మిథున రాశి
ఈ రాశి వారికి తాము అనుకున్న పనుల్లో విజయాలు కలుగుతాయి. కొన్ని అత్యంత క్లిష్టమైన సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఇది మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కొత్త అవకాశాలు వచ్చి కెరీర్‌లో మంచి ముందడుగు వేయించనున్నాయి.
కుంభ రాశి
కుంభ రాశి వారు ఈ కాలంలో ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశాలు పొందుతారు. గతంలో చేసిన ప్రయత్నాలకు ఫలితాలు కనపడతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త ఒప్పందాలు పొందే అవకాశాలుంటాయి. కుటుంబ సభ్యుల మద్దతు, ఆత్మీయుల ప్రేమ కూడా మీ ధైర్యాన్ని పెంచుతుంది. శుభవార్తలు ఎక్కువగా వచ్చే సూచనలు ఉన్నాయి.
ఈ శుభదినం రోజున హనుమంతుని నామస్మరణ, హనుమాన్ చాలీసా పఠనం, ప్రణామాలు చేయడం శాంతిని కలిగిస్తుంది. ఈ సందర్భంగా మీరు మీ ఇంట్లో లేదా ఆలయాలలో ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా నైతికంగా, ఆధ్యాత్మికంగా ఎదగవచ్చు. ధైర్యం, భక్తి, కర్తవ్య నిష్ఠకు ప్రతీక అయిన హనుమంతుని ఆశీస్సులు మీ జీవితాన్ని వెలుగుల్లో నింపుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











