Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
2025లో ఏ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి..వాళ్లు నక్క తోక తొక్కినట్లే!
కొత్త ఏడాది ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిల ఉన్నాయి. న్యూ ఇయర్ 2025 సెలబ్రేషన్స్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. అయితే కొత్త ఏడాది తమ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటారు. కాబట్టి జోతిష్యం ప్రకారం కొత్త ఏడాదిలో అంటే 2025లో మొత్తం 12 రాశులలో ఏ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
మేషరాశి
2025లో మేషరాశి వారికి వృత్తి పరంగా,ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. రాహు, శని సంచారం ఉన్నప్పటికీ మీ ఎదుగుదలకు ఆటంకం కలిగించదు. మీ ఆర్థిక జీవితంలో చాలా పురోగతిని చూస్తారు. సంబంధాల పరంగా అనుకూలంగా ఉంటుంది. కెరీర్‌లో పురోగతిని పొందుతారు. వృత్తి జీవితంలో మంచి ఉద్యోగావకాశాలు ఉంటాయి.

వృషభం
వృషభ రాశి వాళ్లు 2025లో వృత్తిలో పురోగతిని చూస్తారు. శని మీకు పురోగతిని ఇస్తుంది. ఆర్థికంగా చాలా లాభపడతారు. వైవాహిక జీవితం బాగుంటుంది. 2025 సంవత్సరం విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా కొత్త పనిని చేపడితే గ్రహాల అనుకూల స్థానం వల్ల మంచి లాభాలను పొందుతారు.
మిథునరాశి
2015 ఆర్థిక పరంగా మిథునరాశి వారికి కూడా అనుకూలమైన కాలం. కెరీర్ జీవితంలో మంచి ప్రయోజనాలను పొందుతారు. ఆర్థిక వృద్ధి మీ సౌకర్యాన్ని పెంచుతుంది. ప్రణాళిక ప్రకారం ఏదైనా పని చేస్తే ఈ కాలం అనుకూలంగా ఉంటుంది.
కర్కాటక రాశి
2025 కర్కాటక రాశి వారికి అన్ని కోణాల నుండి మంచిది. కెరీర్,ఆర్థిక జీవితం,సంబంధాలు,ఆరోగ్యం ఇలా అన్ని విధాలుగా బాగుంటుంది. రాహు, శని సంచారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఆర్థిక జీవితంలో చాలా మంచి ప్రయోజనాలను పొందుతారు. అభివృద్ధిని డబ్బు పరంగా చూడవచ్చు.
సింహ రాశి
ప్రారంభ నెలలో కెరీర్, ఆర్థిక జీవితం, సంబంధాలు ప్రభావితం కావచ్చు. కానీ ఉద్యోగంలో కొత్త అవకాశాలు లేదా కొత్త వెంచర్ మీకు విజయాన్ని అందిస్తాయి. మే తర్వాత నెలలో మీరు ఆర్థికంగా లాభపడతారు. కానీ మీరు మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి.
కన్య రాశి
సంవత్సరం మొదటి నెల మీకు సవాలుగా ఉంటుంది. వృత్తి జీవితంలో అనేక సవాళ్లు ఉంటాయి. ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏదైనా పెట్టుబడి గురించి ఆలోచించడం మంచిది. ఖర్చులు తగ్గించుకుంటే బాగుంటుంది.
తుల
ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది. బృహస్పతి అనుగ్రహం కారణంగా పెట్టుబడుల నుండి మంచి ప్రయోజనాలను పొందుతారు. అర్ధ సంవత్సరం తర్వాత కెరీర్‌లో పురోగతి ఉంటుంది, అయితే కెరీర్, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను కొనసాగించడానికి ప్రయత్నించండి. ఆస్తి కొనాలన్నా, కారు కొనాలన్నా ఈ రకమైన కోరిక ఉంటే కొత్త సంవత్సరంలో మీ కోరిక నెరవేరే అవకాశం బలంగా ఉంది.
వృశ్చికం
కెరీర్ జీవితంలో వ్యాపారవేత్తలు కొత్త అవకాశాలను పొందుతారు. మే తర్వాత కాలం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ తర్వాత సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు రాశి
వృత్తి, వ్యక్తిగత జీవితంలో పురోగతిని చూస్తారు. ఆర్థిక జీవితం చాలా బాగుంటుంది. ఉద్యోగ మార్పు లేదా వ్యాపారంలో మార్పు గురించి ఆలోచిస్తున్నట్లయితే ఈ మార్పు ఆర్థిక పురోగతికి చాలా అనుకూలంగా ఉంటుంది.
మకర రాశి
మకరరాశి వారు కెరీర్ జీవితంలో ఎదుగుదల, మార్పు, కొత్త అవకాశాలు చూస్తారు. అయితే ఈ సంవత్సరం మీరు చాలా కష్టపడి ఓపికగా వేచి ఉండాలి. సంవత్సరం చివరిలో మీరు ఊహించిన విధంగా అద్భుతమైన ప్రయోజనాలను పొందగలుగుతారు.
కుంభ రాశి
మీ కెరీర్‌లో చాలా ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి రానున్న నూతన సంవత్సరం అనుకూలంగా ఉంటుంది . సవాళ్లను సహనంతో ఎదుర్కొంటే విజయం మీ సొంతమవుతుంది.
మీనం
మీరు మీ నిర్ణయాల గురించి ఆలోచించడం మంచిది. ప్రారంభంలో ఆర్థిక సవాళ్లు రావచ్చు. కెరీర్ జీవితంలో అనేక సవాళ్లు రావచ్చు. నూతన సంవత్సరం శని సవాళ్లను పెంచుతుంది. కెరీర్ సమస్యను సహనంతో ఎదుర్కొంటారు.
Note: మత విశ్వాల ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. బోల్డ్ స్కై తెలుగు దీనిని ధృవీకరించలేదు. దీనిని పాటించడం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications