Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
ఈ రాశుల వారిపై అయిదు గ్రహాల అనుగ్రహం.. ఇలా చేస్తే వారికి అప్పటి వరకు తిరుగు ఉండదు!
గ్రహాల అనుగ్రహం ఉంటే జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయనే విషయం తెలిసిందే. మనకు సంబంధించిన రాశుల్లో గ్రహ సంచారం బాగుంటే.. మన జాతకచక్రం కూడా బాగుంటుందని చెబుతూ ఉంటారు. అయితే ఒక గ్రహం అనుకూలంగా ఉంటేనే భారీగా ఉత్తమ ఫలితాలు వస్తే, అదే అయిదు గ్రహాలు అనుకూలంగా ఉంటే.. ఆ ఫలితాలు ఎలా ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు.
మొత్తం తొమ్మిది గ్రహాల్లో అయిదు గ్రహాల అనుగ్రహం ఒకేసారి కలగడం అనేది ఏ రాశి వారికైనా గొప్ప విషయమే. అలానే ఇప్పుడు అయిదు గ్రహాల అనుగ్రహం నాలుగు రాశులపై ఉంది. ఈ సమయంలో ఆయా రాశుల వారికి అస్సలు తిరుగుండదు. వారు పట్టిందల్లా బంగారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ రాశులు ఏవేవి? ఆ రాశుల వారి జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఆ రాశులు ఏవంటే?
మేష రాశి: ఈ రాశి వారికి గురువు, కుజుడు, రవి, బుధుడు, శని గ్రహాలు అత్యంత అనుకూలంగా మారాయి. దీని వల్ల నవంబర్ 15వ తేదీ వరకు మేష రాశి వారికి అనుకూలమైన రోజులు ఉండనున్నాయి. ఈ సమయంలో మేష రాశి వారి ఆశలు, ఆశయాలు, కోరికలు నెరవేరుతాయి. ఆరోగ్యం కూడా బాగా మెరుగవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తప్పకుండా గడిస్తారు. నష్టాల్లో ఉన్నవారు కూడా లాభాల బాట పడతారు.
ఈ కాలంలో మేష రాశి వారి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు ఇతర దేశాల నుంచి అవకాశాలు వస్తాయి. ఈ రాశి వారు ఈ కాలంలో ఎక్కువగా శుభవార్తలు వింటూ ఉంటారు.
వృషభ రాశి: ఈ రాశి వారికి రాహువు, గురువు, రాశ్యధిపతి శుక్రుడు, కుజుడు, శని గ్రహాలు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. దీని కారణంగా వృషభ రాశి వారికి అత్యంత లాభాల కాలం నడవనుంది. ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి భారీగా లాభాలు వచ్చే అవకాశముంది.
వృత్తి, వ్యాపారాల్లో అనుకున్న లక్ష్యాలను చేరుకొని, అనుకున్న విధంగా లాభాలను రాబట్టుకుంటారు. ఇంట్లో వారందరూ శుభవార్తలు వింటూ ఉంటారు. కొద్దీ ప్రయత్నంలో సొంతింటి కల నెరవేరే అవకాశముంది. పెళ్లికాని వారికి ఇది మంచి సమయం. పెళ్లిళ్ల కుదిరే అవకాశం పుష్కలంగా కనిపిస్తున్నాయి.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి గురువు, బుధుడు, రవి, శుక్రుడు, కేతువు గ్రహాలు చాలా అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఈ కాలం నవంబర్ 15వ తేదీ వరకు కొనసాగనుంది. వీటి కారణంగా ఈ రాశి వారు విదేశీ సొమ్మును లబ్ధిపొందే అవకాశముంది. ఉద్యోగులు వేరే ఉద్యోగంలో మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఎంతో కాలంగా ఉండిపోయిన ఆస్తి సమస్యలు పరిష్కారమై.. విలువైన ఆస్తులు కలిసిరానుంది.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వారి ప్రయత్నాలు ఫలించనున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు రెండింతలు, మూడింతలు అయ్యే అవకాశముంది. పెళ్లి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి.
వృచ్చిక రాశి: ఈ రాశి వారికి శని, గురువు, కుజుడు, బుధ, రవి గ్రహాలు బాగా అనుకూలంగా మారాయి. దీని కారణంగా వృచ్చిక రాశి వారు ఏ పని తలపెట్టినా విజయవంతమవుతుంది. ఈ గ్రహాల అనుకూలత కారణాంగా ఈ రాశి వారికి ఉద్యోగ జీవితంలోనే కాక కుటుంబంలో కూడా శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఆస్తి పాస్తులు పొందుతారు.
నిరుద్యోగులకు అనేక మంచి ఉద్యోగ అవకాశాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. సంపన్నమైన కుటుంబంతో పెళ్లి సంబంధాలు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











