Latest Updates
-
మన ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతోందా? ఈ 7 వాస్తు & ఆధ్యాత్మిక మార్గాలు సకారాత్మక శక్తిని పెంచుతాయట! -
పనీర్, కాలీఫ్లవర్‌తో ఇలా కుర్మా చేశారంటే.. నాన్‌వెజ్ కూడా దిగదుడుపే.! -
ప్రతి మహిళ ఏడాదికోసారి ఖచ్చితంగా చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవే.. లేదంటే.? -
ప్రేమిస్తున్నారు కానీ పోతారేమోనని భయం ఆ భయమే బంధాన్ని ఎలా పాడుచేస్తోందో తెలుసా? -
మ్యాంగోతో జ్యూస్‌లే కాదు.. ఇలా స్వీట్లు చేశారంటే ఆ రుచి జన్మలో మరిచిపోలేరు.! -
అత్త మెచ్చిన కోడలిగా ఉండాలంటే.. ఈ ఐదు లక్షణాలు తప్పనిసరి.! -
ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ప్రకృతి స్ఫూర్తితో భవిష్యత్తు కోసం ఒక్కటవుదాం.! -
ఎండదెబ్బతో పెదవులకి ఫీవర్.. సాఫ్ట్‌గా, గులాబీ రంగులోకి మారాలంటే ఇలా చేయండి.! -
రామ్ చరణ్ భార్య ఉపాసన ఫేవరెట్ ఫుడ్ ఇదే..ఈ హెల్తీ ఫుడ్ ని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పోషకాల గని.. గోదావరి జిల్లాల స్పెషల్ ‘తోటకూర కాడల పులుసు’.. ఎలా చేయాలంటే.!
పాపం పండింది: పాకిస్తాన్ జాతకం దరిద్రంగా ఉందట..ఈసారి అడుక్కోడానికి చిప్ప కూడా ఉండదేమో!
ప్రస్తుతం భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మూకశ్మీర్ లోని పెహల్గామ్ లో గత నెలలో పర్యాటకులపై ఉగ్రదాడి జరగ్గా..దీనికి కారణం పాకిస్తానే అని గుర్తించిన భారత్ ఈ వారం ప్రారంభంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో ఆ దేశంలోని ఉగ్రశిబిరాలపై మిసైల్,డ్రోన్ దాడులు చేసింది. పాకిస్తాన్ కూడా భారత్ పై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుండగా..మన జవాన్లు పాక్ వ్యూహాలను చిత్తు చేస్తున్నారు. భారత్ పాక్ రెండు దేశాలు యుద్ధం అంచులో ఉన్నాయి. అయితే ఈ సమయంలో పాకిస్తాన్ ఫ్యూచర్ ఎలా ఉంటదో తెలుసుకోడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.ఈ సమయంలో కొందరు జ్యోతిష్య పండితులు పాకిస్తాన్ భవిష్యత్తుపై తమ అంచనాలను తెలియజేస్తున్నారు.
పాకిస్తాన్ 1947 ఆగస్టు 14 అర్థరాత్రి ప్రత్యేక దేశంగా ఏర్పాటైంది. కొందరు జ్యోతిష్యులు చెబుతున్న ప్రకారం పాకిస్తాన్ వ్యవస్థాపక జాతకం మేష లగ్నానికి చెందినది..ఇందులో ప్రస్తుతం మూడవ,ఆరవ అధిపతి బుధుడు అంతర్దశ మరకశి శుక్రని మహాదశలో జరగుతోంది. ఇది పాకిస్తాన్ ఆర్మీకి,ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా ముప్పు అని చెబుతున్నారు.

2023 డిసెంబర్ నుంచి 2026 అక్టోబర్ దాకా కొనసాగే శుక్రునిలో బుధుని ప్రత్యేక కలయిక ఖగోళంలో ఓ ఆసక్తికరమైన విషయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో బలూచిస్తాన్ ఏరియాలో హింసాత్మక ఘటనలు,అప్ఘనిస్తాన్ పాకిస్తాన్ బోర్డర్స్ లో యుద్ధ పరిస్థితులతో పాకిస్తాన్ కు అన్ని విధాలుగా నష్టాన్ని కలిగించే సూచనలు కనిపిస్తున్నాయని కొందరు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
పాకిస్తాన్ జాతకంలో మూడవ ఇంటికి అధిపతి బుధుడు, నాల్గవ ఇంటి అధిపతి చంద్రునితో కలిసి ఒక ప్రమాదకరమైన కూటమి కట్టాడు. దీంతో సైనిక ఘర్షణతో పెను నష్టం వాటిల్లే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కుజుడు దురదృష్టాన్ని కలిగిస్తాడు
కర్కాటక రాశిలో బలహీనంగా ఉన్న కుజుడు జూన్ 7 వరకు పాకిస్తాన్‌కు కష్టాలు తెచ్చిపెట్టేలా ఉన్నాడని జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. తూర్పున భారత్ సరిహద్దులో సైనికపరమైన ఒత్తిడి పెరుగుతోంది. ఇక పశ్చిమాన తాలిబన్ల గుంపులు, బలూచ్ తిరుగుబాటుదారుల దాడులు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఫలితంగా పాకిస్తాన్ సైన్యం రెండువైపులా భారీ నష్టాలను చవిచూడక తప్పదు అనే భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి.
పాకిస్తాన్ ఓటమి
పాకిస్తాన్ జాతకం మేష లగ్నానికి చెందినది, దీని అధిపతి కుజుడు ప్రస్తుతం బలహీనపడి కర్కాటక రాశిలో ఉన్నాడు. కుజుడు నీచ రాశిలో ఉంటే యుద్ధంలో ఓటమిని ఎదుర్కోవలసి ఉంటుంది. జ్యోతిషశాస్త్రంలో యుద్ధానికి కుజుడిని కారకుడిగా భావిస్తారు.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. దీనిని బోల్డ్ స్కై తెలుగు ధృవీకరించలేదు.



Click it and Unblock the Notifications