Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
ఈ వారంలో ఈ రాశులవారు అదృష్టవంతులు..దురదృష్టకర రాశులు గురించి కూడా ఇక్కడ తెలుసుకోండి. ఇందులో మీరాశి ఉందా?
జూలై రెండవ వారంలో గురుడు మరియు కుజుడు రాశులల్లో సంచారం వల్ల యోగ ప్రభావం ఆయా రాశులమీద ప్రభావం చూపుతుంది. 12 ఏళ్ల తర్వాత గురుడు మరియు కుజుడు వృషభరాశిలో కలిసి ఉండబోతున్నారు. ఈ సమయంలో అత్యంత శుభ ప్రదమైన యోగాలు ఏర్పడబోతున్నాయి. ఈ యోగాలు చాలా శక్తివంతమైనవి. దీని వల్ల రాశుల్లో కొన్ని మార్పులు జరుగుతాయి. జూలై రెండవ వారంలో 07 జూలై 2024 నుండి 13 జూలై 2024 వరకు కొన్ని రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ మరియు సామాజిక విషయాలలో లాభం, పురోగతి మరియు విజయాలు లభిస్తాయి. ఈ వారంలో కొన్ని రాశుల వారి సంపద పెరుగుతుంది. దాంతో పాటు వారి జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. అలా మరికొన్ని రాశులకి సవాళ్లు ఎదుర్కొవల్సి వస్తుంది. మరి ఈ జూలై రెండోవ వారంలో ఎవరికి బాగా కలిసొచ్చింది. ఎవరు కష్టాలు ఎదుర్కోనున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

ఈ వారం అదృష్ట రాశుల వారు...
కర్కాటక రాశి
ఈ వారం కర్కాటక రాశి అదృష్టవంతులు కాబోతున్నారు. కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే ఈ వారంలోనే ప్రారంభించండి. వ్యాపారాల్లో లాభాలు మరియు ఆశించిన ఫలితాలు పొందుతారు. కార్యాలయంలో ఉన్నతాధికారులతో మీ సంబంధం మెరుగుపడుతుంది. వారి మద్దతుతో మీరు పనిని సులభంగా పూర్తి చేయగలుగుతారు.
మిధునరాశి
మీరు ఆస్తిని అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, అందుకు ఈ వారం మీకు అనుకూలంగా ఉంది.. కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు ఈ వారం సమస్యల నుండి విముక్తి పొందుతారు. సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. పనిలో సహఉద్యోగుల ద్వారా సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, ఈ వారంలో మీకు పరిష్కారం లభిస్తుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ఈ వారంలో కార్యరూపం దాల్చుకుంటాయి
మకరం :
మకరం రాశి వారు ఈ వారం ప్రారంభంలో గతంలో నిలిచిపోయిన పనులను ఈ వారంలో పూర్తి చేస్తారు. పనిలో మద్దతు పొందుతారు. కార్యాలయంలో సహాయసహకారాలు అందుతాయి, ఇంట్లో ఈ వారం శుభ కార్యాలు జరగవచ్చు. మీ బంధువుల పట్ల మీ ప్రేమ పెరుగుతుంది మరియు వారు మీ ప్రేమను అంగీకరిస్తారు.ప్రేమికులకు ఈ వారం బాగుంటుంది. మీ కుటుంబం మీ ప్రేమను అంగీకరిస్తుంది. అప్పులు చేయవద్దు, అలాగే అప్పులు ఇవ్వంకండి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటే మీ డబ్బు సేవ్ అవుతుంది.
వృశ్చికం:
వృశ్చిక రాశి వారికి జులై రెండవ వారంలో మీ కోరికలు నెరవేరే సమయం వచ్చింది. మీకు కెరీర్ పరంగా బాగుంటుంది. పని చేసే వారికి ఈ వారం మీ పై అధికారుల నుండి పూర్తి సహాయ, సహకారాలు అందుతాయి. మహిళా ఉద్యోగులకు బాగా కలిసి వచ్చే వారం. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం శుభవార్తలు అందుతాయి. మీ సోదరి సోదరులు మద్దతు అందకపోయినా మీరు విజయంతో ముందుకు సాగుతారు. అలాగే వారాంతంలో సమస్యలు పరిష్కరించబడుతాయి. ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలి.
తుల :
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. డబ్బుకు ఎలాంటి సమస్యలుండవు. మీకు గతంలో రావాల్సిన డబ్బు కూడా అందుతుంది. ఆ రకంగా ప్రయోజనాలు లాభిస్తాయి. ముఖ్యంగా స్నేహితుల నుండి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అనవసర ఖర్చుల జోలికి వెళ్ళకండి లేదంటే మీరే బాధపడాల్సి ఉంటుంది. ప్రేమికులకు భాగస్వమితో సంబంధం బలంగా ఉంటుంది.

ఈ వారం దురదృష్టకర రాశులు...
మేషరాశి
ఈవారం మేషరాశుల వారికి సవాళ్ళతో కూడుకున్నది. అనవసరమైన విషయాల్లో జోక్య పనికిరాదు. ఒత్తిడికి గురిఅవుతారు. మీతో ఉంటే మీపై ఈర్శద్వేషాలు పెంచుకునే వారికి దూరంగా ఉండండి. వేరొకరి విషయాల్లో తలదూర్చకండి.. మీ ముఖ్యమైన పనిలో మీరు అడ్డంకులను ఎదుర్కొంటారు. ఈ వారం మీ సమస్యలు మరింత పెరుగుతాయి. మనస్సులో ఆందోళనలు పెరిగిపోతాయి.
సింహ రాశి
మీ మొండి వైఖరి మరియు దురుసు ప్రవర్త వల్ల నవ్వులు పాలు అవుతారు. విమర్శలకు కారణం అవుతారు. ఆర్థికంగా మరియు మానసికంగా బారీ నష్టం జరవచ్చు. మిమ్మల్ని బాధపెట్టేవారికి దూరంగా ఉండటం మంచిది. స్నేహితులకు దూరంగా ఉండటం వల్ల వారు మీకు ఇబ్బందులు కలిగిస్తారు. ఈ వారం మీరు మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో గందరగోళం కారణంగా మీరు ఒత్తిడిని అనుభవిస్తారు. ఇది మీ ఆరోగ్యాన్ని కూడా చెడుగా ప్రభావితం చేస్తుంది.
కుంభ రాశి
ఈ వారం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వారం మీ శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయిస్తారు. దాంతో ఆందోళ చెందుతారు. చిన్న సమస్యలను పెద్దవిగా మారే అవకాశాలున్నాయి. మీ పనిలో మరియు పురోగతిలో అడ్డంకులను ఎదుర్కొంటారు. తొందరపాటుతో ఎలాంటి పనులు చేయకండి. వ్యాపారస్థులు ఆర్థికంగా నష్టపోయే అవకాశఆలున్నాయి. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోండి . ఇతరుల మాటలు విని ఏ పనీ చేయవద్దు. సంబంధాలలో విభేదాలు ఉంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications