Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
ఒకేసారి ఏర్పడిన రెండు యోగాలు.. ఈ రాశుల వారికి డబల్ జాక్‌పాట్
జోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనాల్లో మార్పులు, యోగాలు ఏర్పడడం సర్వ సాధారణం. గ్రహాల యుతి, రాశి మార్పు తదితర కారణాల వల్ల ఈ యోగాలు ఏర్పడుతాయి. ఈ యోగాలు పలు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలను అందజేస్తే మరికొన్ని రాశుల వారికి కొంత సమస్యలు ఎదురవుతాయి. అయితే ఈనెల 14, 15, 16, తేదీల్లో రెండు యోగాలు ఏర్పడుతున్నాయి. ఆ యోగాలు ఒకదానికొకటి వీక్షించుకుంటున్నాయి. దీని కారణంగా ఆరు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రెండు యోగాలు ఎలా ఏర్పడుతున్నాయంటే?
ఈనెల 14వ తేదీన వృషభ రాశిలో ఉచ్ఛపడుతున్న చంద్రుడు అదే రాశిలో సంచరిస్తున్న గురువుతో కలవనున్నారు. దీని కారణంగా గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం దానికి సప్తమ స్థానంలో ఇప్పటికే ఏర్పడి ఉన్న బుధాదిత్య యోగాన్ని వీక్షించడం వల్ల ఈ రెండు యోగాలు ఒకేసారి ఏర్పడి, పలు రాశుల వారికి విపరీతమైన రాజయోగాన్ని ప్రాప్తిస్తుంది. ఆ రాశులు ఇవే..

వృషభం
ఈ రాశి వారికి గజకేసరి రాజయోగంతో పాటు బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా ఈ రాశి వారికి మట్టిని ముట్టుకున్నా బంగారం అవుతుంది. కొద్దీ ప్రయత్నంలో అత్యధిక లాభాలు వచ్చి పడతాయి. ఉద్యోగాల్లో అద్భుతమైన పురోగతి ఉంటుంది. ప్రమోషన్స్‌తో పాటు జీతాలు కూడా పెరగనున్నాయి. వ్యాపారంలో ఊహించని విధంగా లాభాలు కలుగుతాయి. కుటుంబంలో ముఖ్యమైన శుభకార్యాలు జరుగుతాయి. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది.
కర్కాటకం
ఈ రాశి వారికి పంచమ, లాభ స్థానంలో ఈ గజకేసరి, బుధాదిత్య యోగాలు ఏర్పడుతున్నాయి. దీని కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులకు వృత్తి, ఉద్యోగాల్లో విపరీతమైన రాజయోగం కలుగుతుంది. ఈ రాశికి చెందిన ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు భారీగా లాభాలను పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. వేరే ఉద్యోగం కోసం చూస్తున్న వ్యక్తులకు మరింత మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సమాజంలో సర్వత్రా గుర్తింపు లభిస్తుంది.
సింహ
ఈ రాశి వారికి నాలుగు, పదో స్థానంలో ఈ గజకేసరి, బుధాదిత్య మహా యోగాలు ఏర్పడుతున్నాయి. దీని కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులకు కీలకమైన శుభపరిణామాలు చోటు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం పరంగా ఈ రాశి వారికి మంచి రోజులు ఉండనున్నాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు భారీగా వృద్ధి చెందుతాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఆదాయం పెరుగుతుంది.
వృశ్చిక
ఈ రాశిలో ఇప్పటికే ఏర్పడి ఉన్న బుధాదిత్య యోగాన్ని సప్తమ స్థానంలో ఉన్న గజకేసరి యోగం వీక్షిస్తుంది. దీని కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులకు విపరీతమైన రాజయోగ ప్రయోజనాలు కలుగుతాయి. సమాజంతో పాటు ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఈ రాశికి చెందిన వ్యక్తుల ప్రాభల్యం పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో ఈ రాశికి చెందిన వ్యక్తులకు పెళ్లి కుదురుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి రాణిస్తారు. ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారమవుతాయి.
మకరం
ఈ రాశి వారికి పంచమ, లాభ స్థానంలో గజకేసరి, బుధాదిత్య యోగాలు ఏర్పడుతున్నాయి. దీని కారణంగా ఈ మూడు రోజులు ఈ రాశికి చెందిన వ్యక్తులు ఏ పనులు చేపట్టినా అది విజయవంతమై తీరుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఈ రాశికి చెందిన వ్యక్తుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు కుటుంబంలో సంతోషాలు నెలకొంటాయి.
కుంభ
ఈ రాశికి నాలుగు, పదో స్థానంలో ఈ రెండు మహా యోగాలు ఏర్పడుతున్నాయి. దీని వల్ల ఈ రాశికి చెందిన వ్యక్తులకు కూడా ఈ విపరీత రాజయోగ ఫలితాలు లభించనున్నాయి. వ్యక్తిగత, ఆస్తి సంబంధిత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. శారీరక, మానసిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. కుటుంబంలో మంచి వాతావరణం నెలకొంటుంది. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. విదేశీ వ్యక్తితో పెళ్లి కుదురుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications