Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
Gajkeshari rajyog: రెండు రోజుల్లో గజకేసరి రాజయోగం..ఈ 3 రాశుల వారికి కలలో కూడా ఊహించనంత డబ్బు
జోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్దిష్ట కాలం తర్వాత రాశి పరివర్తన, నక్షత్ర మార్పులకు గురవుతుంది. జ్యోతిష్యం ప్రకారం చంద్రుడు అత్యంత వేగంగా కదులుతున్న గ్రహంగా పరిగణిస్తారు.చంద్రుడు దాదాపు రెండున్నర రోజుల పాటు ఒక రాశిలో ఉంటాడు. అటువంటి పరిస్థితిలో చంద్రుడు ఏదో ఒక గ్రహంతో సంబంధం కలిగి ఉంటాడు. ఇది శుభ లేదా అశుభ యోగాన్ని సృష్టిస్తుంది. ఇదిలా ఉండగా గురుడు ప్రస్తుతం వృషభరాశిలో ఉన్నాడు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు, గురు గ్రహం ఒకే రాశిలో ఉన్నప్పుడు గజకేసరి రాజయోగం(Gajkeshari rajyog) ఏర్పడుతుంది, ఈ యోగం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ యోగం ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఈ శుభ యోగం వల్ల 12 రాశులలో కొన్ని రాశుల వారు జీవితంలో సంతోషం, శ్రేయస్సు పొందుతారు. పంచాంగం ప్రకారం డిసెంబర్ 13 శుక్రవారం మధ్యాహ్నం 1:18 గంటలకు చంద్రుడు వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయానికి ఆల్రెడీ గురుడు వృషభరాశిలో ఉంటాడు. కాబట్టి చంద్రుడు, గురు గ్రహ కలయిక గజకేసరి రాజయోగాన్ని సృష్టిస్తుంది.

గజకేసరి యోగంతో భారీగా లాభఫడే రాశులు ఇవే
వృషభం
నచ్చిన ఉద్యోగం లభిస్తుంది. సంపద పెరుగుతుంది. ఎప్పటినుంచో లాక్ చేయబడిన డబ్బు రికవరీ అవుతుంది. ఈ రాశి వారికి జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యక్తిగత, వృత్తి జీవితంలో పురోగతి ఉంటుంది. అన్ని విషయాల్లో విజయం వరిస్తుంది. పాజిటివ్ గా ఉంటారు. పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు.
కన్య
కన్యా రాశి వాళ్లు కూడా గజకేశరి యోగంతో చాలా ప్రయోజనం పొందుతారు. ప్రతి పనిలో మీ కుటుంబం మీకు సపోర్ట్ గా నిలబడుతుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది. పనిలో మీకు ప్రశంసలు అందుతాయి.గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేస్తే ఆర్థిక లాభాలకు బలమైన అవకాశం ఉంది. మనస్సు మతపరమైన పనులలో ఉంటుంది. జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ మీరు వాటిని అధిగమించగలుగుతారు.
వృశ్చిక రాశి
గజకేసరి యోగం వృశ్చిక రాశి వారికి కూడా చాలా మేలు చేస్తుంది. కొత్తగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు ఊహించని విధంగా డబ్బు పొందుతారు. భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. భాగస్వామితో బంధం బలపడుతుంది.ఆదాయం పెరుగుతుంది. ఈ సమయంలో కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు బలంగా ఉంటాయి. అకస్మాత్తుగా సంపద పొందుతారు. జీవితంలో చాలా పెద్ద మార్పులు వస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications