రంగురాళ్ల మహిమ..బాలీవుడ్ నటుల జీవితాల్లో అద్భుతాలు...ఏ రాయి ఎవరి అదృష్టాన్ని మార్చిందో తెలుసా?

సినిమా సెలబ్రిటీల గురించిన ఏ విషమైనా తెలుసుకోడానికి చాలామంది ఆసక్తి చూపెడుతుంటారు. అయితే తెరపై మెరిసే తారలు తెర వెనుక తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంటారు. చాలామంది సెలబ్రిటీలు తమ అదృష్టం కోసం, మంచి కెరీర్ కోసం జ్యోతిష్య పండితులు సూచించే రంగు రాళ్లను ధరిస్తుంటారు. వీరిలో మన ఫేవరెట్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. కొంతమంది ఫేమస్ బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ రంగు రాళ్లని ధరించడానికి ముందు, ధరించిన తర్వాత వాళ్ల లైఫ్ స్టైయిల్ ఎట్లా ఉంది..రంగు రాళ్లలో దాగి ఉన్న రహస్యమే వారి సక్సెస్ కు కారణమవుతుందా వంటి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కరీనా కపూర్
తన అందం, నటనతో బాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణులలో కరీనా కపూర్ ఒకరు. ఈ బాలీవుడ్ బ్యూటీని ముద్దుగా బేబో అని పిలుస్తారు. ఆమె కుటుంబసభ్యులు, సన్నిహితులు, అభిమానులు చాలామంది ఆమెను ఆ పేరుతొనే సంబోధిస్తుంటారు. కరీనా కపూర్ తన అనేక సినిమాల్లో ఎర్ర పగడం(read coral), ముత్యం(peral)ధరిస్తుంది. జ్యోతిష్య ప్రయోజనాలు పొందడానికి ఆమె ఈ రెండింటిని ధరిస్తుంది. ముత్యం రాయి ఆమె కోపాన్ని కంట్రోల్ చేయడంలో..ఎర్ర పగడం నెగిటివ్ ఎనర్జీస్, శత్రువులను దూరంగా ఉంచడంలో,ఆధ్యాత్మిక వైద్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. అంగారకుడికి సంబంధించినది కావున ఎర్ర పగడంని మేషం, వృశ్చిక రాశి వాళ్లు ధరించవచ్చు..ముత్యం చంద్రుడికి సంబంధించనది.. కర్కాటక రాశి వ్యక్తులు దీనిని ధరించవచ్చు.

gemstone secret bollywood celebrities and their lucky stones

అమితాబ్ బచ్చన్

అమితాబ్ బచ్చన్ గురించి తెలియని భారతీయుడు ఉండరంటే అతిశయోక్తి లేదు. అమితాబ్ తన జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాడు. ఒకదశలో ఆయన సినిమాలు ఆడక కెరీర్ ఇబ్బందుల్లోకి వెళ్లిపోయింది. ఏ పని చేసినా ఆయనకు దురదృష్టమే వెంటాడుతుండేది. ఆ టైంలో ఓ జ్యోతిష్య నిపుణుడి సూచన ప్రకారం అమితాబ్ బచ్చన్..నీలం రాయిని ధరించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత నుంచి ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం 80 ఏళ్లు దాటినా కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాల్లో నటిస్తున్నారు. అమితాబ్ ధరిచిన నీలం రాయి శని గ్రహానికి సంబంధించినదని..ఇదే సాడే సతి కష్టకాలాన్ని కూడా తొలగిస్తుందని పండితులు చెబుతున్నారు.

సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ చేతికి ఎప్పుడూ ఓ టర్కోయిస్ బ్లాస్లెట్ ఉండటాన్ని మనలో చాలామంది గమనించే ఉంటాం. అయితే ఆయన అదేదో స్టైల్ లుక్ కోసం ధరించాడులే అని అనుకుంటారు చాలామంది. మీరు కూడా అలా అనుకుంటే పొరబడినట్లే. దాని వెనుక పెద్ద కథే ఉంది. టర్కోయిస్ స్టోన్ ని కొన్ని మతాలలో అదృష్టంగా భావిస్తారు. ఇది ధరించినోళ్లకి జీవితంలో ఆర్థిక విజయం, ఆరోగ్యం, జ్ణానం ఉంటుందని నమ్ముతారు. ఈ టర్కోయిస్ రాయిని ధరిస్తే జాతకంలో బృహస్పతి స్థానం బలపడుతుంది. ధనస్సు రాశి వారు ఈ స్టోన్ ని ధరిస్తే దాని ప్రయోజనాలు పొందచవ్చని పండితులు చెబుతున్నారు.

శిల్పా శెట్టి
ఒకప్పుడు శిల్పా శెట్టి అంటే కుర్రాళ్లలో విపరీతమైన క్రేజ్. వెండితెరపై ఆమె కనబడితే చప్పట్లు, విజిల్స్. సినిమాలతో పాటు బిజినెస్ లోకి కూడా దిగి బాగానే సంపాదించింది. శిల్పా శెట్టి లగ్జరీ లైఫ్ స్టైయిల్ అందరినీ ఆకర్షిస్తుంటది. ఈ బ్యూటీకి తరచూ తన ఫిట్ నెస్, యోగా వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటి. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఫిట్ నెస్ ఐకాన్ గా కూడా మారిన శిల్పా శెట్టి పచ్చ రాయి ఉంగరం ధరిస్తుంది. ఇది ధరించిన తర్వాతనే ఆమె ఓ ఐపీఎల్ టీమ్ ని సొంతం చేసుకుంది. సొంతంగా ఓ ప్రైవేట్ జెట్ ని కూడా శిల్పా శెట్టి కొనింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అదృష్టం, ఆరోగ్యం, సంపదను ఆకర్షించడానికి మీరు ధరించగల బెస్ట్ స్టోన్స్ లో ఇదొకటి.

ఏ ఆర్ రెహమాన్
ప్రఖ్యాత సంగీత స్వరకర్త, గాయకుడు, పాటల రచయిత, ఆస్కార్ అవార్డ్ విన్నర్ కూడా అయిన ఏ ఆర్ రెహమాన్ గురించి తెలియని వాళ్లు చాలా తక్కువమందే ఉంటారు. తన ప్రత్యేకమైన సంగీత శైలితో భారతీయ సినిమా సంగీతంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి రెహమాన్. వాస్తవానికి రెహమాన్ అసలు పేరు దిలీప్ కుమార్.. ఇస్లాం మతం స్వీకరించిన తర్వాత ఆయన తన పేరుని మార్చుకున్నారు. రెహమాన్ కెరీర్ ఎప్పుడూ టాప్ లో ఉండటానికి ప్రధాన కారణాల్లో నీలం రాయి ఒకటి. రెహమాన్ నీలం రంగు రాయిని ధరిస్తారు. నీలం రాయి శని గ్రహానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. దీన్ని ధరిస్తే డబ్బు, స్టార్ డమ్ వస్తాయంట. అయితే నీలం రాయి చాలా పవర్ ఫుల్ కాబట్టి అనుభవజ్ణుడైన జ్యోతిష్య నిపుణుడిని సంప్రదించాకనే దాన్ని ధరించాలి.

అజయ్ దేవగన్
బాలీవుడ్ లో యాక్షన్, సీరియస్ పాత్రలకు పర్ఫెక్ట్ గా సూటయ్యే వ్యక్తి ఎవరు అనే ప్రశ్న వస్తే అజయ్ దేవగన్ అని అందరూ ఠక్కున సమాధానం చెప్తారు. తన కెరీర్ లో మూడు జాతీయ చలనచిత్ర అవార్డులతో పాటు అనేక ఇతర అవార్డులను దక్కించుకున్నారు. పద్మశ్రీ కూడా ఆయనను వరించింది. అజయ్ దేవగన్ ఒకనొక దశలో చేతిలో సినిమాలు లేక బాగా ఇబ్బంది పడ్డాడు..ఆ టైంలో ఆయన ఓ జ్యోతిష్య నిపుణుడి సలహా మేరకు పుష్యరాగం ధరించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కెరీర్ లో దూసుకుపోయాడు..ఎన్నడూ వెనుదిరిగి చూడలేదు. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే పుష్యరాగం ధరించవచ్చని పండితులు చెబుతుంటారు.

ఐశ్వర్య రాయ్
అందానికి మరో పేరు ఉంటే అది ఐశ్వర్యరాయ్ అని చెబుతుంటారు. 1994లో ప్రపంచ సుందరి కిరిటాన్ని కూడా దక్కించుకున్న ఐశ్వర్యరాయ్ నీలం రాయి ఉంగరం ధరించి చాలాసార్లు కనిపించింది. సినిమా కెరీర్ ప్రారంభంలో ఐశ్వర్య రాయ్ తన నటన ఆశించిన స్థాయిలో లేదంటూ వచ్చిన వార్తలు ఆమెను ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. ఆ తర్వాత ఆమె నీలం రాయిని ధరంచినట్లు సమాచారం. నీలం రాయి తక్షణమై అదృష్టాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుందట. అదృష్టం కోసం ప్రతికూలతలన్నీ తొగిపోవడానికి దీనిని ధరించం మంచిదట.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Desktop Bottom Promotion