Latest Updates
-
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే సంతోషానికి సంతోషం, భర్తలకు అదృష్టం కూడా..
జాతకం మనిషి జీవితంపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎప్పుడు పుట్టాం.. పుట్టిన సమయంలో జన్మ నక్షత్రం, రాశి, సమయం ఇలా ప్రతీది జీవితంలో మనం ఎలా ఉంటాం, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో జ్యోతిష్యం చెప్పేస్తుంది. న్యూమరాలజీ ఆధారంగా భవిష్యత్తును అంచనా వేయవచ్చు అని చెబుతారు న్యూమరాలజిస్టులు. సంవత్సరం, తేదీ సమయం అన్ని లెక్కించి వచ్చే సంఖ్య ఆధారంగా వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తును అంచనా వేస్తుంటారు.

న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా అణకువగా, మంచి వ్యక్తులుగా, అద్భుతమైన వ్యక్తిత్వంతో అదృష్టాన్ని తీసుకువస్తారని న్యూమరాలజీ చెబుతోంది. న్యూమరాలజీ ప్రకారం కొన్ని సంఖ్యలు వచ్చేలా జన్మించిన అమ్మాయిలు మంచి భార్యలగా ఉండటమే కాకుండా భర్తకు అదృష్టం తెచ్చిపెడతారని శాస్త్రం చెబుతోంది. ఆ తేదీలు ఏంటో, ఆయా తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎలా అదృష్టాన్ని తీసుకువస్తారో చూద్దామా..
2వ తేదీన పుట్టిన అమ్మాయిలు మంచి భార్యలవుతారు:
న్యూమరాలజీ ప్రకారం 2వ తేదీన పుట్టిన అమ్మాయిలు మంచి భార్యలు అవుతారు. వీరు భర్తతో, అత్తింటి కుటుంబ సభ్యులతో చాలా సఖ్యతగా ఉంటూ.. ప్రేమాభిమానాలు పంచుతారు. 2వ తేదీన పుట్టిన అమ్మాయిలు చాలా ఎమోషనల్ గా ఉంటారు. అలాంటి అమ్మాయిలు ఎవరితో సంబంధంలో ఉంటారో వారితో పూర్తిగా నిజాయితీగా ఉంటారు.
ప్రేమాభిమానాలు పంచుతారు:
ఈ అమ్మాయిలు తమ భర్తలకు అదృష్టాన్ని తెచ్చిపెడతారు. వారి కోసం ఏదైనా చేయడానికి సదా సిద్ధంగా ఉంటారు. భర్తను ఎలా ప్రేమించాలి, భర్త ప్రేమను ఎలా పొందాలో వీరికి బాగా తెలుసు. వీరి మంచి మనుసు, దయా హృదయం వీరిని అందరికీ దగ్గర చేస్తుంది. ఆత్మాభిమానం ఎక్కువ. ప్రేమాభిమానాలను ఎక్కువగా కనబరుస్తారు. సంబంధానికి విలువ ఇస్తారు. గౌరవ మర్యాదలను కాపాడుతారు. చిన్నవారితో, పెద్ద వారితో ఒకేరకమైన గౌరవాన్ని, ప్రేమను పొందుతారు.
అదృష్టాన్ని తెచ్చిపెడతారు:
2వ తేదీన పుట్టిన అమ్మాయిలు మంచి భార్యలుగా ఉండటమే కాకుండా భర్తకు అదృష్టాన్ని తెచ్చిపెడతారు. వీరు ఒకరి జీవితంలోకి అడుగు పెట్టగానే ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ పని మొదలు పెట్టినా విజయవంతంగా అవుతుంది.
భర్తలకే కాకుండా ఇంటి కుటుంబసభ్యులకు అదృష్టాన్ని తీసుకువస్తారు. ఈ అమ్మాయిలు తమ వెంట అదృష్టాన్ని తీసుకెళ్తారు. వీరు వెంట ఉంటే భర్తలు విజయం సాధిస్తారు. వీళ్లు ఎదురొస్తే తలపెట్టిన కార్యం పూర్తవుతుంది. కుటుంబ సభ్యులను సంతోష పెట్టడానికి ఈ అమ్మాయిలు ప్రయత్నిస్తుంటారు.
ఆ ప్రయత్నంలో విజయం కూడా సాధిస్తారు. ఈ అమ్మాయిలు భర్తల హృదయంలో చాలా సులభంగా స్థానం పొందుతారు. వీరికి పుట్టింటి నుంచి అత్తింటికి వచ్చినా.. ఆ సౌకర్యం ఎప్పుడూ ఉంటుంది. వీరు అడుగు పెట్టారంటే వృద్ధికి బాటలు పడ్డట్లే.
స్వచ్ఛమైన మనసు, ప్రేమను పంచే వ్యక్తిత్వం:
ఈ అమ్మాయిలది చేలా స్వచ్ఛమైన మనసు. ఒక్కసారి అభిమానించడం మొదలు పెడితే జీవితాంతం అలాగే ఉంటారు. అణకువతో పాటు తెలివి కూడా వీరి సొంతం. తెలివితేటలు ఉన్నాయన్న పొగరు ఏమాత్రం కనిపించదు. స్వచ్ఛమైన హృదయం వీరి సొంతం. ఆ స్వచ్ఛతతో చాలా మందిని ఆకట్టుకుంటారు.
మంచి మాట, అంతకు మించిన మంచి వ్యక్తిత్వం, ఇతరుల సంతోషం చూసి ఆనందించడం, ఇతరుల గెలుపునూ ఆస్వాదించడం, అబద్ధాలు చెప్పకపోవడం, మోసాలు చేయకపోవడం వీరి మంచి మనసుకు నిదర్శనం. మనసులో ఉన్నది మంచి పద్ధతిలో వ్యక్తీకరిస్తారు. లోపల ఒకటి ఉంచుకుని బయటకు ఒకటి మాట్లాడటం వీరికి చేతగాదు.
ఇతరుల బాధలకు కలత చెందుతారు:
2వ తేదీన పుట్టిన అమ్మాయిలు ఇతర బాధలకు నొచ్చుకుంటారు. వారి దుఃఖం చూసి కలత చెందుతారు. ఎదుటి వారి బాధ చూసి వారూ బాధపడతారు. ఆపదలో ఉన్న వారికి తోచినంత సహాయం చేస్తారు. నిరుపేదలకు తోచినంత దానం చేస్తుంటారు.
ఉన్నదాంట్లో చేతనైనంత సాయం చేస్తూ పుణ్యం సంపాదిస్తారు. మాట సాయం, చేత సాయం చేస్తూ అందరితో సత్సంబంధాలు నెరుపుతారు. వీరి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వీరికి శత్రువులు లేకుండా చేస్తుంది. వారి మాటతీరు కోపాన్ని కూడా దూరం చేస్తుంది. దయాగుణం చూసి ఇతరుల మనసు కూడా కరుగుతుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications