Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
August Grah Gochar: ఆగస్టు 2023లో 4 గ్రహాల సంచారం.. ఈ రాశుల వారికి జాక్‌పాట్
వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం ప్రతి నెల ఒకటి లేదా అంతకంటే ఎక్కువే గ్రహ సంచారాలు జరుగుతుంటాయి. వనగ్రహాల సంచారం, రాశుల పరిభ్రమణం ఒక్కో రాశి వారిపై ఒక్కోలా ఉంటుంది. ఈ గ్రహాల కదలిక, కలయిక వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసివస్తే, మరికొన్ని రాశుల వారికి కష్టాలు చుట్టుముడతాయి. ఈ ఏడాది ఆగస్టు 2023 లో 4 గ్రహ సంచారాలు ఉండనున్నాయి.
ఆగస్టు 2023లో జరిగే గ్రహ సంచారాల వల్ల కొన్ని రాశుల వారికి లాభం చేకూరనుంది. అదృష్టం కలిసి వస్తుంది. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సమస్యలు తొలగిపోతాయి. అలాగే కొన్ని రాశుల వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఆగస్టులో జరిగే ఆ గ్రహ సంచారాలు ఏమిటి.. వాటి వల్ల లాభపడే ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆగస్టు 2023 గ్రహ సంచారం
ఆగస్టులో సూర్యుడు, అంగారకుడు, శుక్రుడు వంటి గ్రహాల సంచారం ఆగస్టులో ఉండనుంది. గ్రహ సంచారాల దృష్ట్యా ఆగస్టు నెల ప్రత్యేకంగా ఉండబోతోంది. రాశిచక్ర గుర్తులపై గ్రహాల సంచారం ప్రభావం ఉంనుంది. ఆగస్టులో 3 ప్రధాన గ్రహాలు సంచరించబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఏదైనా గ్రహం యొక్క సంచారం ఒక వ్యక్తి జీవితంపై శుభ లేదా అశుభ ప్రభావాన్ని చూపుతుంది.
జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడుతుంది. నవగ్రహాలకు అధిపతిగా, రాజుగా పిలుస్తారు. ఆ తర్వాత చంద్ర గ్రహం ఉంటుంది. అలాగే నవగ్రహాల్లో కుజుడు, బుధుడు, గురు, శుక్రుడు, శని గ్రహాలు కూడా ముఖ్యమైనవే. రాహు-కేతులను పాప గ్రహాలుగా, ఛాయా గ్రహాలుగా పరిగణిస్తారు. ఈ గ్రహాలన్నీ ఒక నిర్దిష్ట కాలం తర్వాత రాశిచక్రం, సంచారం, తిరోగమనం, నక్షత్ర సముదాయం మారడం, ఉదయించడం లేదా అస్తమించడం జరుగుతుంది.
ఆగస్టులో సూర్యుడు, కుజుడు, శుక్రుడు వారి రాశి చక్రాలను మారు్తాయి. బుధుడు తిరోగమనంలో కదలనున్నాడు.
సూర్య గోచార్ ఆగస్టు 2023
నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తాడు. ఆగస్టు 17, 2023 మధ్యాహ్నం 1.23 గంటలకు సూర్యుడు తన సొంత రాశి అయిన సింహ రాశిలో సంచరించనున్నాడు. ఈ సంచారం వల్ల పలు రాశుల వారికి అదృష్టం వరించనుంది. మేషం, సింహరాశితో సహా అనేక రాశుల వారికి సూర్య సంచారం శుభప్రదం అవుతుంది.
మంగళ్ గోచార్ ఆగస్టు 2023
అంగారకుడిని ధైర్యానికి, శక్తికి కారకుడిగా పరిగణిస్తారు. ఆగస్టు 18వ తేదీ పగలు 3.14 గంటలకు కుజుడు కన్యారాశిలోకి సంచరించనున్నాడు. మేషం, కన్య, మిథునం, కర్కాటకం, వృశ్చిక రాశుల వారికి లాభాలు కలగనున్నాయి. అదృష్టం వరించనుంది.
శుక్ర గోచార్ ఆగస్టు 2023
శుక్ర గ్రహాన్ని సంపద, లగ్జరీ, శ్రేయస్సు, భౌతిక ఆనందాలకు కారకంగా చూస్తారు. ప్రస్తుతం శుక్రుడు సింహరాశిలో తిరోగమనంలో కదులుతున్నాడు. ఆగస్టు 3వ తేదీ సాయంత్రం 7.37 గంటలకు సింహరాశిలో శుక్రుడు అస్తమించనున్నాడు. ఆ తర్వాత ఆగస్టు 19వ తేదీన ఉదయం 5.21 గంటలకు కన్యారాశిలో ఉదయిస్తాడు. దీని వల్ల కన్యారాశి, తులారాశి, వృషభ రాశి వారు అదృష్టాన్ని అందుకోనున్నారు. మంచి ఫలితాలు దక్కుతాయి.
బుధుడి తిరోగమనం ఆగస్టు 2023
బుధ గ్రహాన్ని మేధస్సుకు కారకంగా పరిగణిస్తారు. ఆగస్టు 24వ తేదీన మధ్యాహ్నం 12.52 గంటలకు సింహరాశిలో బుధుడు తిరోగమనంలో కదులుతాడు. బుధ గ్రహ తిరోగమనం ప్రభావం పలు రాశుల వారికి మంచి ఫలితాలు కలగనున్నాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications