గురు అతిచారి ఎఫెక్ట్.. 2032 వరకు ఈ రాశులకు ఊహించని లాభాలు, సకల సుఖాలు

గ్రహాల గమనం తరచుగా మారుతూ ఉంటుంది. ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రత్యేకమైన కాల వ్యవధి ఉంటుంది. గ్రహాల గురువుగా పిలవడబడే అదృష్టానికి కారకుడైన బృహస్పతి గ్రహం ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారడానికి దాదాపు 12 నుండి 13 నెలల సమయం పడుతుంది. అయితే 2025 మే 14న రాత్రి 11 గంటల 20 నిమిషాలకు ఒక అద్భుతమైన సంఘటన జరగబోతోంది. ఆ సమయంలో బృహస్పతి బుధుడితో కలిసి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అంతేకాకుండా బృహస్పతి అతిచారిగా మారతాడు. అతిచారి అంటే.. తన సాధారణ వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించడం. ఇది చాలా అరుదైన విషయం.

ఈ అతిచారి బృహస్పతి ఏకంగా 7 సంవత్సరాల పాటు అంటే 2032 వరకు మిథున రాశిలోనే ఉంటాడు. ఈ క్రమంలో ఈ గురు అతిచారి ప్రభావం ఏ రాశి వారి మీద ఉంటుంది? ఎవరికి కష్టాలు వస్తాయి? ఎవరికి బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది? దీని ప్రభావం ఒక్కో రాశిపై ఎలా ఉంటుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

guru atichari 2025 jupiter enters gemini impact on all 12 zodiac signs

మేషం
మేష రాశి వ్యక్తులకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించడం ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ గురు అతిచారి సంచారం సమయంలో మీ మనస్సు ఆధ్యాత్మిక చింతనల వైపు మళ్లుతుంది. దైవానికి సంబంధించిన విషయాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. కొత్త ఆలయాలను సందర్శించడం లేదా మతపరమైన గ్రంథాలను చదవడం వంటివి మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. అయితే మీ తొమ్మిదవ ఇంటిపై బృహస్పతి దృష్టి ఉండటం వల్ల మతపరమైన విషయాలలో లేదా ఆధ్యాత్మిక గురువుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది. కొందరు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే లేదా మోసం చేసే ప్రయత్నం చేయవచ్చు.

చదువు, ఉద్యోగం లేదా శాశ్వతంగా స్థిరపడటం కోసం కావచ్చు విదేశాలకు వెళ్లాలనే కోరిక నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్నోళ్లకు ఇది చాలా మంచి సమయం. రచయితలు తమ కలాలకు మరింత పదును పెట్టగలరు, మీడియా రంగంలోని వారికి కొత్త విజయాలు ఎదురుచూస్తున్నాయి. కళాకారులకు వారి ప్రతిభను ప్రపంచానికి చాటే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలకు, మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది.

వృషభం
వృషభ రాశి జాతకులకు బృహస్పతి సాధారణంగా ఆదాయానికి,కుటుంబ ఆస్తికి కారకుడిగా ఉంటాడు. సాధారణంగా బృహస్పతి అనుగ్రహం ఉంటే అదృష్టం కలిసి వస్తుంది,ఆర్థికంగా పుంజుకుంటారు. కానీ ఈసారి పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. మీ రాశిలోని ఎనిమిదవ ఇంటికి బృహస్పతి అధిపతి కావడం వల్ల ఈ గురు సంచార సమయంలో మీకు ఆర్థికపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఊహించని ఖర్చులు రావచ్చు లేదా పెట్టుబడులు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఈ సమయంలో ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది.

ఆరోగ్యం విషయంలో కూడా కాస్త అప్రమత్తంగా ఉండాలి. సంచార బృహస్పతి మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ సమయంలో కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రహస్యమైన విషయాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన మీకు మానసిక ప్రశాంతతను ఇవ్వగలదు. పరిశోధన వంటి రంగాల్లో ఉన్నవారికి ఇది మంచి సమయం కావచ్చు. మొత్తంగా చూస్తే వృషభ రాశి వ్యక్తులు ఈ గురు అతిచారి సంచారం యావరేజ్ ఫలితాలను ఇస్తుంది.

మిథునం
మిథున రాశి వాళ్లకి బృహస్పతి మీ సొంత ఇంట్లోకి అంటే మొదటి ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. ఇది ఒక ముఖ్యమైన పరిణామం..కానీ దీని ప్రభావాలు అంత సానుకూలంగా ఉండకపోవచ్చు. ఈ సమయంలో మీ మనస్సులో అనేక రకాల ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు అవి మిమ్మల్ని అయోమయానికి గురిచేయవచ్చు లేదా చికాకు కలిగించవచ్చు. ఉద్యోగం చేసేవారికి ఈ సమయం కొంచెం గందరగోళంగా ఉండవచ్చు. ఉద్యోగ నిమిత్తం మీరు తరచుగా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు లేదా ఉన్న ఉద్యోగం మారి మరొకటి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. వ్యాపారస్తులకు కూడా గురు అతిచారి సంచారం అంత ఆశాజనకంగా లేదు.

వ్యాపారులకు ఊహించిన స్థాయిలో లాభాలు రాకపోవచ్చు. దీనివల్ల మీరు కొంత ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా మీరు స్థిరంగా ఉన్నప్పటికీ మీ ఖర్చులు పెరగడం వల్ల మీ ఆదాయం సరిపోవడం లేదని మీరు భావించవచ్చు. పొదుపుపై దృష్టి పెట్టడం మంచిది. మీ భాగస్వామితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద వివాదాలకు దారితీయవచ్చు. మొత్తంగా చూస్తే మిథున రాశి వారికి ఈ గురు అతిచారి సంచారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది.

కర్కాటకం
కర్కాటక రాశి వారికి బృహస్పతి సంచారం కొన్ని సవాళ్లను తీసుకురావచ్చు. ఊహించని పనులు వచ్చి పడటం లేదా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాల్సిన ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఆర్థికంగా కొన్ని అవసరాల కోసం మీరు రుణం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఖర్చులను అదుపులో ఉంచుకోవడం, అనవసరమైన వాటికి దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు ఈ సమయం ఒత్తిడితో కూడుకున్నదిగా ఉండవచ్చు. పనిభారం పెరగడం లేదా లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సి రావడం మిమ్మల్ని నిరాశకు గురిచేయవచ్చు.

సహోద్యోగులతో సంబంధాలు కూడా అంత సామరస్యంగా ఉండకపోవచ్చు. అయితే కొత్త అవకాశాలు కూడా తలుపు తట్టే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు డబ్బు సంపాదించడానికి సహాయపడే కొత్త ఆలోచనలు మీకు రావచ్చు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు ప్రేరణ పొందవచ్చు.

సింహం
సింహ రాశి వారికి బృహస్పతి సంచారం నిజంగా ఒక వరంగా రాబోతోంది. ఈ సమయం మీ కోరికలు నెరవేరే కాలం. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు సాకారం కావచ్చు. అనేక విధాలుగా మీరు ప్రయోజనాలను పొందబోతున్నారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఇది ఒక గొప్ప సమయం. మీ పనితీరు మెరుగుపడుతుంది. మీ కెరీర్‌ లో ఒక బలమైన పునాది ఏర్పడుతుంది. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది, మీ ప్రయత్నాలు ప్రశంసించబడతాయి. ఉన్నతాధికారుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీ స్థానం మరింత బలపడుతుంది.

ఒకవేళ మీరు ట్రేడింగ్ లేదా స్టాక్ మార్కెట్‌ లో పెట్టుబడులు పెడుతుంటే ఈ సమయం మీకు నిజంగా అద్భుతంగా ఉంటుంది. మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. మంచి లాభాలు రావడంతో మీ పొదుపు పెరుగుతుంది. భవిష్యత్తు కోసం మీరు కొన్ని ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మొత్తంగా చూస్తే సింహ రాశి వారికి ఈ గురు అతిచారి సంచారం అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతోంది.

కన్య
కన్య రాశి వ్యక్తులకు బృహస్పతి మీ దశమ స్థానంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇది మీ జీవితంలో ముఖ్యమైన మార్పులకు నాంది పలుకుతుంది. కన్య రాశి వారికి ఈ సంచార గురువు అదృష్టాన్ని కూడా తీసుకురాబోతున్నాడు. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా మీరు బలపడతారు. మీరు మీ సంబంధాలపై, మీ కెరీర్‌పై మరింత దృష్టి పెడతారు. ఉద్యోగం చేసేవారికి ఒక గుడ్ న్యూస్ ఉంటుంది.

మీ కెరీర్ ఒక కొత్త మలుపు తిరగబోతోంది. ఈ సమయంలో మీ ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు లేదా ఉద్యోగ మార్పు వంటి ఒక ప్రయోజనకరమైన మార్పు వచ్చే అవకాశం ఉంది. మీ కెరీర్ ఒక కొత్త మలుపు తిరగబోతోంది. వ్యాపారస్తులకు ఇది నిజంగా పండగ సమయం. మీ వ్యాపారం విస్తరించే అవకాశం ఉంది. ఊహించని లాభాలను పొందవచ్చు. కొత్త భాగస్వామ్యాలు ఏర్పడవచ్చు.

తుల
తుల రాశి వ్యక్తులకు బృహస్పతి మీ అదృష్ట స్థానమైన తొమ్మిదవ ఇంట్లో కొలువుదీరబోతున్నాడు. ఇది మీకు నిజంగా ఒక అద్భుతమైన సమయం. ఈ కాలంలో మీరు మీ సామర్థ్యానికి మించి అద్భుతాలు సృష్టించగలరు. మీరు ఊహించని విజయాలు సాధిస్తారు, మీ ప్రతిభకు,కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రయాణించడానికి మీకు అనేక అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలు కూడా మీకు ఆర్థికంగా కలిసి వస్తాయి.

దూర ప్రాంతాలకు వెళ్లడం ద్వారా మీరు ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారం లేదా మరేదైనా లాభదాయకమైన ఒప్పందం కావచ్చు విదేశాల నుండి మీకు కొత్త, లాభదాయకమైన అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా మీరు మరింత బలపడబోతున్నారు. ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశాలతో మీరు కొత్త వ్యాపార ప్రణాళికలు వేయవచ్చు. మీ తెలివితేటలు, సరైన నిర్ణయాల వల్ల మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది.

వృశ్చికం
వృశ్చిక రాశి వ్యక్తులకు బృహస్పతి మీ ఎనిమిదవ ఇంట్లో సంచరించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఈ సమయంలో కొత్త ఉద్యోగ అవకాశాలను తేలికగా తీసుకోవద్దు. ఒకవేళ మీరు వాటిని పట్టించుకోకపోతే మీ కెరీర్‌ లో సమస్యలు తలెత్తవచ్చు. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసులో అనవసరమైన సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి.

వ్యాపారస్తులకు ఇది అంత అనుకూలమైన సమయం కాదు. మీ అవకాశాలు, మీ ఆదాయం తగ్గే ప్రమాదం ఉంది. ఈ అడ్డంకులను అధిగమించాలంటే మీరు ఒక క్రమబద్ధమైన ప్రణాళికతో ముందుకు సాగాలి. డబ్బు సంపాదన మాత్రం సాధారణంగా ఉంటుంది. మీరు సంపాదించినప్పటికీ పొదుపు చేయడం మాత్రం కష్టంగా మారవచ్చు.

ధనస్సు
ధనుస్సు రాశి వ్యక్తులకు బృహస్పతి సంచారం మీలో ఆధ్యాత్మిక చింతనలను రేకెత్తిస్తుంది. దైవం పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం మీరు కొంత ఎక్కువ మొత్తంలో డబ్బును వెచ్చించవచ్చు. తీర్థయాత్రలు చేయడం లేదా మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం వంటివి మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. పని విషయంలో మీకు ఎక్కువ ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఏర్పడవచ్చు. ఈ ప్రయాణాలు కొన్నిసార్లు మీకు కాస్త కష్టంగా అనిపించినప్పటికీ వాటి ద్వారా మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు, మీ పరిధి విస్తరిస్తుంది.

ధనుస్సు రాశి వ్యాపారస్తులకు ఇది నిజంగా లాభాల పంట పండించే సమయం. ఒక తెలివైన వ్యూహంతో మరియు పక్కా ప్రణాళికతో ముందుకు సాగితే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలను పొందవచ్చు. మీరు సంపాదించిన డబ్బును పొదుపు చేయడంలో కూడా విజయం సాధిస్తారు. మీ ఆర్థిక భవిష్యత్తు మరింత సురక్షితంగా మారుతుంది. మొత్తంగా ధనుస్సు రాశి వారికి ఈ గురు అతిచారి సంచారం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.

మకరం
మకర రాశి వ్యక్తులకు బృహస్పతి మీ ఆరవ ఇంట్లో సంచారం చేయబోతున్న ఫలితంగా మీకు అనూహ్యమైన ధనలాభం కలగవచ్చు. మీరు ఊహించని మార్గాల ద్వారా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ గురు సంచార సమయంలో మీరు రుణం తీసుకోవలసి వస్తే అది కూడా మీకు ప్రయోజనకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మీ ఉద్యోగంపై మరింత శ్రద్ధ చూపుతారు. ఒక రకమైన సేవా భావంతో మీరు పనిచేస్తారు..ఇది మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. మీ పనితీరు మెరుగుపడుతుంది. మీరు మీ సహోద్యోగుల మన్ననలు పొందుతారు. అయితే మీరు వ్యాపారం చేస్తుంటే మాత్రం ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యాపార పరిధిని విస్తరించడానికి ఇది సరైన సమయం కాదు. వ్యాపారంలో లాభాలు పొందడం కాస్త కష్టంగా ఉండవచ్చు. మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా మకర రాశి వారికి ఈ గురు అతిచారి సంచారం ఊహించని ధనలాభాలను, ఉద్యోగంలో సంతృప్తిని కలిగించినప్పటికీ వ్యాపారస్తులు మాత్రం ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది.

కుంభం
కుంభ రాశి వారికి ఈ సంచార బృహస్పతి నిజంగా ఒక అద్భుతమైన కానుకలాంటిది. ఇది మీకు అనుకూలమైన, ఎన్నో ప్రయోజనాలను అందించే సమయం. ఈ కాలంలో మీరు అనూహ్యమైన ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. మీలో ఒక కొత్త శక్తి ఉప్పొంగుతుంది. మీరు ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. కెరీర్ పరంగా ఇది మీకు స్వర్ణయుగం అవుతుంది. మీరు మీ ప్రస్తుత ఉద్యోగ పరిస్థితితో పూర్తిగా సంతృప్తి చెందుతారు. మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది.

ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. కెరీర్‌లో మీరు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. మీరు వ్యాపార రంగంలో ఉన్నట్లయితే ఈ సమయం మీకు తిరుగులేని విజయాన్ని అందిస్తుంది. మీ వ్యాపారం విస్తరిస్తుంది, మీరు ఊహించని లాభాలను ఆర్జిస్తారు. ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ నుండి మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. మీరు ఎంత ఎక్కువ డబ్బు సంపాదించాలని కోరుకుంటే మీకు అంత ఎక్కువ అవకాశాలు లభిస్తాయి.

మీనం
మీన రాశి వ్యక్తులకు ఈ గురు సంచారం మీ జీవితంలో మరింత సౌఖ్యాలను,విలాసాలను తీసుకురాబోతోంది. ఈ సమయంలో మీ దృష్టి అంతా మీ కెరీర్‌ పైనే ఉంటుంది. మీ వృత్తిపరమైన జీవితంలో మీరు ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. మీకు ప్రయాణించడానికి అనేక అవకాశాలు లభిస్తాయి. పని నిమిత్తం మీరు తరచూ దూర ప్రదేశాలకు వెళ్లవలసి రావచ్చు, అంతేకాదు మీకు బదిలీ వచ్చే అవకాశం కూడా ఉంది. మీలో పెరిగిన ఆత్మవిశ్వాసం, త్వరగా సరైన నిర్ణయాలు తీసుకునే మీ సామర్థ్యం కార్యాలయంలో మీకు గొప్ప విజయాన్ని అందిస్తాయి.

మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మీరు వ్యాపార రంగంలో ఉన్నట్లయితే ఈ సమయం మీకు నిజంగా ఒక స్వర్ణయుగం. మీరు మీ వ్యాపారంలో అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది, ఊహించని లాభాలను పొందుతారు. కొత్త పెట్టుబడులు మీకు మరింత లాభాలను తెచ్చిపెడతాయి. ఈ సమయంలో మీ ఆదాయంతో పాటు మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. మీరు కుటుంబ సంబంధిత కార్యక్రమాల కోసం, మీ ఆరోగ్యం కోసం కొంత డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Saturday, April 26, 2025, 7:33 [IST]
Desktop Bottom Promotion