గురుదోషం ఉంటే శనీశ్వరుడు వెంట ఉన్నట్లే.. పరిహారం చేసుకోకపోతే దరిద్రం వెంటే ఉంటుంది

హిందూ పురాణాల ప్రకారం జ్యోతిష్య శాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. నవగ్రహాల చలనం వల్లే మన జాతకంలో అనేక మార్పులు సంభవిస్తాయని అంతా నమ్ముతుంటారు. అయితే ఈ గ్రహాల్లో గురు గ్రహం అత్యంత ప్రాధాన్యత కల్గినదిగా భావిస్తారు. ఓ వ్యక్తి జాతకంలో గురు గ్రహ స్థానం బలమైన స్థానంలో ఉంటే వారు ఏ కార్యం చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారట. పెళ్లి, ఉద్యోగం,.. ఇలా ఏం చేసినా కలిసొస్తుందట.

Guru Graha Remedies Follow These Astrology Tips to Strengthen Jupiter Planet

గురుగ్రహం ఉందని ఎలా గుర్తించాలంటే..?

అదే గురుగ్రహం అశుభ స్థానంలో ఉంటే మాత్రం చాలా అశుభాలు జరుగుతాయి. శనీశ్వరుడిని నెత్తిన పెట్టుకొని వెళ్లినట్లే. వీరు ఏ పని చేసినా వైఫల్యం, నిరాశ వంటి ప్రతికూల ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మీకు మానసికంగా, ఆర్థికంగా నష్టాలు, అనారోగ్యం వస్తున్నాయంటే కచ్చితంగా మీకు గురు దోషం ఉన్నట్లే. మీరు ఏం చిసినా ఫలితం ఉండట్లేదన్నా, పెళ్లి కాకపోయినా మీరు గురుదోషం ఉన్నట్లుగా భావించాలి. వెంటనే వీటికి పరిహారం చేసుకోవాలి.


గురుదోషం ఇలా తొలగించుకోండి..!

గురుగ్రహం అశుభ స్థితిని తొలగించడానికి ప్రతీ గురువారం రోజు నానబెట్టిన శనగ పప్పును బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి. అలాగే స్నానం చేసే ముందు నీళ్లలో కొంచెం కుంకుమ లేదా పసుపు వేసుకొని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల గురు దోషాన్ని తొలగించుకోవచ్చు. అలాగే గురుడి స్థానాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు.


పసుపుతో ప్రత్యేక పూజలు:

హిందూ పురాణాల ప్రకారం ఎవరి జాతకంలో అయితే గురుదోషం ఉందో వాళ్లు పూజా సమయంలో ఎక్కువగా పసుపు వాడాలి. ముందుగా నుదిటిపై పసుపును తిలకంగా దిద్దుకోవాలి. మెడ, మణికట్టు మీద పసుపు బొట్టు పెట్టుకోవం వల్ల గురుడి స్థానం బలపడుతుందని చాలా మంది నమ్ముతుంటారు. ఇలా చేయడం వల్ల గురుదోషం పోయి సమస్యలన్నీ తొలగుతాయని ప్రజల నమ్మకం.


ప్రతీ గురువారం ఇలా చేస్తే గురుదోషం మాయం:

గురుదోషం ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటే మాత్రం ప్రతీ గురువారం రోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి. పూజా సమయంలో వినాయకుడికి పసుపును సమర్పించాలి. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ పరిహారం చేసిన వారికి జీవితాంతం సుఖ సంతోషాలు లభిస్తాయి.


ఇలా చేస్తూ వైవాహిక సమస్యలకు చెక్ పెట్టండి:

అలాగే వైవాహిక జీవితంలో ఎల్లప్పుడూ గొడవలు జరుగుతుంటే మీ ఇంటి ప్రధాన గోడపై పసుపుతో స్వస్తిక్ చిహ్నాన్ని వేయాలి. మీ కుటుంబంలో కూడా ఏదైనా సమస్యలు ఉంటే ఒక కుండలో మంచి నీటిని తీసుకొని.. అందులో కొంచెం పసుపు, గంగాజలాన్ని కలపాలి. ఆ తర్వాత మీ నీటిని ఇంట్లో మొత్తం చల్లాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ప్రేమ సంబంధాలు పెరుగుతాయి.

పైన చెప్పిన పరిహారాలన్నీ పాటిస్తే మాత్ర కచ్చితంగా ఫలితం ఉంటుంది. అన్ని సమస్యలు దూరం అవుతాయి. మీ వీలు, మీకు నచ్చిన పద్ధతిలో గురుగ్రహ దోషాన్ని తొలగించుకోండి.

Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.

Story first published: Wednesday, July 19, 2023, 16:30 [IST]
Desktop Bottom Promotion