Latest Updates
-
వంట చేసే ఓపిక లేదా? కేవలం 10 నిమిషాల్లో ఈ పచ్చిమిర్చి నువ్వుల రైస్ చేసి చూడండి, టేస్ట్ అదుర్స్! -
కుజ-గురు కలయికతో ద్విద్వాదశ యోగం..ఈ 4 రాశులకు అడుగడుగునా అదృష్టమే! -
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏదో తెలుసా?.. 90% మంది తప్పుగానే చెప్తారు! -
Jeera Biscuits Recipe:హెల్తీ, టేస్టీ జీరా బిస్కెట్స్..బేకరీని మించిన రుచితో ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
బ్రకోలీ, బాదంతో సూపర్ హెల్తీ పాస్తా..రుచి చూస్తే వదిలిపెట్టరు! -
3 నిమిషాల మ్యాజిక్..ఈ చిన్న పనితో 13 రకాల క్యాన్సర్లకు చెక్! -
ఈ ఐదు లక్షణాలు ఉంటే మీ భర్త బంగారమే.. మరి మీవారిలో ఈ గుణాలు ఉన్నాయా.? -
కర్ణాటక స్పెషల్ వాంగి బాత్ పొడి..ఒక్కసారి చేస్తే 4 నెలలు నిల్వ..బోర్ కొట్టించే కూరలు కూడా అమృతమైపోతాయ్.. -
కృష్ణాష్టమి స్పెషల్: చిన్ని కన్నయ్యకి ఎంతో ప్రీతికరమైన అటుకుల లడ్డూ.. చక్కెర లేకుండా భలే రుచిగా.! -
పుట్టుకతోనే అదృష్టవంతులు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాజ యోగం ఉన్న రాశులు ఇవే!
గురు పౌర్ణమి రోజు ఇలా చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి
గురు పౌర్ణమికి జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. జీవితంలోని ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చడానికి గురు పౌర్ణమి సహాయపడుతుంది. ఈ రోజు చేసే కొన్ని ఉపాయాలు, పరిహారాలు మంచి ఫలితాన్ని అందిస్తాయి. జీవితంలో నెలకొన్ని సమస్యలు తొలగిపోవడానికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. వాటిని పాటించడం వల్ల పాపాలు తొలగిపోతాయి. జీవిత సమస్యలు విడనాడి మంచి జరుగుతుందని విశ్వాసం.

ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు మహర్షి వేద వ్యాసుడు జన్మించారు. దీనినే గురు పౌర్ణమిగా శాస్త్రాల్లో పేర్కొన్నారు. ఈ తేదీని అదృష్ట దినంగా పరిగణిస్తారు. ఈ రోజు గురువు ఆశీర్వాదం తీసుకుంటే మంచి జరుగుతుందని నమ్ముతారు. జీవితంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే, అదృష్టం కలిసి రాకపోతే గురు పౌర్ణమి రోజు కొన్ని పరిహారాలు పాటిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఏడాది గురు పౌర్ణమి జులై 3వ తేదీ సోమవారం వస్తోంది.
పాపాలు తొలగిపోవడానికి ఈ మంత్రం పఠించాలి:
జీవితంలో మహాదశ పర్వాన్ని కలిగి ఉంటే లేదా గురు గ్రహం యొక్క చెడు దృష్టి జాతకంపై పడి సమస్యలు ఎదుర్కొంటుంటే.. అప్పుడు ఈ గురు పౌర్ణమి రోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సత్ఫలితాలు జరుగుతాయి. గురు పౌర్ణమి రోజు బృహస్పతి స్తోత్రాన్ని పఠించాలని చెబుతున్నారు జ్యోతిష్కులు.
'ఓం భూర్భవ స్వాః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దియోన నహ ప్రచోదయాత్' అనే మంత్రాన్ని 11, 21, 51 లేదా 108 సార్లు పఠించాలి. దీని పఠించడం వల్ల గురు దోషం తొలగిపోతుందని శాస్త్రాలు చెబుతున్నారు.
ఈ రోజు ఇలా చేస్తే పుణ్యం:
శుక్ర గ్రహం జీవితంలో ప్రేమకు, విలాసానికి అధిపతి. ఈ రెండు బాగుంటే శుక్ర గ్రహ ప్రభావం బాగుందని, ఈ రెండు బాలేక సమస్యలు ఎదుర్కొంటుంటే.. శుక్ర గ్రహ ప్రభావం చెడుగా ఉందని అర్థం. మీకు మీ జీవితంలో ఆర్థిక సమస్యలు లేదా ప్రేమ జీవితలో ఉద్రిక్తత ఉంటే.. ఈ తేదీల్లో శుక్ర మంత్రాన్ని జపించడం సమస్యలను తొలగించడమే కాకుండా పుణ్యాన్ని ఇస్తుంది.
అదృష్టం కలిసి రావాలంటే ఇలా చేయాలి:
వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి అదృష్టం కలిసి రావాలంటే ఈ రోజు పసుపు, ధాన్యం, మినపప్పు, పిండి లాంటి పసుపు రంగు వస్తువులను దానం చేయాలి. ఇవి కాకుండా పుష్పరాగం దానం చేస్తే శుభకరంగా ఉంటుంది. ఈ రత్నాన్ని అర్హులైన వారికి మాత్రమే దానం చేయాలని గుర్తుంచుకోండి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications