Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మీ ముఖంపై పుట్టుమచ్చలు ఉన్నాయా? అయితే మీ అదృష్టం, భవిష్యత్తు గురించి తెలుసుకోండి
మన శరీరంపై పుట్టమచ్చలు ఉండటం సహజం. పుట్టుమచ్చలు లేనివాళ్లు అరుదుగా ఉంటారు. దాదాపు అందరికీ ఏదో ఒక చోట పుట్టుమచ్చ ఉంటుంది. కొన్ని పుట్టుమచ్చలు చిన్నగా, మరికొన్ని పెద్దగా,కొన్ని నల్లగా,మరికొన్ని గోధుమ రంగులో ఉంటాయి. పుట్టుమచ్చల్లోనే మన అసలు భవిష్యత్తు దాగి ఉందని చాలా మంది గుర్తించరు, అవి కేవలం చర్మంపై ఏర్పడే మచ్చలుగానే పరిగణిస్తుంటారు. కానీ మన ప్రాచీన సాముద్రిక శాస్త్రం ప్రకారం పుట్టుమచ్చలు వ్యక్తి వ్యక్తిత్వాన్ని,భవిష్యత్తును సూచించే రహస్య సంకేతాలు. ముఖ్యంగా ముఖంపై ఉండే పుట్టుమచ్చలకు విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. మీ ముఖంపై ఎక్కడ పుట్టుమచ్చ ఉండే ఎలాంటి ఫలితాలు మీకు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
1. నుదిటిపై పుట్టుమచ్చ ఉంటే దేనికి సంకేతం
నుదిటిపై పుట్టుమచ్చ ఉండటం చాలా శుభసూచకంగా భావిస్తారు. అయితే నుదురు మధ్యలో పుట్టమచ్చ ఉంటే ఎలాంటి ఫలితాలు? నుదుటి కుడివైపు పుట్టుమచ్చ ఉంటే ఎలాంటి ఫలితాలు? నుదుటికి ఎడమవైపు పుట్టుమచ్చ ఉంటే ఎలాంటి ఫలితం? ఉంటదో ఇక్కడ చూడండి.
నుదుటి మధ్యలో పుట్టమచ్చ ఉంటే: నుదిటి మధ్యలో, కనుబొమ్మలపైన పుట్టుమచ్చ ఉంటే అది జ్ణానానికి, ప్రశాంతమైన స్వభావానికి చిహ్నం. వీరు చాలా తెలివైనవాళ్లు,దైవభక్తి ఎక్కవుగా ఉంటుంది. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడి ఉన్నత స్థాయికి చేరుకుంటారు.
నుదుటికి కుడివైపు ఉంటే: ఇది సంపదకు,కీర్తిప్రతిష్ఠలకు సంకేతం. వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ పెద్ద ఎత్తున ధనాన్ని సంపాదిస్తారు. చిన్నతనం నుంచే వీరికి నాయకత్వ లక్షణాలు అలవడతాయి.
నుదుటికి ఎడమవైపు ఉంటే: వీరు కొంచెం స్వర్థపరలుగా ఉంటారు. కొన్నిసార్లు దురదృష్టాన్ని ెదుర్కొన్నప్పటికీ తమ తెలివితేటలతో ఆటుపోట్లను తట్టుకొని నిలబడతారు.

2. కనుబొమ్మల దగ్గర పుట్టుమచ్చ
కనుబొమ్మలు మన అందాన్ని రెట్టింపు చేస్తాయి. వాటి దగ్గర ఉంటే పుట్టుమచ్చలు లవ్, వివాహ జీవితం గురించి చెబుతాయి. కనుబొమ్మల మధ్యలో పుట్టమచ్చ ఉంటే? కనుబొమ్మలపై లేదా కింద పుట్టమచ్చ ఉంటే? ఏ విధంగా ఉంటుందో ఇక్కడ చూడండి.
రెండు కనుబొమ్మల మధ్యలో పుట్టమచ్చ ఉంటే: ఇది రాజయోగానికి సంకేతం. వీళ్లు అసాధారణ నాయకత్వ పటిమ, కీర్తి,సంపదను పొందుతారు. జీవితంలో వీరికి ఏ లోటూ ఉండదు.
కనుబొమ్మలపైన లేదా కింద ఉంటే: వీరికి లవ్ మ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. వీరు లగ్జరీ లైఫ్ గడపడానికి ఇష్టపడతారు. ఖరీదైన వస్తువులు,బ్రాండెడ్ ఐటమ్స్ పై ఎట్రాక్ట్ అవుతారు.జీవితాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోకుండా లైఫ్ ని ఆస్వాదిస్తూ బతుకుతారు.
3. ముక్కపై పుట్టమచ్చ దేనికి సంకేతం
ముక్కుపై పుట్టమచ్చ అనేది ఆర్థిక వ్యహారాల్లో చాలా శుభ సంకేతం. ముక్కు మీద ఎక్కడ పుట్టుమచ్చ ఉన్నా..వీరు ఆర్థికంగా చాలా త్వరగా ఎదుగుతారు. పెద్దగా కష్టపడకుండానే డబ్బు చేతికి వస్తుంది. కుటుంబ ఆస్తి, పూర్వీకుల నుంచి సంపద లభించే అవకాశాలు మెండుగా ఉంటాయి. వీరి జీవితం సంతోషంగా,ప్రశాంతంగా సాగిపోతుంది.
ముక్కు చివర ఉంటే మాత్రం: వీరికి కోపం, ఆత్మగౌరవం చాలా ఎక్కవగా ఉంటాయి. వీరు చాలా స్పీడ్ గా ఆలోచన చేస్తారు,కొన్నిసార్లు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు.
ముక్కుకు కుడి లేదా ఎడమవైపు ఉంటే: వీరు అభిరుచులు, ఆశయాలు ఎక్కువగా ఉన్నోళ్లని అర్థం. వీరు ముఖ్యంగా కళారంగంలో రాణించగలరు.
4. బుగ్గలపై పుట్టుమచ్చ ఉంటే దేనికి సంకేతం
బుగ్గలపై పుట్టుమచ్చలు వ్యక్తిత్వాన్ని,సామాజిక జీవితాన్ని తెలియజేస్తాయి.
కుడిబుగ్గపై పుట్టమచ్చ ఉంటే: వీరు ఆధిపత్య స్వభావాన్ని కలిగి ఉంటారు, చాలా లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ల మాటలకు కుటుంబంలో,సమాజంలో మంచి విలువ ఉంటుంది. ధనం కూడా బాగా ఉంటుంది. మాటతీరు సూటిగా,సృష్టంగా ఉంటుంది.
ఎడమ బుగ్గపై ఉంటే: వీరు చాలా అంతర్ముఖులు అంటే ఇంట్రోవర్ట్స్ గా ఉంటారు. సున్నితమైన మనస్తత్వం ఉంటుంది. ఫ్రెండ్స్ తక్కువగా ఉంటారు,ఉన్నవాళ్లతో నిజాయితీగా ఉంటారు. అయితే ధనం విషయంలో దుబారా ఖర్చు ఎక్కవగా ఉంటుంది.

5.పెద్దల దగ్గర,పెదవి మీద పుట్టుమచ్చ
పెదాల దగ్గర పుట్టమచ్చ ఉన్నోళ్లు ఫుడ్,డ్రామా విషయంలో చాలా ఉననతమైన,ప్రత్యేక ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు. ప్రతి విషయంలో చాలా పర్టికులర్ గా ఉంటారు. ఏది పడితే అది తినరు,కొనరు. ప్రేమ,శృంగారం విషయంలో చాలా రొమాంటిక్ గా ఉంటారు. అసహనం కూడా వారికి కొంచెం ఎక్కువగానే ఉంటది.
పై పెదవి మీద పుట్టుమచ్చ ఉంటే: వీరు దయగల హృదయం కలవారని, అందరితో కలుపుగోలుగా ఉంటారని అర్థం చేసుకోవచ్చు.
కింద పెదవి మీద ఉంటే: వీరికి కళలు, నాటకాలంటే చాలా ఇష్టం ఉంటది. మంచి భోజనప్రియులు కూడా.
6. గడ్డంపై పుట్టుమచ్చ దేనికి సంకేతం
ఇది పట్టుదలకు,దృఢ సంకల్పానికి నిదర్శనం. వీళ్లు అనుకున్నది సాదించేదాకా వెనకడుగు వేయరు. ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టపడతారు. జీవితంలొ స్థిరపడ్డాక విజయం వీరిని వరిస్తుంది. సమాజంలో వీరికి మంచి గౌరవ మర్యాదులుంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications