Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పుట్టిన తేదీతో మీ జాతకాన్ని మీరే తెలుసుకోవచ్చు !
పుట్టిన తేదీని బట్టి జాతకం తెలుసుకోవచ్చు. కొంతమంది మాత్రమే బిడ్డ పుట్టగానే వారి జాతకాన్ని పురోహితుడి వద్ద నుంచి తీసుకొని భద్రపరుచుకొని ఆ జాతకం ప్రకారమే ఆ బిడ్డకు సంబంధించిన కార్యక్రమాలన్నీ చేస్తారు. వివాహానికి సంబంధించిన ముఖ్యమైన ప్రక్రియ కూడా ఈ జాతకం ద్వారానే జరుగుతుంది. అలాంటి జాతకాన్ని సామాన్యులు కూడా పుట్టిన తేదీ ద్వారా తెలుసుకోవచ్చు. పురోహితుడికి ఉన్న పరిగ్నానం కన్నా కొంత జాతక సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఆ విషయాలను ఈ ఆర్టికల్‌లో పొందుపరిచాము.

పుట్టిన తేదీతో లక్షణాలు
పుట్టిన తేదీని బట్టి లక్షణాలు ఉంటాయ్. ఎవ్వరైనా సరే 10, 11, 19, 28వ తేదీల్లో పుట్టినవారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయ్. పుట్టిన తేదీ, నెల, సంవత్సరం అన్నీ కలిపితే 1 వచ్చిన వారికి పై నాలుగు తేదీల్లో పుట్టిన వారిపై సూర్యుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది, నాయకత్వ లక్షణాలు సహజంగా ఉంటాయ్. 2,11,20, 29 తేదీల్లో పుట్టినవారు లేదా పుట్టిన తేదీలు మొత్తం కలిపితే 2 సంఖ్య వచ్చినా వీరు ఒక నెలలో సగం రోజులు బాగుంటారు, మిగతా సగం నిరాశతో ఉంటారు.
3వ సంఖ్య
3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వాళ్లు లేదా పుట్టిన రోజు తేదీలు కలిపితే 3 సంఖ్య వచ్చిన వారు జీవితంలో సెలబ్రెటీలు అయ్యే లేదా ప్రముఖులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయ్. వీరి జీవితం 30 ఏళ్ల వరకు ఒకలాగా 30 ఏళ్ల తరువాత పూర్తిగా మారిపోతుంది. 90 శాతం మంది ప్రముఖులుగా స్థిరపడతారు.
4 సంఖ్య
4, 13, 22, 31వ తేదీల్లో పుట్టిన వారు లేదా మొత్తం తేదీ సంఖ్యలు కలిపితే 4 వచ్చిన వారు 31వ ఏళ్లు వచ్చే సమయానికి ఉన్నత స్థానంలో ఉంటారు. వీరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది. వీరి వల్ల ఇతరులకు ఎక్కువ లాభం చేకూరుతూ ఉంటుంది కాని వారి మనసే వారికి శతృవు.
5 సంఖ్య
5, 14, 23వ తేదీల్లో పుట్టిన వాళ్లు లేదా పుట్టిన తేదీలన్నీ కలిపితే 5 సంఖ్య వచ్చే వారు బయట ఒకలా లోపల మరోలా ఉంటారు. బయటకు కనిపించే వారి అసలు రూపం ఉండదు. వీరు అందరితో ఎక్కువగా నటిస్తారు. అందరితో కలిసి ఉన్నా సరే ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతారు.
6 సంఖ్య
6,15, 24 తేదీల్లో పుట్టిన వారు లేదా పుట్టి తేదీలన్నీ కలిపితే 6 సంఖ్య వచ్చే వారిని ఆంగ్లంలో ఎక్స్‌ట్రోవర్ట్ అంటారు. వీరు మనసులో ఏదీ దాచుకోలేరు.. ఉన్నది ఉన్నట్లు బయటకు కక్కేస్తుంటారు. వీరు పొగడ్తలకు పొంగిపోతారు.
7 సంఖ్య
7, 16, 25 తేదీల్లో పుట్టిన వారు లేదా పుట్టిన తేదీ సంఖ్యలన్నీ కలిపితే 7 వచ్చిన వారు విమర్శిస్తే సహించరు. వీరు పెళ్లైన తరువాత జీవిత భాగస్వామికన్నా తల్లిదండ్రులకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు.
8సంఖ్య
8,17,26వ తేదీల్లో పుట్టిన వారు 8సంఖ్యకు సంబంధించిన వారిగా చెప్పుకోవచ్చు. వీరికి ఏదైనా సాధించాలనే తపన ఉంటుంది. శత్రువులు ఎక్కువగా ఉంటారు. 26ఏళ్ల వయసులో వీరు స్థిరపడతారు.
9 సంఖ్య
9,18,27వ తేదీల్లో పుట్టిన వారు 9సంతక్యకు సంబంధించిన వారు. వీరికి ముక్కు మీద కోపం ఎక్కువ. ఎవ్వరి మాట పడరు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. 27ఏళ్ల వయసులో వీరు స్థిరపడతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications