Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Astro remedies: ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండట్లేదా? జస్ట్ ఇలా చేస్తే విజయం మీ సొంతం
కష్టపడితే విజయం లభిస్తుంది అని మన పెద్దలు చెబుతుంటారు. అయితే ఇది చాలా వరకు నిజమే కానీ కొన్నిసార్లు ఎంత కష్టపడి పనిచేసినా ఉద్యోగంలో ప్రమోషన్ రాదు, ఇంట్లో మూడు పూటల తినడానికి తిండి ఉండదు,గుర్తింపు రాదు,విజయం రాదు.
ఎన్ని రకాలుగా ప్రయత్నించినా,కష్టపడినా కష్టాలు తప్ప సుఖాలు లేకుంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని నివారణ చర్యలు చేపట్టాల్సిందే. కష్టపడినా తగ్గ ఫలితం రాకుంటే దానికి పరిష్కారం ఏంటో ఇక్కడ చూడండి.

ఇలా చేస్తే ఆ పరిస్థిని నుంచి బయటపడొచ్చు
-ఏదైనా ముఖ్యమైన పని మీద ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కొన్ని ఎండు మిరియాలను చల్లి,వాటిపై అడుగు పెట్టండి. పొరపాటున కూడా వెనుదిరిగి చూడకండి.
-ఏదైనా పని చేసే ముందు వినాయకుడిని పూజించడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఆయన పూజ లేకుండా ఏ పనీ పూర్తికాదు. మీరు ఏదైనా ప్రత్యేక పని కోసం వెళుతున్నట్లయితే తప్పకుండా శ్రీ గణేశయ మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం వల్ల పనిలో విజయం సాధిస్తారు.
-మీరు ఏదైనా పని కోసం ఇంటి నుండి బయలుదేరే ముందు తులసి ఆకులను తినండి. ఇలా చేయడం వల్ల పనిలో విజయం సాధిస్తారు.
- ఏదైనా పని కోసం ఇంటి నుండి బయలుదేరినప్పుడు నిమ్మకాయను తీసుకొని అందులో నాలుగు లవంగాలను పాతిపెట్టండి. దీని తర్వాత హనుమాన్ జీ పేరును 21 సార్లు జపించండి, ఆ నిమ్మకాయను మీ దగ్గర ఉంచండి. ఇలా చేయడం వల్ల పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయని చెబుతారు.
-పనిలో విజయం సాధించడానికి ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మీతో ఒక రొట్టెని తీసుకెళ్లండి. దారిలో ఎక్కడైనా కాకి కనబడితే ఈ రోటీని అక్కడ పెట్టండి. ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న పని త్వరగా పూర్తవుతుంది.
-ప్రతిరోజు ఉదయం స్నానం చేసి తులసికి నీళ్ళు సమర్పించి పదకొండు సార్లు ప్రదక్షిణ చేయాలి. అంతే కాకుండా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి. ప్రతిరోజూ ఉదయం ఇలా చేస్తే విజయం చేకూరుతుంది.
-పనిలో విజయం సాధించడానికి, ఒక నల్ల కుక్కకు క్రమం తప్పకుండా ఆహారం ఇవ్వండి. అంతేకాదు మీ పూర్వీకులకు క్షమాపణలు కూడా చెప్పండి. మీరు ప్రతిరోజూ ఇలా చేస్తే అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది, విజయం వెంటాడుతుంది.
-కష్టపడి పని చేసిన తర్వాత కూడా విజయం మీ వల్ల కాక మరెవరి ద్వారానైనా సాధించబడుతుంటే ఖచ్చితంగా పంచముఖి హనుమంతుడిని పూజించండి. పూజ సమయంలో కొబ్బరికాయలో మోలీని చుట్టి ఆపై బియ్యం,కుంకుమ,పువ్వులు మొదలైన వాటిని ఆంజనేయస్వామికి సమర్పించండి. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా విజయం సాధిస్తారు.
Note: మత విశ్వాసాల ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. దీనికి ఎలాంటి శాస్రీయ ఆధారాలు లేవు. బోల్డ్ స్కై తెలుగు దీనిని ధృవీకరించలేదు. దీనిని పాటించడం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications