Latest Updates
-
కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే! -
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.! -
సోషల్ మీడియాను ఊపేస్తున్న రెట్రో మేనియా.. 1980’s క్లాసిక్ లుక్ మీరూ ట్రై చేశారా.? -
వాహనం ఏ రంగులో ఉన్నా.. టైరు మాత్రం నల్లగానే ఎందుకుంటుందో తెలుసా? -
ఈ రాశి వారు శుక్రవారం ఈ పూజ చేస్తే ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువుదీరడం పక్కా.! -
గుంటూరు స్పెషల్ టిఫిన్స్ అల్లం పచ్చడి..ఒక్కసారి చేసుకుంటే నెల రోజులు నిల్వ! -
పులియబెట్టాల్సిన పనిలేదు.. దోశ పిండి లేకపోతే ఇన్స్టంట్గా ఈజీగా చేసుకునేలా.! -
గణేష్ పూజ తర్వాత అరుదైన లక్ష్మీ నారాయణ యోగం..వాళ్లకి స్వర్ణ యుగమే! -
కూరలో నూనె ఎక్కువైందా? రుచి మారకుండా ఇలా ఈజీగా తీసేయండి! -
ఒక్క ముద్దలో లెక్కలేనన్ని ప్రయోజనాలు.. వయసు మళ్లినవారు తప్పనిసరిగా తినాల్సిన హెల్తీ కుర్మా.!
ప్రమోషన్లు, ఆర్థిక లాభాలు.. ఆగష్టులో ఈ రాశుల వారికి అన్నింటా రాజయోగమే.!
జ్యోతిష్య పరంగా ఆగష్టులో పలు ప్రధాన గ్రహాలు తమ రాశి చక్రాలను మార్చుకుంటున్నాయి. వచ్చే నెల 2వ తేదీన కుజడు మిథున రాశిలోకి, ఐదో తేదీన బుధుడు కర్కాటక రాశిలోకి, 17వ సూర్యుడు సింహ రాశిలోకి, 2న బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తుండటంతో పలు రాశుల వారికి ప్రయోజనకరంగా ఉండనుంది. శుక్రుడు, చంద్రుడితో పాటు ఇతర గ్రహాల నక్షత్ర మార్పులతో ప్రత్యేక యోగాలు రానున్నాయి. బుధాధిత్య రాజయోగం, గజలక్ష్మి యోగం కారణంగా పలు రాశుల వారికి వృత్తి, ఆర్థిక, కుటుంబం సామాజిక పరంగా సానుకూల ఫలితాలను పొందుతారని పండితులు చెబుతున్నారు.

మేషరాశి
మేష రాశి వారికి ఆగష్టులో అనుకూలమైన గ్రహ స్థానాలతో ప్రతి రంగంలోనూ పురోగతి పొందుతారు. కొత్త విజయాలు, ఆరంభాలతో ఉద్యోగం, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. మీ కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగంలో మీ పనితీరు కారణంగా కీలకమైన ప్రాజెక్టుల్లో భాగం అవుతారు. వ్యాపార రంగంపై ఆసక్తి ఉన్నవారికి ఇది అనుకూల సమయం. నిలిచిపోయిన నిధులు తిరిగి పొందుతారు. కుటుంబంలో సంతోషం, శాంతి ఉంటాయి. ఆస్కి కొనుగోలుకి సంబంధించి కలలు నెరవేరుతాయి. ప్రేమ జీవితం బాగుంటుంది. వైవాహిక జీవితం సంతోషకరంగా ఉంటుంది. ఆహారపు అలవాట్లలో జాగ్రత్త వహించాలి.
కర్కాటక రాశి
ఆగష్టులో కర్కాటక రాశి వారు ఆత్మవిశ్వాసం, విజయాన్ని అందుకుంటారు. బుధాదిత్య రాజయోగంతో దృఢమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉద్యోగంలో గుర్తింపు పొందుతారు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో సానుకూల ఫలితాలు పొందవచ్చు. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త పరిచయాలకు ఇది సువర్ణావకాశం. ఆర్థికంగా ఆదాయం పెరుగుతుంది. కానీ ఖర్చులను నియంత్రించుకోవాలి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. తల్లిదండ్రుల మద్దతు అందుకుంటారు.
సింహ రాశి
సూర్యుడు సొంత రాశి అయిన సింహ రాశిలోకి ప్రవేశిస్తుండటంతో ఈ రాశి వారికి ఆగష్టు నెల శుభప్రదంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం, లీడర్‌షిప్, ప్రభావం బలంగా ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. వృత్తిపరంగా పురోగతి లభిస్తుంది. వ్యాపార రంగంలో కొత్త పెట్టుబడులు, లాభాలు పొందవచ్చు. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిపుణుల సలహా తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబంలో సంతోషం, సామాజిక గౌరవం, కొత్త పరిచయాలతో సంతోషంగా ఉంటారు. అధిక పని భారం పెట్టుకోకపోవడం మంచిది.

కన్యా రాశి
వృత్తి, ఆర్థిక పురోగతి పరంగా కన్యా రాశి వారికి ఆగష్టు మాసం కలిసి వస్తుంది. బుధాదిత్య రాజయోగం, గజలక్ష్మి యోగాలతో మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రశంసలు, కొత్త బాధ్యతలు, పదోన్నతులు, జీతం పెరుగుదల వంటి సానుకూల మార్పులు జరగవచ్చు. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త భాగస్వామ్యాలు, పెట్టుబడులు పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయి. విద్యార్థులకు పోటీ పరీక్షలకి సంబంధించి శుభ సమయం. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొంది ఆరోగ్యంగా ఉంటారు.
వృశ్చిక రాశి
గజలక్ష్మి యోగం, గ్రహాల శుభ ప్రభావం కారణంగా ఆగష్టు నెల వృశ్చిక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతాయి. వృత్తిపరంగా పదోన్నతి, ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది. వ్యాపారరంగంలో కొత్త పెట్టుబడులు, విస్తరణ ఉండవచ్చు. సంపదలో పొదుపు పాటిస్తారు. కుటుంబంలో సంబంధాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. మరపురాని సమయాలను గడుపుతారు. వివాహం కోసం చూస్తున్న వారికి ఈ కాలంస కలిసి వస్తుంది. ఆరోగ్యం విషయంలో సరైన దినచర్య పాటించడం మేలు చేస్తుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
