Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
జులై నెలలో గ్రహాల గమనంలో పెను మార్పులు..ఈ 4 రాశుల వారికి ఎక్కువ ప్రయోజనం
జూన్ నెల ముగిసి జులై నెలలోకి మరికొన్ని గంటల్లో అడుగుపెట్టబోతున్నాం. జూలై నెలలో గ్రహాల గమనం ఒక కీలక మలుపు తీసుకోబోతోంది. ఈ నెలలో ఆకాశంలో జరిగే మార్పులు భూమిపై మన జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. జూలై 2025లో ప్రధాన గ్రహాలైన సూర్యుడు, కుజుడు, శుక్రుడు తమ స్థానాలను మార్చుకుంటున్నారు. అంతేకాకుండా దేవగురువైన బృహస్పతి మిథున రాశిలో ఉదయిస్తుండగా, కర్మకారకుడైన శని దేవుడు మీన రాశిలో తన వక్ర గమనాన్ని ప్రారంభిస్తాడు. మరోవైపు, వాక్కుకు అధిపతి అయిన బుధుడు కర్కాటకంలో వక్రించి, అస్తమించనున్నాడు. ఈ గ్రహాల అపూర్వ కలయిక మొత్తం 12 రాశుల వారిపై శుభ, అశుభ ప్రభావాలను చూపనుంది. రాహువు కుంభంలో, కేతువు సింహంలో ఉండటం ఈ ప్రభావాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది.
ప్రకృతి, ప్రపంచంపై ప్రభావం
ఈ గ్రహ సంచారాల ప్రభావం మనుషుల జీవితాలపై ప్రభావం చూపడమే కాకుండా దేశ, ప్రపంచ వ్యవహారాలలో కూడా పెద్ద మార్పులకు సంకేతాలిస్తున్నాయి. శుక్రుడు, కుజుడు, సూర్యుని సంచారంతో వ్యాపార రంగంలో నూతన ఉత్తేజం కనిపిస్తుంది. మరోవైపు వ్యవసాయ రంగంలో నష్టాలు, ప్రకృతి ప్రకోపానికి సూచనలున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తులు సంభవించే ప్రమాదం ఉంది. భూకంపాలు, తుఫానుల వంటి ప్రకృతి వైపరీత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా రహదారి ప్రమాదాల వంటి పెద్ద సంఘటనలు జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది.

గ్రహ సంచారాల కీలక తేదీలు
జూలై 9: బృహస్పతి మిథునరాశిలో ఉదయం.
జూలై 13: శని మీనరాశిలో తిరోగమనం.
జూలై 16: సూర్యుడు కర్కాటకరాశిలోకి ప్రవేశం.
జూలై 18: బుధుడు కర్కాటకరాశిలో తిరోగమనం.
జూలై 24: బుధుడు కర్కాటకరాశిలో అస్తమయం.
జూలై 26: శుక్రుడు మిథునరాశిలోకి ప్రవేశం.
జూలై 28: కుజుడు కన్యారాశిలోకి ప్రవేశం.
ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
అదృష్ట రాశులు: మిథునం, వృశ్చికం, మకరం, మీనం. ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తట్టనుంది. ప్రతి ప్రయత్నంలో విజయం, ఆర్థికంగా అనూహ్య లాభాలు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, వ్యాపారంలో లాభాలు వీరిని వరిస్తాయి.
ఈ రాశులకు అశుభ ఫలితాలు: వృషభం, సింహం, తుల, కుంభం. ఈ రాశుల వారు ప్రతి అడుగు ఆచి తూచి వేయాలి. ఆరోగ్యం, ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. అనవసర వివాదాలకు, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం ఉత్తమం.
మిశ్రమ ఫలితాలు: మేషం, కర్కాటకం, కన్య, ధనుస్సు. ఈ రాశుల వారికి ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. కొన్ని రంగాలలో విజయాలు సాధించినా, మరికొన్నింటిలో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఓపిక, పట్టుదలతో ముందుకు సాగడం బెటర్.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications