Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
వచ్చే సంవత్సరం మే తరువాత ఈ రాశుల వారి జీవితం అంతా అంధకారమే!
వచ్చే సంవత్సరం చాలా గ్రహాలు తమ తమ స్థానాలను మార్చుకోబోతున్నాయి. దీని కారణంగా పలు యోగాలు ఏర్పడనున్నాయి. ఈ యోగాలు, గ్రహాల స్థానాల్లో మార్పులు పలు రాశుల వారిని తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి. వాటిలో అత్యంత ప్రధాన గ్రహమైన గురువు తన స్థానాన్ని మార్చుకోనుంది. 2025లో గురువు ఏకంగా మూడుసార్లు తన స్థానాన్ని మార్చుకోనున్నారు. దీని కారణంగా పలు రాశుల వారికి అనుకూల ఫలితాలు కలిగితే, మరికొన్ని రాశుల వారికి తీవ్రమైన ప్రతికూల ఫలితాలు వస్తాయి. అయితే ప్రతికూల పరిస్థితులు ఎదుర్కునే రాశులు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మిథున రాశి
2025లో బృహస్పతి మిథునరాశి వ్యక్తుల ఆర్థిక జీవితంలో వివిధ సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారస్తులు వ్యాపారం చేసే విధానం, అలాగే తమ వ్యాపారంలో కొత్త ఆపదలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. మితిమీరిన ఆత్మవిశ్వాసం జీవితంలో తొందరపాటు లేదా చెడు నిర్ణయాలకు దారితీస్తుంది. దీని కారణంగా అనేక వైఫల్యాలను మూటగట్టుకోవాల్సి వస్తుంది. అందుకే వచ్చే సంవత్సరం మిథున రాశి వారు సరైన ప్రణాళికలు వేసుకోవాలి. ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. హింసలకు దూరంగా ఉండడం మంచిది.

ధనుస్సు రాశి
2025లో గురువు తన స్థానాన్ని మార్చుకోవడం వల్ల ధనుస్సు రాశికి చెందిన వారికి ఉద్యోగ జీవితంలో అనేక ఇబ్బందులకు కలిగిస్తుంది. ఇది వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో అనేక అపార్థాలకు, సమస్యలకు కారణమవుతుంది. గురువు సంచరించే సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకటికి రెండుసార్లు ఆలోచించి, పరిశోధనలు నిర్వహించి పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్రమైన సమస్యలకు కారణమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
నష్టాలను నివారించేందుకు ఈ కాలంలో నగదు లావాదేవీలను తగ్గించుకోవాలి. అలాగే కుటుంబంలో అభిప్రాయం భేదాలు ఉన్నట్లయితే మీరు కచ్చితంగా ఓపికతో ఉండాలి. అలాగే సామరస్యంగా వివాదాలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి.
మకర రాశి
2025 గురువు స్థాన చలానాలు కారణంగా మకర రాశికి చెందిన వ్యక్తులు తమ వ్యక్తిగత, వృత్తి జీవితంలో అనేక సవాళ్ళను ఎదుర్కొంటారు. ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అనేక పలు ప్రమాదకరమైన అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. అలాగే అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే అనేక సమస్యలను, అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది.
వ్యాపారం లేదా షేర్ మార్కెట్‌లో వ్యక్తిగత పెట్టుబడి పెట్టకుండా ఉండాలి. అలాగే అధికంగా ఖర్చు చేయడం కూడా మానుకోవాలి. ఇవి ఈ రాశి వారిని ఆర్ధిక అనిశ్చితిలోకి నెట్టేస్తుంది. ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు కొత్త ఉద్యోగంలోకి మారాలనుకుంటే ఇంకొంత కాలం ఆగితే చాలా మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications