Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఈ వస్తువులను ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం..! మీ వద్ద వున్నాయా..?
జ్యోతిష్యంలో కొన్ని వస్తువులను చాలా అదృష్టంగా భావిస్తారు. కొన్ని వస్తువులను ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని, షాపులో వ్యాపార స్థలాల్లో పెట్టుకుంటే మంచి లాభాలు వస్తాయని చెబుతుంటారు. భారతదేశంలో వున్నంత విభిన్న సంస్కృతి ఎక్కడా వుండదు. ఇక్కడ వున్నన్నటి నమ్మకాలు కూడా ఎక్కడా వుండవు. వేల ఏళ్ల నుంచి వస్తున్న కొన్ని ఆచార పద్ధతులను పాటిస్తున్నారు. వాటిని పాటించడానికి ఎలాంటి సంకోచాన్ని చూపించరు. జ్యోతిష్యం ప్రకారం కొన్ని వస్తువులు పెట్టుకుటే శుభమని చెబుతారు, ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం.
తాబేలు విగ్రహం
ఈ తాబేలు విగ్రహాన్ని మనం ముఖ్యంగా షాపుల్లో చూసి వుంటాం. ఒక చిన్న సైజు ప్లేటులో నీళ్లువుంటే ఆ నీళ్ల్లో తాబేలు వుంటుంది. జ్యోతిష్యంలో తాబేలుని లక్ష్మీ దేవితో పోలుస్తారు. తాబులును పెట్టుకుంటే చుట్టూ పరిసరాల్లో లక్ష్మీ దేవిని పెట్టుకున్నట్టేనని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. తాబేలు విగ్రహాన్ని షాపుల్లోనే కాదు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చని అంటున్నారు. తాబేలు ఉంగరాలను కూడా ధరిస్తారు. ఉంగరాలను ధరిస్తే అదృష్టంగా భావిస్తారు.
పెరుగు, చక్కెర మిశ్రమం
పెరుగులో చెక్కరను కలపడం హిందూ శాస్త్రంలో శుభంగా భావిస్తారు. పెరుగు చెక్కరను కలిపి తినడం వల్ల అంతా మంచే జరుగుతుందని భావం. ఏదైనా శుభకార్యానికి లేదా పూజలో కూడా పెరుగు చెక్కరను తింటారు లేదా ప్రసాదంగా పంచిపెడతారు. భారత దేశం మొత్తం ఈ పెరుగు చెక్కర సాంప్రదాయం వుందన్న విషయాన్ని మనం గ్రహించాలి.

దేవతల విగ్రహాలు
దేవుళ్ల విగ్రహాలను పెట్టుకోవడం వల్ల ఆ ప్రదేశంలో నెగటివ్ ఎనర్జీ రాదని భారతీయుల నమ్మకం. అందువల్ల ఇంట్లో దేవుళ్ల విగ్రహాలు పెట్టుకుంటారు. ఏ సమస్య వచ్చినా ఆ విగ్రహాలను చూసినప్పుడు ఒక ధైర్యం రావడం, కష్టాలను ఎదుర్కోవడానికి ఆ విగ్రహాలు బలాన్ని ఇస్తాయనే నమ్మకాన్ని హిందూ భక్తులు కలిగి వుంటారు. అందువల్ల ఇంట్లో దేవుళ్ల విగ్రహాాలను పెట్టుకుంటారు.
ఒక రూపాయి ఎక్కువ
హిందూ సాంప్రదాయాల్లో పెళ్లిళ్లు జరిగినప్పుడు లేదా ఏదైనా వేడుకలు జరిగినప్పుడు ఆ సమయంలో కట్నం ఇవ్వడం సాధారణం. అయితే కట్నం ఎంత ఇచ్చినా దానికి అదనంగా ఒక రూపాయి చిల్లరని జత చేసి ఇస్తాము. ఇది హిందువుల్లో తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. రూ.1116 రూపాయనలు కూడా అలాగే ఇస్తారు. రూ.10 ఇచ్చినా దానికి ఒక రూపాయిని యాండ్ చేసి రూ.11ను ఇస్తారు. ఇలా ఇవ్వడానికి కూడా ఒక బలమైన కారణం వుంది. ఇలా చేయడం మంచి పద్ధతి అని, కట్నం తీసుకున్న వ్యక్తి మరింత సంతోషంగా వుంటాడని చెబుతున్నారు.
నిమ్మకాయ దండ
నిమ్మకాయలకు మిరపకాయలు కట్టి దానికి గవ్వలు కట్టి చుట్టడం. దాన్ని వాహనాలను కట్టేయడం, షాపుల్లో వేలాడదీయడం చూస్తుంటాం. ఇది కూడా అదృష్టంగా భావిస్తారు. ఇది ముఖ్యంగా నర దృష్టి తొలగించడానికి కడతారని చెబుతారు. షాపుపై నర దృష్టి పడితే ఈ నిమ్మకాయ, మిరపకాయలు ఆ నరదృష్టిని తొలగిస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
గ్లాసు నీలల్లో నిమ్మకాయ
ఒక గ్లాసు నీటిలో నిమ్మకాయను పెట్టుకొని షాపులో పెట్టుకుంటే లక్ష్మీ దేవి వస్తుందని కొందరు భక్తుల నమ్మకం. జ్యోతిష్యపండితులే ఈ విషయాన్ని స్వయంగా అంటున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications