Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
Ketu Gochar: చిత్రా నక్షత్రంలోకి కేతు సంచారంతో ఈ రాశుల వాళ్లకు ఇబ్బందులు తప్పవు.. మీరూ ఉన్నారేమో చూస్కోండి!
కేతువు తిరోగమన గ్రహం. ఈ గ్రహ సంచారం మనషి జీవితాన్ని విపరీతంగా ప్రభావం చేస్తుంది. అయితే జూన్ 26వ తేదీ కేతువు చిత్రా నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. అయితే దీని వల్ల కొన్ని రాశుల వాళ్లపై ప్రభావం పడబోతోంది. ఆ రాశులు ఏంటి వారిపై కేతువు ఎలాంటి ప్రభావం చూపించబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1. మిథున రాశి
కేతువు సంచారం వల్ల మిథున మిథున రాశి వ్యక్తుల ప్రేమ జీవితాన్ని ప్రభావితం చేయబోతుంది. ప్రేమికుల మధ్య అనేక సమస్యలు వస్తాయి. అలాగే విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టడం కూడా చాలా కష్టం అవుతుంది. తల్లిదండ్రులు కూడా పిల్లల వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా పిల్లలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తారు.
2. కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ సమయంలో కేతులు నాల్గవ ఇంట్లో ఉండబోతున్నాడు. దీని వల్ల ఈ రాశి వాళ్ల తల్లి ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కునే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ కుటుంబ జీవితం కూడా చాలా బిజీగా ఉంటుంది. ఇంటి వాతావరణ మీకు చాలా టెన్షన్ అనిపించేలా ఉంటుంది. అయితే క్రమంగా పరిస్థితులు అనకూలిస్తాయి.
3. కన్యారాశి
కేతువు యొక్క ఈ సంచారం కన్యారాశి ప్రజల మాటలను ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రసంగాలు కాస్త పదునుగా మారవచ్చు. దీని వల్ల ప్రజలు మీ ఉద్దేశ్యాలను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ సమయంలో కేతువు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల నుంచి దూరం చేయవచ్చు. లేదా సంబంధాల్లో దూరాన్ని పెంచే అవకాశం ఉంది. అలాగే ఇది మీ సంపాదనలో హెచ్చు తగ్గులకు కారణం అవుతుంది. మీరు పొదుపు చేయడం కష్టతరం చేస్తుంది. ఈ సమయంలో మీరు ఆర్థిక విషయాలతో చాలా సంయమనం పాటించాల్సి ఉంటుంది.
4. మకర రాశి
కేతువు సంచారం వల్ల మకర రాశి వారికి తండ్రితో వాగ్వాదం చెలరేగే అవకాశం ఉంటుంది. అలాగే విజయం కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. దీంతో పాటు మీరు రంగంలో పురోగతి కోసం అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే మానసిక ఒత్తిడిని కల్గి ఉండవచ్చు. మీరు పనిలో వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలా మంది మీ పరువు తీసేందుకు ప్రయత్నిస్తుంటారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
5. మీన రాశి
మీర రాశి వారికి కేతువు ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు. అది చిత్రా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ వ్యక్తులకు ఆరోగ్య మసస్యలు వస్తాయి. ఈ సమయంలో ఆరోగ్య సంబంధ సమస్యలు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తోంది. అంతే కాదండోయ్ వీటికి తోడుగా మీ సమస్యలు మరింతగా పెరుగుతాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications