Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Ketu Gochar: చిత్రా నక్షత్రంలోకి కేతు సంచారం, ఈ రాశుల వారికి కలిసిరానున్న సమయం.. మీ రాశి ఉందా చూడండి
నవగ్రహాల్లో కేతు గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. కేతువును అశుభంగా భావిస్తారు. అందుకే జాతకంలో కేతు ప్రభావం ఉండకూడదని కోరుకుంటారు. అయితే కేతు శుభ ఫలితాలను కూడా ఇస్తాడు. మన రాశి ప్రకారం కేతువు మంచి స్థానంలో ఉంటే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. జూన్ 26వ తేదీన కేతువు చిత్రా నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ చిత్రా నక్షత్రానికి అధిపతి కుజుడు(అంగారకుడు). ఈ పయనం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వనుంది. కొన్ని రాశుల వారికి కాలం కలిసిరానుంది. ఆయా రాశులు ఏవో.. అందులో మీ రాశి ఉందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి:
జూన్ 26వ తేదీన జరగనున్న కేతు సంచారం వల్ల మేష రాశి వారికి శుభ కలగనుంది. ఆ సమయంలో మేషరాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆదాయం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వ్యాపారులకు ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. కొద్దిగా దృష్టి పెట్టగలిగితే కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఇంట్లోని కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ముఖ్యం. తండ్రి ఆరోగ్యంపై అశ్రద్ధ పనికిరాదు. విద్యార్థులు విద్యపై దృష్టి పెడితే మంచి ఫలితాలు వస్తాయి.
వృషభ రాశి:
కేతు చిత్రానక్షత్రంలోకి ప్రవేశం వృషభ రాశి వారికి కలిసి రానుంది. కేతు సంచారం సమయంలో వృషభ రాశి వారి మనసు చాలా ఆహ్లాదంగా ఉండనుంది. వీరిలోని ఆత్మవిశ్వాసం విశేషంగా పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనలు దరికి చేరనీయకూడదు. సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య కూడా సంతోషం వెల్లివిరుస్తుంది. భాగస్వామితో సన్నిహితంగా ఉంటారు. దీని వల్ల పరస్పర సహకారం మెరుగుపడుతుంది. అలాగే ఆదాయం కూడా పెరిగి, ఆర్థిక సమస్యలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ సమయంలో మనోహరంగా ఉండనుంది. విద్యార్థులకు, పోటీ పరీక్షలు సన్నద్ధం అయ్యే వారికి ఈ సమయం ఎంతో బాగుండనుంది. విజయాన్ని సాధించడానికి పూర్తిగా అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా కష్టపడితే సత్ఫలితాలు వస్తాయి. కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగా ఉండనుంది. వ్యాపారం మెరుగుపడుతుంది. లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండటం మంచిది.
సింహ రాశి:
కేతు చిత్రా నక్షత్రంలోకి ప్రవేశించే సమయంలో సింహ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. సింహ రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనసు చాలా ఆహ్లాదంగా, ఆనందంగా ఉంటుంది. విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సున్నద్ధం అయ్యే వారికి చదువుపై ఆసక్తి పెరుగుతుంది. మంచి ఫలితాలు రావడం వల్ల ఉత్సాహం వస్తుంది. ఉద్యోగులకు పురోగతి లభించనుంది. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్న ఈ సమయంలో ఖర్చులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ముఖ్యం.
కుంభ రాశి:
ఈ రాశి వారికి ఈ సమయంలో ఆత్మ విశ్వాసం పెరిగే అవకాశాలు ఉన్నాయి. చిత్రా నక్షత్రంలోకి కేతు సంచారం.. కుంభ రాశి వారికి సంతోష సంచారం ఏకకాలంలో జరగనుంది. ఈ సమయంలో మానసికంగా ఆనందంగా ఉంటారు. కొద్దిగా ఓపిక పట్టగలిగితే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు పుష్కలం. ఉద్యోగులకు పురోగతి లభించే అవకాశాలు ఉన్నాయి. ఉన్నతాధికారులతో సఖ్యత కలిసి వస్తుంది. వారి సహకారం పెరుగుతుంది. వ్యాపారాల్లో పురోగతి లభించే అవకాశం ఉంది. అయితే ఖర్చులు పెరుగుతాయి. ప్రత్యేక శ్రద్ధ వహించకపోతే ఆర్థికంగా కొద్దిగా కష్టాలు తప్పవు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications