Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Virgo: 2025లో కన్య రాశి వారికి ఎలా ఉంటుందంటే?
2025వ సంవత్సరం ఇంకో మూడు రోజుల్లో మొదలైపోతుంది. ఇప్పటికే చాలా రాశుల వారు 2025లో తమ జీవితం ఎలా ఉంటుందోనని చెక్ చేసుకుంటున్నారు. అయితే 2025లో కన్య రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి? వారు ఏ విధమైన విజయాలు సాధిస్తారనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కెరీర్ జీవితం
2025లో కన్య రాశి వారికి కెరీర్ పరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వచ్చే ఏడాది కన్య రాశిలో గురుడు 9, 10వ స్థానంలో సంచరిస్తాడు. దీని కారణంగా ఈ రాశి వారు తమ కెరీర్‌లో అనేక విజయాలను సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్స్, జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని బలమైన సంబంధాలను ఏర్పరచుకుంటారు. దీని కారణంగా వీరు జీవితంలో ఉన్నతమైన విజయాలను సాధిస్తారు. కొత్త పెట్టుబడులు కూడా పెట్టె అవకాశం ఉంటుంది.

వ్యాపారం పరంగా
2025లో కన్య రాశి వారికి వ్యాపారం పరంగా సానుకూల ఫలితాలు రాబోతున్నాయి. ఏడాది మొదట్లో వ్యాపారులు భారీ విజయాలను సాధిస్తారు. గురువు, శని అనుకూలమైన స్థానాల్లో ఉండడం వల్ల వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు వస్తాయి. వ్యాపార పురోగతి స్పష్టంగా కనిపిస్తుంది. సీనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు కనుక్కుంటారు. దీని కారణంగా డబ్బులు భారీగా వచ్చి పడతాయి. అయితే ఇదే రాశిలో కేతువు ఏడవ స్థానంలో, రాహువు కూడా అదే స్థానంలో ఉన్నప్పుడు వ్యాపారంలో కొంత లోటుపాట్లు కనిపిస్తాయి.
ప్రేమ జీవితం
కన్య రాశి వారికి ప్రేమ జీవితం 2025లో కొంత వరకు ఇబ్బంది కరంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రేమ జీవితం ఆనందమయంగా ఉండాలంటే కచ్చితంగా ఓపికగా ఉండాలి. అలాగే తెలివిగా వ్యవహరించాలి. 2025లో కన్య రాశి వారు తమ వ్యక్తిగత జీవితంపై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తుంటారు. కానీ ప్రేమ జీవితంపై ఎక్కువగా శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. అలాగే మార్చి తరువాత కొంతమేర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. ఒంటరిగా ఉండే వ్యక్తులకు తమ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
ఆరోగ్య జీవితం
కొత్త ఏడాదిలో కన్య రాశి వారికి ఆరోగ్య పరంగా కొంత మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆరోగ్యం విషయంలో ఈ రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. శనీశ్వరుడు ఆరో స్థానంలో ఉన్న సమయంలో కొంత ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో మీరు శారీరకంగా బలంగా తయారవుతారు. కొన్ని మానసిక ఆందోళనలు, సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంతమైన జీవితం కోసం కొంత ఓపికతో ఉండాలి. అలాగే ప్రశాంతమైన ఆలోచనలతో మీరు ముందుకు సాగాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications