Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
2025 జనవరి నెలలో ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసా?
ఇంకో మూడు రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభమైపోతుంది. ఈ కొత్త సంవత్సరం మొదటి నెలలో ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మేష రాశి
మేష రాశి వారికి కొత్త సంవత్సరంలో మొదటి నెల చాలా శుభప్రదమైనది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. పెట్టుబడులు కూడా కలిసి వస్తాయి. వ్యాపారులకు సంవత్సరం ప్రారంభం లాభాలతో ప్రారంభమవుతుంది. విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నించే వారికి ఈ కాలం చాలా బాగుంటుంది. ఆస్తిని విక్రయించే వారికి కూడా లాభం కలుగుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఆరోగ్య సమస్య ఉంటే అదనపు శ్రద్ధ వహించాలి.

వృషభం
కొత్త సంవత్సరం మొదటి నెల వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉండనుంది. మీరు చాలా మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఈ కాలంలో ఈ రాశి వారి ప్రయాణాలు చాలా లాభదాయకంగా ఉంటాయి. సమాజంలో వీరికి గుర్తింపు లభిస్తుంది. ఏ నిర్ణయమైనా ఆలోచనాత్మకంగా తీసుకోవాలి. నెల మధ్యలో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ జీవితం బాగుంటుంది, వైవాహిక జీవితం బలంగా ఉంటుంది.
మిధునం
2025లో మొదటి నెల ప్రారంభం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న మీ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. వ్యాపారులు ధనలాభం పొందుతారు. అనుకున్న పనిని పూర్తి చేయడం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. కుటుంబ జీవితం బాగుంటుంది. మాసం మధ్యలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది, ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక
జనవరి నెల కర్కాటక రాశికి మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారులు సవాళ్లను ఎదుర్కోవచ్చు. వృత్తి జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే, మోసం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇకపై పెద్దగా పెట్టుబడులు పెట్టవద్దు, బెట్టింగ్‌లకు దూరంగా ఉండండి. కానీ నెల మధ్యలో పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు, మీ భాగస్వామికి మధ్య ఏదైనా విభేదాలు ఉంటే, మీరు దానిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి.
సింహ రాశి
2025 జనవరి మాసం సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో ఎదుగుదల కనిపిస్తుంది. కోర్టులో కేసు ఉంటే మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. కానీ నెల మధ్యలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఖర్చులు పెరిగిపోతాయి కాబట్టి, ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పుల వ్యాపారం చేయకూడదు. ఇతరుల మాటలు విని నిర్ణయాలు తీసుకోకూడదు. వైవాహిక జీవితంపై ద్రుష్టి సారించాలి.
కన్య రాశి
కన్యా రాశి వారు ఈ నెల ప్రారంభంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. కుటుంబ విషయాలలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. కానీ పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సమస్యలు ఎక్కువ కాలం ఉండవు. నెల మధ్యలో ప్రతిదీ మెరుగుపడుతుంది. మీకు మరియు మీ భాగస్వామికి మధ్య సంబంధం బాగుంటుంది. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి అంతంగా మాత్రమే ఉంటుంది.
తులా రాశి
తులారాశికి నూతన సంవత్సరం అద్భుతంగా ప్రారంభమవుతుంది. వారు తమ వృత్తి జీవితంలో విజయాన్ని పొందుతారు. వ్యాపారులు ఆశించిన లాభాలను పొందడంలో విజయం సాధిస్తారు. కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే అది కూడా పరిష్కారమవుతుంది. వైవాహిక బంధం బలపడుతుంది. ఆర్థికంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది.
వృశ్చిక రాశి
వృశ్చికరాశి వారికి జనవరి నెల ప్రారంభం చాలా బాగుంటుంది. అయితే ఈ నెల మధ్యలో మీరు కొంచెం జాగ్రత్త వహించాలి. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ నెలాఖరులో పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి, కుటుంబ జీవితం బాగుంటుంది. విద్యార్థులు తమ లక్ష్యాల వైపు ఎక్కువ దృష్టి పెట్టాలి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి జనవరి నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు కెరీర్ జీవితంలో చాలా మంచి ప్రయోజనాలను పొందుతారు. వృత్తి జీవితంలో కొత్త ప్రయత్నాలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులు ధనలాభం పొందుతారు. కుటుంబ జీవితం బాగుంటుంది. కానీ ఖర్చులపై దృష్టి పెట్టండి.
మకర రాశి
జనవరి నెల మకరరాశి వారికి శుభప్రదం. అయితే పని చేసే ప్రదేశంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మీ ఇమేజ్‌ని చెడగొట్టాలని అనుకోవచ్చు. ఈ నెలలో కొన్ని దూర ప్రయాణాలు చేయవచ్చు. మీరు మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే డబ్బు వ్యాపారం జోలికి వెళ్ళకూడదు. ఆస్తిని కొనుగోలు చేసినా లేదా సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేసినా వాటికి సంబంధించిన ఒప్పందపు పత్రాలపై దృష్టి పెట్టండి. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి జనవరి నెల ఫలవంతంగా ఉంటుంది, మాసం ప్రారంభం బాగుంటుంది. కానీ మీ సామర్థ్యానికి మించి కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు. అవి మీకు ఇబ్బందులను తీసుకొస్తాయి. వ్యాపారులు హెచ్చుతగ్గులను చూడవచ్చు. ప్రేమలో ఉన్నట్లయితే మీ ప్రేమను వ్యక్తీకరించడానికి ఇది సరైన సమయం కాదు. వివాహితులు వైవాహిక జీవితంపై దృష్టి పెట్టాలి. జనవరి నెలలో మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే జాగ్రత్తగా ఉండండి.
మీన రాశి
ఈ రాశి వారు జనవరి నెలలో తమ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. పనిలో ఎక్కువ శ్రమ అవసరం. స్వయం ఉపాధి ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో రాజకీయ నాయకులకు మరింత బాధ్యత పెరుగుతుంది. ఖర్చుపై దృష్టి పెట్టండి. డబ్బు సంబంధిత పెట్టుబడులలో జాగ్రత్తగా ఉండండి. బెట్టింగ్, ఆన్‌లైన్ గేమ్‌లకు దూరంగా ఉండండి. వైవాహిక జీవితం బాగుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications