Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
చేతి రేఖలు, కాళ్ల తీరుని బట్టి మీ భవిష్యత్తును అంచనా వేసుకోవచ్చు..!
చేతి రేఖల సాయంతో చెప్పే జ్యోతిష్యానికి చాలా విలువ వున్నాది. చాలా మంది దీన్ని తీసి పారేస్తుంటారు. ఈ మధ్య కొన్ని సినిమాల్లో కూడా హస్తరేఖ జ్యోతిష్యానికి విలువలేదని సంకేతాలు పంపించారు. హస్తరేఖా జ్యోతిష్యంపై ఇప్పటికీ ఎన్నో యూనివర్సిటీల్లో పరిశోధనలు జరుగుతున్నాయ్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి వేలి ముద్రలు ప్రత్యేకంగా వుంటాయ్. ఒకరి వేలి ముద్రలు మరొకరితో పోలి వుండవు. చాలా ప్రత్యేకంగా వేరుగా వుంటాయ్.
హస్తముద్రికం లేదా ఆంగ్లంలో పామిస్ట్రీ అంటారు. ఈ పామిస్ట్రీ గురించి ఆసక్తికరమైన విషయాలను మీకు చెప్పబోతున్నాం.
మీ అరచేతిపైన ఆంగ్లం అక్షరం ఎక్స్ వుంటే ఈ ప్రపంచంలోనే మీరు తెలివైన వారిగా భావించవచ్చు. మీలో అనంతమైన శక్తి దాగివుంది. ఎలక్సాండర్‌కు కూడా హస్తముద్రికంపై చాలా ఆసక్తివుండేది. ఆయన కూడా హస్తముద్రికానికి సంబంధించి ఎన్నో విషయాలను తెలుసుకున్నాడని అంటారు. మాస్కోలోని ఓ యూనివర్సిటీ వారు ఎవరి చేతిపైనైతే ఎక్స్ వుంటుందో వారిపై అనేక పరిశోధనలను చేసారు. ఈ ఎక్స్ వున్న వారు నాయకులవుతున్నారని వారు కనుగ్గొన్నారు. అబ్రహం లింకన్ అరచేతిపైన కూడా ఈ ఎక్స్ మార్క్ వున్నట్లు కనుగ్గొన్నారు.
ఎవరి అరచేతిలో అయితే ఎమ్ అనే అక్షరం వుంటుందో వాళ్ల దగ్గర డబ్బు ఎక్కువగా వుంటుందని అంటున్నారు. సమాజంలో ఉన్నతమైన స్థాయిని కూడా వారు పొందుతారు. వీరు వేరే వారిపైన ఆధారపడే వ్యక్తిత్వాన్ని కలిగి వుంటారు. వాళ్ల గమ్యానికి దారిని వారే తయారు చేసుకోవడానికి ఇష్టపడతారు. మీ అరచేతిలో ఎమ్ వుంటే మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. మీరు ఇప్పుడు ఫెయిల్ అయినా చింతించవద్దు మీరు తప్పకుండా విజయం సాధిస్తారు.
అరచేతిపై బృహస్పతి గ్రహం ఎవరికైతే వుంటుందో వారు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే అవకాశం వుంటుంది. అరచేతి చూపుడు వేలు కింద కుంగివుంటే ఇక మీరు అదృష్టవంతులే, మీకు అంతా మంచే జరుగుతుందని అనుకోవచ్చు.
చేతిరకాలను బట్టి కూడా వారి భవిష్యత్తును చెప్పవచ్చు. ఎవరి అరచేతి అయితే నాలుగు మూలలతో డబ్బా ఆకారంలో వుండి చేతివేళ్లు చిన్నగా వుంటాయో వారు చాలా నిజాయితీగా వుంటారు. ఇక రెండవ రకం చేతి విషయానికి వస్తే.. ఎవరి అరచేతి అయితే రెక్టాంగుల్ షేపులో వుండి చేతి వేళ్లు చిన్నగా వుంటాయో వీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాన్ని కలిగి వుంటారు. మూడవ రకమైన చేతివారు.. ఎవరి అరచేతి అయితే పొడుగ్గా, చేతివేళ్లు కూడా పొడువుగా వుంటాయో వారు చాలా క్రియేటివ్ గా వుంటారు. ఇతరుల మనసులను చాలా సులభంగా దోచుకుంటారు.
ఇక అరచేయి డబ్బా ఆకారంలో వుండి చేతివేళ్లు పొడవుగా వుంటే వీరు చాలా తెలివైన వారిగా భావించవచ్చు. వీరికి ఎప్పుడూ కొత్త ఆలోచనలు వస్తూ వుంటాయ్.
అరికాళ్ల రకాలను బట్టి కూడా వ్యక్తిత్వం వారి భవిష్యత్తు వుంటుంది. ఇందులో ఐదు రకాలు అరికాళ్లు వుంటాయ్. ఈజిప్టియన్ : బొటన వేలి నుంచి చిటికెన వేలి వేలి సైజు చిన్నగా అవుతూ వుంటుంది. రోమన్ : బొటనివేలు, తరువాత రెండు వేళ్లు సమానంగా వుంటయ్. గ్రీకు : బటనివేలి కంటే తరువాతి వేలు పొడవుగా వుటుంది. జెర్మన్ : బొటనివేలు కొంచెపెద్దా మిగతా అన్ని వేళ్లు సమానంగా వుంటాయ్. ఇక చివరగా సెల్టిక్ : బొటనివేలు తరువాతి వేలు పొడవుగా వుంటుంది.

ఇజిప్టియన్ కాళు వున్న వారు ఇతరులను చాలా సులభంగా ఆకర్షిస్తారు. రోమన్ కాళ్లు వుండే వాళ్లు సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. మీ కాళ్లు గ్రీక్ రకమైతే మీలో నాయకత్వ లక్షణాలతో పాటు మీరు చాలా క్రియేటివ్‌గా వుంటారు. మీ కాళ్లు జర్మన్ రకానికి చెందినదైతే మీరు చాల పెద్ద మనసు కలిగి వుంటారు. మీది సెల్టిక్ అయితే మీరు ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నా దానికి ఒక పరిష్కారం మీ వద్ద వుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications