Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
కుజ, చంద్రుల పరివర్తనం.. ఈ 6 రాశుల వారిని కొట్టేవాడె లేరు.. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు!
జోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు తరచూ తమ గమనాన్ని మార్చుకుంటూ ఉంటాయి. అలాగే వేరే గ్రహాలతో పరివర్తనం చెందుతూ ఉంటాయి. దీని కారణంగా ఆ గ్రహాలు అధిపతులుగా ఉన్న రాశులతో పాటు, వేరే రాశులు కూడా తీవ్రంగా ప్రభావితం అవుతాయి. కొన్ని రాశులకు చాలా మంచి జరగడంతో పాటు మరికొన్ని రాశుల వారికి ప్రతికూల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే ఈనెల అంటే నవంబర్ 30వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కుజుడు, చంద్ర గ్రహాలు పరివర్తనం చెందనున్నాయి. ఏక కాలంలో రెండు గ్రహాలు పరివర్తనం చెందడం అనేది చాలా అరుదైన విషయం. అలాంటి రోజు ఈ నవంబర్‌లో వస్తుండడంతో పలు రాశుల వారికి సర్వాధికారాలు దక్కనున్నాయి. ప్రతి విషయంలో ఆ రాశుల వారికి కలిసి వస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం:
జాతకచక్రములో మొట్టమొదటి రాశి మేష రాశి. సహజంగానే ఈ రాశుల వారికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. దీనికి తోడు కుజ, చంద్రుల పరివర్తనం, అలాగే గురు, శుక్రుల పరివర్తనం కూడా తోడవడంతో ఈ రాశి వారు ఉన్నత శిఖరాలను అందుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది ముగింపులోపు ఒక సంస్థకు అధిపతి కావడంతో పాటు, ఉన్నత పదవులు పొందే సూచనలు కనిపిస్తున్నాయి.
సింహ:
సాధారణంగానే సిమ్హరాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయని చెబుతుంటారు. అలాగే వారు బిహేవ్ చేస్తుంటారు కూడా. ఈ రాశి వారు ఎవరినైనా తేలికగా ఆకట్టుకోగలుగుతారు. అలాగే వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఈ లక్షణాలతో పాటు కుజుడు, చంద్రుల పరివర్తనం కూడా వీరికి తోడవడంతో ఈ రాశి వారు సహజంగానే ఉన్నస్థానాలకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగంలో గొప్ప పొజిషన్‌కు వెళ్తారు. ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
కన్య:
వ్యూహాలు రచించడంలో కన్య రాశికి చెందిన వారిని మించిన వారు ఇంకొకరు ఉండరు. వినూత్నమైన పథకాలు వేయడంలో, ప్రణాళికలను సిద్ధం చేయడంలో వీరు నిష్ణాతులు. అలాంటి వ్యక్తులకు కుజుడు, చంద్రుల పరివర్తనం కూడా కలిసి వస్తుంది. దీంతోపాటు మరో నెల రోజుల పాటు ఈ రాశి వారికి మిగిలిన గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. దీంతో వీరికి అంతా శుభఘడియలే ఉండనున్నాయి. జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లే అవకాశం ఉంది. సొంతగా కంపెనీ పెట్టడంతో పాటు, ఉన్నతాధికారుల స్థాయికి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. కొద్దీ ప్రయత్నంలో విదేశాల్లోని కంపెనీల్లో కూడా ఉన్నతమైన బాధ్యతలు చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
వృశ్చికం:
ఈ రాశి వారు సహజంగానే చాలా మంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఎలాంటి సమస్యలనైనా వీరు సులభంగా పరిష్కరించగలరు. అలాగే ఇతరుల మనసును తేలికగా పట్టుకొని వారికి కావాల్సిన విధంగా నడుచుకోగలరు. అలాంటి వ్యక్తులకు కుజుడు, చంద్రుల పరివర్తన యోగం కూడా కలిసి వస్తుంది. దీంతో ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నా వారు అత్యుత్తమ స్థానానికి వెళ్లే అవకాశం ఉంది. చాలా వేగంగా వీరి జీవితంలో పురోగతి కనిపిస్తుంది.
ధనస్సు:
ఈ రాశి వారు సహజంగానే సాహసాలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కొత్త కొత్త ప్రయత్నాలు చేయడం, కొత్త విషయాలను నేర్చుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. అలాగే వీరికి సానుకూలమైన దృక్పథం, పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అలాంటి పట్టుదల కలిగిన వ్యక్తులకు కుజుడు, చంద్రుల పరివర్తన తోడవడం వల్ల.. ఈ రాశి వారు ఒక సంస్థకు అధిపతి కావడం జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి సర్వాధికారాలు దక్కబోతున్నాయి. అలాగే ఒక సంస్థకు ముఖ్యమైన సలహాదారుగా కూడా నియమితులయ్యే ఛాన్సుంది.
మకరం:
ఈ రాశి వారికి సాధారణంగానే క్రమశిక్షణ, పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు తాము అనుకున్న పనులను ఎట్టిపరిస్థితుల్లో పూర్తి చేసేస్తారు. వీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమ తమ రంగాల్లో రాణించేందుకు కృషి చేస్తారు. అలాంటి వ్యక్తులకు ఈ కుజుడు, చంద్రుల పరివర్తనం తోడవడంతో.. ఈ రాశి వారు అధికారంలో అందలాలు ఎక్కే ఛాన్సుంటుంది. చాలా కొద్దీ ప్రయత్నంలో వీరికి ఓ సంస్థకు చెందిన అధికార పగ్గాలు దక్కనున్నాయి. ఉద్యోగులు సైతం ఉన్నత స్థానాలకు చేరుకుంటారు.
గమనిక: ఈ కథనంలోని సమాచారం, జోతిష్య వివరణలు కేవలం మీకు జ్ఞానం అందించేందుకు మాత్రమే అందించబడింది. ఈ కథనం ఆధారంగా మీకు ఎలాంటి నష్టాలైన కలిగిస్తే వాటికి బోల్డ్ స్కై బాధ్యత వహించదు. ఈ సమాచారం ఆధారంగా మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు కచ్చితంగా గుర్తింపుపొందిన నిపుణుల సలహాలు తీసుకోవాలని Boldsky.com మీకు సూచిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications