Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
కుజ అనుగ్రహం.. ఈ మూడు రాశుల వారి బిజినెస్ సక్సెస్ అవుతుంది!
కుజుడు యుద్ధం, కోపం, శక్తి, ఆశయానికి ప్రతీకగా నిలుస్తాడు. కుజ అనుగ్రహం వల్ల మనం అనుకున్న ఆశయాలన్నీ నెరవేరుతాయి. అలాంటి కుజుడు తాను ప్రస్తుతం సంచరిస్తున్న కర్కాటక రాశిని మార్చుకోనున్నాడు. రాశిని మార్చుకోవడం వల్ల పలు రాశుల వారికి కుజ అనుగ్రహం కలగనుంది. దీని కారణంగా వారి ఆశయాలు నెరవేరనున్నాయి. వ్యాపారస్తులకు భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు గొప్ప పదవులు దక్కే ఛాన్సుంటుంది. ఇంతకీ ఏ ఏ రాశుల వారికి కుజుడు అనుగ్రహం కలగనుంది? ఏ రాశుల వారికి లాభాలు రానున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి
మేష రాశి వారికీ అధిపతిగా కుజుడు ఉన్నాడు. అయితే కుజుడు తన రాశిని మార్చుకోవడం వల్ల ఈ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మేష రాశికి చెందిన వారి వ్యక్తిగత, వృత్తి జీవితం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. కర్కాటక రాశిలో కుజుడు ప్రవేశించడం వల్ల.. మేష రాశి జాతకులు ఎంతో కాలంగా పెండింగ్‌లో పెట్టుకున్న పనులను పూర్తి చేస్తారు. కొత్త ప్రణాళికలు రచించి కొత్తగా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తుంటారు.

ఇతరులతో శాశ్వత సంబంధాలు ఏర్పరుచుకోవడానికి ఈ రాశి వారికి అనువైన సమయం. వ్యాపారంలో రాణించాలన్నా ఇది చాలా మంచి సమయం. కుజుడు అనుగ్రహం కారణంగా ఈ రాశి వారి వ్యాపారం మూడు పూవులు, ఆరు కాయలుగా సాగుతుంది. వృత్తి, వ్యాపారంలో భారీగా లాభాలను పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు కూడా లభిస్తుంది.
సింహ రాశి
సింహ రాశి వారు ఈ కుజుడు సంచారం వల్ల ఆర్థికాభివృద్ధి మరియు వృత్తిపరమైన పురోగతిని సాధిస్తారు. గతంలో ఈ రాశి వారు పెట్టిన పెట్టుబడులు, అలాగే ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలపై ద్రుష్టి సారించే అవకాశం ఉంది. తెలివైన ఆర్ధిక అవకాశాలను ఎంచుకుంటారు. తద్వారా భారీగా లాభాలను పొందుతారు.
నాలుగు వైపులా ఆదాయం వస్తుంది. దీని వల్ల ఆర్ధిక అనిశ్చితి తొలిగిపోతుంది. అయితే ఏవైతే వ్యాపారంలో తక్షణమే లాభాలను పొందాలని అనుకుంటారో వారికి కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంది. సింహరాశి వారి వ్యాపారంలో తక్షణ లాభం కోసం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం చూస్తే మంచిది. కొత్త వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వ్యక్తులు పునరాలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
ధనుస్సు రాశి
కుజుడు సంచారం వల్ల ధనుస్సు రాశి వారి సంబంధాలు మెరుగవుతాయి. సంబంధంలో చిన్న చిన్న సమస్యలు తొలిగిపోతాయి. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. దీని కారణంగా ధనుస్సు రాశి జాతకులు భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తారు. అలాగే భాగస్వామి తరఫున ఆస్తుల వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వృత్తి వ్యాపారాన్ని బలోపేతం చేయాలని అనుకుంటున్నా వారికి ఇది చాలా మంచి సమయం. ఎలాంటి వ్యాపారమైనా ఈ సమయంలో ప్రారంభిస్తే కచ్చితంగా విజయం వరిస్తుంది. అలాగే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉండడంతో పాటు మీరు కాన్ఫిడెన్స్ ఉంటారు. దీంతో మీరు ఈ సమయంలో ఎలాంటి పనులనైనా పూర్తి చేసుకోగలుగుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications