Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
అనుగ్రహించిన లక్ష్మీ దేవి.. నవంబర్ 12 వరకు ఈ రాశుల వారికి డబ్బే డబ్బు!
గ్రహ సంచారంలో ప్రస్తుతం చతుర్మాసం కొనసాగుతోంది. జులై 17వ తేదీ నుంచి నవంబర్ 12వ తేదీ వరకు ఈ చతుర్మాస కాలం ఉండనుంది. దేవశయని ఏకాదశి నుంచి ప్రబోధిని ఏకాదశి వరకు ఈ చతుర్మాసం ఉంటుంది. ఈ నాలుగు నెలల కాలంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు. ఈ 118 రోజులో యోగ నిద్రలో ఉండే శ్రీమహావిష్ణువు మళ్ళీ తిరిగి నవంబర్ 12న మేల్కొంటాడు.
వీరికి లక్ష్మీ కటాక్షం కలగనుంది!
చతుర్మాసం అంటే నాలుగు నెలల కాలం. ఈ కాలంలో కొన్ని గ్రహాల సంచారం కారణంగా యోగ నిద్రలో ఉండే శ్రీమహా విష్ణువు కటాక్షం.. కొన్ని రాశుల వారిపై చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ రాశుల వాటికి అదృష్టం పట్టనుంది. శ్రీ మహావిష్ణు కటాక్షంతో పాటు అదృష్టం తోడు అవడంతో ఆ రాశుల వారిపై ధనలక్ష్మి.. డబ్బుల వర్షం కురిపించనుంది. ఆ రాశులంతో ఇప్పుడు చూద్దాం.

వృషభ రాశి: ఈ చతుర్మాస కాలం వృషభ రాశి వారికి, అన్ని రకాలుగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. నవంబర్ 12వ తేదీ వరకు వ్యాపార రంగాల్లో ఉండేవారు విశేషమైన పురోగతిని సాధిస్తారు. ఈ కాలంలో ఎంతో కాలంగా పరిష్కారం కాని సమస్కలను సైతం పరిష్కరించుకుంటారు. ఆర్ధిక పరిస్థితులు చాలా బాగుంటాయి. ధనలాభం కలుగుతుంది. వివాహం కానీ వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.
మిథున: ఈ రాశి వారికి నవంబర్ 12వ తేదీ వరకు అంతా అదృష్ట కాలమే నడవనుంది. ఎవరైతే పోటీ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నారో వారికి ఇది అనువైన సమయం. ఈ చతుర్మాస కాలంలో మిథున రాశి వారకి ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆర్థిక పరంగా చాలా బలోపేతం అవుతారు. కుంటుంబంతో కలిసి చాలా ఆనందంగా గడుపుతారు.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి నవంబర్ 12వ తేదీ వరకు చాలా సానుకూలంగా కాలం గడవనుంది. అనుకున్న కార్యక్రమాలన్నీ ఈ చతుర్మాస కాలంలో కర్కాటక రాశి వారు పూర్తి చేసుకుంటారు. ఎంతో కాలంగా పూర్తవని పనులను సైతం పూర్తి చేసుకుంటారు. ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఆదాయ మార్గాలు పెరగడంతో ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు.
కన్యా రాశి: ఈ చతుర్మాస కాలంలో కన్యారాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ నాలుగు నెలల సమయం కన్యారాశి వారికి అదృష్ట సమయం. నవంబర్ 12వ తేదీ వరకు ఈ రాశి వారు ఏ పని చేసినా విజయం సాధిస్తారు. ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications