Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
2025 Libra Horoscope: 2025లో తులా రాశి వారికి ఎలా ఉంటుందంటే?
2024వ సంవత్సరం ముగింపు దశకు వచ్చేసింది. ఇంకో పది రోజుల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ఇప్పటి నుంచే చాలామంది కొత్త ఏడాది ఎలా ఉండాలి, ఎలాంటి పనులు చేయాలని ప్రణాళికలు వేసుకున్నారు. కొందరు తమ రాశి ఫలం ఎలా ఉంటుందో అని చెక్ చేసుకుంటున్నారు. అయితే 2025లో తులా రాశి వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉంటుంది? వారి కెరీర్, ఆర్ధిక పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కెరీర్
వృత్తి జీవితం దృష్ట్యా, తులారాశి వారికి కొత్త సంవత్సరం బాగానే ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఉండొచ్చు. కానీ తరువాత మంచి ఫలితాలు వస్తాయి. సంవత్సరంలో ఈ రాశి వారు ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే, మార్చి తర్వాత ప్రయత్నించాలి. అప్పుడే మంచి ఉద్యోగాలతో పాటు మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది. మేలో కూడా ఈ రాశి వారి ఉద్యోగ జీవితం అద్భుతంగా ఉంటుంది. సంవత్సరం మొత్తం కెరీర్‌లో ఈ రాశి వారు పురోగతిని చూస్తారు.

అటు వ్యాపారస్తులు ఈ సంవత్సరం ప్రారంభ నెలలో జాగ్రత్తగా ఉండాలి. పెద్ద ఆర్థిక లావాదేవీల జోలికి వెళ్లొద్దు. మార్చిలో శని సంచారం పూర్తయిన తర్వాత ఈ రాశి వారు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. మే నెలలో గురువు సంచారం కూడా వీరికి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. వ్యాపార విస్తరణకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఆర్థిక జీవితం
ఆర్థిక పరంగా, ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వచ్చే సంవత్సరం ఆర్థికపరంగా ఈ రాశి వారికి కొంత అనుకూలంగా మరికొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. మే నెలలో గురువు గ్రహం సంచారం తరువాత.. ఈ రాశికి చెందిన వ్యక్తులు మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మే వరకు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అవసరానికి మించి ఖర్చు చేయకండి.
ప్రేమ, కుటుంబ జీవితం
ప్రేమికులకు 2025 మిశ్రమ ఫలితాలు ఇవ్వనుంది. దంపతుల మధ్య కొన్ని విబేధాలు తలెత్తే అవకాశం ఉంది. అనవసరమైన సందేహం మీ సంబంధాన్ని పాడుచేయవచ్చు. ప్రేమ జీవితంలో ఒత్తిడి ఉంటుంది. సంవత్సరం ప్రారంభ నెలలో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో వివాహ సంబంధిత అంశాల్లో ఈ రాశి వారికి అస్సలు అనుకూలంగా ఉండదు. అయితే మేలో బృహస్పతి సంచార తర్వాత వీరి సంబంధం మెరుగుపడుతుంది. వివాహ నిర్ణయానికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో తలెత్తి కొన్ని కొన్ని విభేదాలను సానుకూలంగా పరిష్కరించుకోవాలి. చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా చేసుకోకూడదు.
ఆరోగ్యం
ఈ సంవత్సరం తులా రాశి వారు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. వచ్చే సంవత్సరం వీరికి తుంటి నొప్పి, చేతి నొప్పి వంటి సమస్య తలెత్తవచ్చు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేస్తే అది కచ్చితంగా ఖరీదైనదిగా మారే అవకాశం ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో, మీరు ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టాలి.
కొత్త సంవత్సరం వాహనాలు, ఆస్తుల కొనుగోలుకు అనుకూలమా?
మీరు ఇల్లు కట్టాలన్నా, స్థిరాస్తి కొనాలన్నా, కారు కొనాలన్నా, ఎలాంటి సమస్యలు ఉండవు. ఈ విషయాల్లో మీ కోరిక నెరవేరే అవకాశం ఉంది. సంవత్సరం రెండవ భాగం మీకు వాహనం కొనుగోలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications