ఈ రాశి వారు శుక్రవారం ఈ పూజ చేస్తే ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువుదీరడం పక్కా.!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశుల్లో తులారాశి ఏడవది. ఈ రాశికి శుక్రుడు అధిపతిగా ఉన్నాడు. ఈ గ్రహం సౌకర్యం, అందం, ఐశ్వర్యం, విలాసాలతో ముడిపడి ఉంటుంది. అందుకే తులా రాశి వారు శుక్రుడి అనుగ్రహం కోసం కొన్ని పూజా పద్ధతులు పాటించినట్లయితే మంచి జరుగుతుందని పండితులు సూచిస్తున్నారు. ఇక, అష్టైశ్వర్యాలకు చిహ్నం శ్రీ మహాలక్ష్మీ దేవి. అమ్మవారి అనుగ్రహం కోసం మీరు శుక్రవారం రోజు ప్రత్యేక పూజ చేసినట్లయితే మీ ఇంట్లో సంపద, శ్రేయస్సు, ఐశ్వర్యాన్ని తీసుకువస్తుందని సూచిస్తున్నారు. పండితుల సూచన మేరకు లక్ష్మీ దేవి పూజ, శుక్రుడికి సంబంధించిన పరిహారాలు ఎలా చేయాలో చూద్దాం..

Libra sign people perform this ritual on a Friday Wealth will grace their home

తులా రాశి వారు లక్ష్మీ దేవిని ఇలా పూజించండి..

గణేష్ పూజ తర్వాత అరుదైన లక్ష్మీ నారాయణ యోగం..వాళ్లకి స్వర్ణ యుగమే!గణేష్ పూజ తర్వాత అరుదైన లక్ష్మీ నారాయణ యోగం..వాళ్లకి స్వర్ణ యుగమే!

తులా రాశి వారికి ప్రతి శుక్రవారం పూజ చేసే ఆనవాయితీ ఉన్నట్లయితే ఈసారి ప్రత్యేకంగా ఇలా పూజ చేసి అమ్మవారి ఆశీస్సులు పొందండి. ఉదయాన్నే ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకుని స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. లక్ష్మీ దేవి ఫొటో లేదా విగ్రహం ముందు నెయ్యి దీపం వెలిగించండి. అమ్మవారికి ఇష్టమైన తామర పువ్వు లేదా తెల్లని పువ్వులను సమర్పించండి. నైవేద్యం కోసం పాయసం, చక్కెరతో చేసిన స్వీట్స్‌ లేదా పాలతో చేసిన మిఠాయిలు సమర్పించి పూజ చేసుకోండి. పూజ చేసేట్పపుడు "ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః" అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మవారిని ఆరాధించండి. సంపద, సంతోషం కోసం శ్రీ మహాలక్ష్మితో పాటు విష్ణుమూర్తిని కూడా పూజించండి. ఇద్దరి అనుగ్రహమూ ఉంటుంది.

Libra sign people perform this ritual on a Friday Wealth will grace their home

శుక్రుడుని బలపరిచే విధానం

జ్యోతిష్యం ప్రకారం శుక్రుడికి తెలుపు రంగుతో సంబంధం ఉన్న కారణంగా.. మీ జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నట్లయితే మీ శక్తి సామర్థ్యాల ప్రకారం కొన్ని దానధర్మాలు చేయండి. వాటిలో బియ్యం, పాలు, పెరుగు, చక్కెర మిఠాయిలు లేదా తెల్లని దుస్తులను దానం చేయడం మంచిది. అదే విధంగా శుక్ర మంత్రాన్ని జపించినట్లయితే మీ జాతకంలో ఈ గ్రహ స్థానం బలపడుతుంది. మీ జాతకంలో శుక్రుడు ఏ స్థానంలో ఉన్నాడో తెలుసుకుని పండితుల అభిప్రాయ మేరకు రత్నాలు ధరించడం, పరిహారాలు చేయడం ఉత్తమం.

లాభ దృష్టి యోగం: సెప్టెంబర్ 15 తర్వాత ఈ నాలుగు రాశుల ఇళ్లలో ధనలక్ష్మి తిష్ట!లాభ దృష్టి యోగం: సెప్టెంబర్ 15 తర్వాత ఈ నాలుగు రాశుల ఇళ్లలో ధనలక్ష్మి తిష్ట!

తులా రాశి వారు ఈ విధంగా శుక్రవారం రోజు పాజిటివిటీతో పూజిచండం, దానధర్మాలు చేయడం అలవాటు చేసుకోండి. అయితే ఇలా పూజలు, దానధర్మాలతో ఫలితం ఉంటుందని అనుకోవద్దు. మీరు ఆర్థికంగా బలపడటానికి పూజ, పరిహారాలతో పాటు చేస్తున్న పనిలో తగిన కృషి, పట్టుదల, అంకితభావం ముఖ్యమని గుర్తుంచుకోండి. అప్పుడే మీ పూజలు, పరిహారాలకు ఫలితం దక్కుతుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Thursday, September 10, 2026, 7:30 [IST]
Desktop Bottom Promotion