రాబోయే రోజుల్లో తులా రాశి వారు జాగ్రత్తగా ఉండకపోతే జరిగేది ఇదే..!!

బ్రహ్మంగారు కాలజ్ఞానంలో అనేక విషయాల గురించి చెప్పారు. తన దివ్యజ్ఞానంతో ఎన్నో విషయాలను కాలజ్ఞానంలో పొందుపరిచారు. తులా రాశి వారు ఎవరితోనైనా సరే సులభంగా కలిసిపోతారు. అలాగే ఈ రాశి వారికి ఆత్మాభిమానం అధికంగా ఉంటుంది. అయితే ఈరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది. దీని వలన కొన్ని కొన్ని సందర్భాల్లో తీవ్రంగా నష్టపోతారు కాబట్టి ఆవేశాన్ని తగ్గించుకోవడం మంచిది. అలాగే ఈ రాశి వారు ఇతరుల బాధ్యతలను కూడా తమ నెత్తిన పెట్టుకొని మోస్తారు. దీనివలన ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలు, బాధపడుతూ ఉంటారు. అలాగే వీరికి కోపం ఎక్కువగా వస్తుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది. ఈ రాశి వారి విచిత్రమైన గుణం ఏంటంటే వీరికి నచ్చిన విషయాలు ఎదుటి వారిలో వెతుక్కుంటారు. అందువలన ఎదుటి వారిని తప్పు పట్టడం, న్యాయం పేరుతో ఇతరులని నిందిస్తూ వారితో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ రాశి వారు ఎవరు ఏ తప్పు చేసినా క్షమిస్తారు.

Libra zodiac sign people must be carefull in the coming days

వీరికి క్షమాగుణం కూడా ఉంది. అలాగే వీరు ఏదైనా మంచి పని చేస్తే దానిని ప్రచారం చేసుకోరు. చూడడానికి కఠినమైన స్వభావం కలిగినవారుగా ఉంటారు. కానీ వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. ఈ రాశి వారిని భయపెట్టి లొంగదీసుకోవడం అనేది దాదాపు చాలా అసాధ్యం అని చెప్పవచ్చు. ఎవరికి వీరు భయపడరు, అలాగే వీరు ఏదైనా విషయంలో ఒక నిర్ణయానికి వస్తే వారి నిర్ణయాన్ని మార్చడం చాలా కష్టం. వీరికి స్వాభిమానం, పట్టుదల, ఆదర్శం. అందరికంటే గొప్పగా జీవించాలనే కుతూహలం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడూ ఓటమిని అంగీకరించరు. అలాగే విషయంలో నిరాశపడ్డారు. గెలుపు కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటారు.

కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా అజ్ఞాతవాసం అలాగే వారి కంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని ఆశ్రయించడం వంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. వీరు సంస్థల స్థాపన, వ్యాపారాలు, విస్తరణ ధ్యేయంగా పనిచేస్తారు. అలాగే ఈ రాశిలోని ఉద్యోగులు వారి విధుల పట్ల స్పష్టమైన వైఖరిని అవగాహన కలిగి ఉంటారు. వీరు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బ తీస్తే అసలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయంగా నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీళ్ళకి ఏ పని అప్పచెప్పినా చాకచక్యంతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వీరికి ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయం బాగా తెలుసు. లోక జ్ఞానాన్ని కలిగి ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో లౌక్యంగా తెలియనట్లుగా చాలా సైలెంట్ గా ఉంటారు. అలాగే ముఖ్యంగా ఈ రాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు.

ప్రతిష్టకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్ధులుగా పేరు గడిస్తారు. వంశ ప్రతిష్టకు కులగౌరవాన్ని, ప్రాధాన్యతను ఇస్తారు. మనుషులందరినీ సమానంగా చూస్తారు. సమాజంలో అన్ని వర్గాలు సమానమనే భావన కలిగి ఉంటారు. వీరు డబ్బు, ఆస్తి పాస్తులు, అధికారం వంటి విషయాలకు అంత విలువ ఇవ్వరు. కానీ కీర్తి దాహం అనే విషయాలు మాత్రం లొంగిపోతారు. వీరి జీవిత భాగస్వామి విషయంలో ప్రత్యేక ధోరణి కలిగి ఉంటారు. ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ప్రేమ దేవత లాగా ఆరాధించాలని కోరుకుంటారు. కానీ త్వరపడి ఎవర్నో ఒకర్ని వివాహం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. దీని వలన జీవిత భాగస్వామి వీరు ఆశించిన విధంగా లేకపోతే ఏదో కోల్పోయినట్లు బాధపడుతూ ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి వివాహ జీవితం అంత సంతృప్తిగా ఉండదు. ఎందుకంటే జీవిత భాగస్వామి చక్కగా ఉండాలని వీరు కోరుకుంటారు కాబట్టి దీని వలన కొన్ని సందర్భాల్లో గొడవలు జరుగుతూ ఉంటాయ్, కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు ఆలోచించి ప్రవర్తించడం మంచిది.

సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుకుంటారు. కుటుంబ బాధ్యతలన్నిటినీ చక్కగా నెరవేర్చుకుంటారు. ఈ రాశి వారు వైద్య నాయకత్వంలో బాగా రాణిస్తారు. అలాగే పొలిటికల్ రంగంలో టెక్నికల్ అడ్వైజర్ గాను టీమ్ లీడర్‌గాను బాగా రాణిస్తారు. అంతేకాకుండా ఉపన్యాసం ఇవ్వడం, సాహిత్యం శాస్త్ర బోధన, సాంకేతిక విద్య వంటి వాటిలో కూడా బాగా రాణిస్తారు. ఈ రాశివారికి రవి కుజ గురు మహర్దశ ముగుస్తాయి. శని దశ కూడా బానే ఉంటుంది. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. అయితే వీరు రెండు విషయాలను మాత్రం బాగా గుర్తించుకోవాలి. ముఖ్యంగా ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి. వీరి ఉద్దేశాలు గొప్పవైనా సరే. కొన్నిసార్లు ఆచరణలో పెట్టడం అనేది కష్టం అవుతుంది. ఆ విషయాన్ని గ్రహించుకొని నడుచుకోవాలి. అలాగే వారికి అనారోగ్య సమస్యలు అంటూ ఏమీ ప్రత్యేకంగా ఉండవు. సాధ్యమైనంత వరకు ఆరోగ్యంపైన సంపూర్ణ శ్రద్ధను కలిగి ఉంటారు. దీని వలన ఆరోగ్య పరిస్థితులు ఎప్పుడూ మెరుగ్గా ఉంటాయి. అలాగే ఈ రాశి వారి జీవితంలో అదృష్ట యోగానికి పొందడం కొరకు, చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి నిత్యం శివారాధన చేయాలి. గురువారం రోజున దత్తాత్రేయుని ముందు అవును దీపాన్ని వెలిగించాలి. ప్రతినిత్యం సుందరకాండ పారాయణం చేయడం ద్వారా శుభఫలితాలు పొందుతారు.

ముఖ్యంగా నారింజ, ఎరుపు, ఆకుపచ్చ రంగులు వీరికి బాగా కలిసి వస్తాయి. కాబట్టి ఏదైనా శుభకార్యాలకు వెళ్లేటప్పుడు ఏదైనా మంచి పనులను ప్రారంభించేటప్పుడు ఈ రంగుల వస్త్రాలను ధరించడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈ రాశి వారు గ్రహ దోషాలను తొలగించుకోవడం కొరకు పాటించాల్సిన పరిహారాలు గురించి చూసుకున్నట్లయితే శనివారం రోజున పాల బియ్యం వీలైతే వెండి వాటిని దానం చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. అలాగే మెడలో ఖాకీ రంగు దారానికి రాగి నాణ్యం తగిలించి ధరించడం మీకు అదృష్టం తెలుస్తోంది. అలాగే మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి పూజించడం ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ప్రతికూల శక్తి అంతా తొలగిపోతుంది. అలాగే ప్రత్యక్ష దైవం అంటూ సూర్యభగవానుడికి ప్రతినిత్య నమస్కారం చేస్తూ ఆదిత్య హృదయ పారాయణ చేయడం ద్వారా మీకు శుభం కలుగుతుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Tuesday, July 30, 2024, 16:27 [IST]
Desktop Bottom Promotion