Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
పెళ్లైన కూతురికి అది ఇస్తే ఆమె అదృష్టం పెరుగుతుంది..శుభమార్పులు,హ్యాపీ లైఫ్!
ఏ తల్లిదండ్రులైనా సరే తమ పిల్లలు సంతోషంగా,ఆనందంగా ఉండాలనే కోరుకుంటారు. పెళ్లి చేయడంతోనే తమ బాధ్యత తీరిపోయిందని రిలాక్స్ అవ్వరు. తమ బిడ్డలు ఎక్కడ కష్టపడాల్సి వస్తుందోనని అప్పటిదాకా తాము కూడబెట్టినదంతా కూతురు లేదా కొడుకుకి ఇచ్చేస్తుంటారు. ఆ తర్వాత కూడా ఏదో ఒక పని చేస్తూనే బిడ్డలకు అండగా నిలబడుతుంటారు. సాధారణంగా
పెళ్లయిన కూతురికి చాలా మంది తల్లిదండ్రులు బహుమతులు ఇస్తుంటారు. అవసరానికైనా, అభిరుచికైనా ఒక్కోసారి ఏదో ఒకటి ఇస్తుంటారు.
కొంతమంది అయితే కూతురు సంతోషం కన్నా ఏదీ ఎక్కువ కాదంటూ అప్పులు చేసి అయినా కూతురుకి ఏదో ఒక కానుకలు ఇస్తుంటారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం తల్లిదండ్రులు పెళ్లైన కూతురికి కొన్ని బహుమతులు ఇవ్వడం ద్వారా వివాహిత అమ్మాయి అదృష్టాన్ని కూడా మెరుగుపరచవచ్చు. ఆమె ఆనందం ఉండటమే కాకుండా అనేక ఇతర అంశాలలో శుభ మార్పులు కనిపిస్తాయి. అయితే ఏ రోజు ఏది ఇవ్వాలో కూడా తెలుసుకోవడం ముఖ్యం.

సోమవారం
వివాహిత అమ్మాయికి సోమవారం బియ్యం, పాలు కలిపిన మిఠాయి ఇవ్వండి. ఫలితంగా ఆమె వైవాహిక జీవితం ఆనందం, శాంతితో నిండి ఉంటుంది.
మంగళవారం
పెళ్లయిన అమ్మాయికి మంగళవారం ఎరుపు రంగు దుస్తులు ఇస్తే ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు.
బుధవారం
వివాహమైన అమ్మాయికి బుధవారం ఆకుపచ్చ రంగు కంకణం,పిస్తా ఇవ్వడం ఆమె జీవితంలో శ్రేయస్సును కలిగిస్తుంది. దీర్ఘ అనారోగ్యం కలిగి ఉంటే,ఆమె త్వరగా దాని నుంచి బయటపడుతుంది.
గురువారం
పెళ్లయిన అమ్మాయికి కుంకుమపువ్వు లేదా పసుపు రంగు దుస్తులు, వీలైతే బంగారంతో చేసిన ఏదైనా చిన్న వస్తువును బహుమతిగా ఇవ్వండి. ఆమె కుటుంబంలో ఎదుగుదల ఉంది.
శుక్రవారం
పెళ్లయిన అమ్మాయికి శుక్రవారం పట్టు వస్త్రాలు, మిఠాయి ఇస్తే ఆమె వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఫలితంగా ఆమె వైవాహిక జీవితంలో ఎటువంటి ఆటంకాలు ప్రవేశించవు.
శనివారం
పెళ్లయిన అమ్మాయికి శనివారం కొబ్బరికాయ, బాదంపప్పు పెడితే అత్తగారితో సంబంధం బాగుంటుంది.
ఆదివారం
పెళ్లయిన అమ్మాయికి ఆదివారం ఎండుద్రాక్ష, తేనె ఇవ్వడం వల్ల ఆమెకు లక్ వస్తుందని నమ్ముతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications