Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
హనుమజయంతి సందర్భంగా ఈ రాశులు వారంటే హనుమంతుడికి చాలా ఇష్టం
lord Hanuman's favourite zodiac sign రేపు అంటే ఏప్రిల్ 23న హనుమ జయంతి జరుపుకుంటారు. ఈ రోజును శ్రీ ఆంజనేయ స్వామి వారిని భక్తితో పూజిస్తారు. ఈ రోజున ప్రత్యేకంగా హనుమంతుడికి పూజచేయడ వల్ల హనుమంతుని ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయని చాలా మంది విశ్వసిస్తారు. హనుమజయంతి రోజున గ్రహాల ప్రభావం కూడా ఉంటుంది. ఈ ప్రభావం కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది.
హనుమజయంతి రోజును కొన్ని రాశుల వారికి శుభ్రప్రదం. భక్తితో పూజించడం వల్ల వారికి ఎల్లప్పుడూ హనుమంతుని ఆశీస్సులు మెండుగా ఉంటాయి. మరి హనుమంతునికి ఇష్టమైన రాశుల వారు ఎవరో ఇక్కడ తెలుసుకోండి. అలాగే హనుమజయంతి నాడు శని సాడేసతి , అంగార దోష నివారణకు పరిష్కారాలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి..

మేషరాశి
హనుమంతునికి ఇష్టమైన రాశులలో మొదటిది మేషం. మేషరాశికి అధిపతి అంగారకుడు, అంగారకుడిని హానిమంతునికి అంకితం చేయబడినది. కనుక మేషరాశిలో అంగారకుడు ప్రతికూల ప్రభావాలు ఉన్నా లేదా పరిస్థితిలు బాగోలేకపోయినా హనుమజయంతి రోజు మాత్రమే కాకుండి ప్రతి రోజూ పూజిస్తే మంచి జరుగుతుంది.
సింహ రాశి
హనుమంతునికి ఇష్టమైన మరో రాశి సింహరాశి. సింహరాశికి సూర్యుడు అధిపతి. హనుమంతునికి గురువుగా భావించే సూర్యభగవానుడిని అన్ని గ్రహాలకు రారాజుగా పిలుచుకుంటారు. హానుమంతుని అనుగ్రహం గురు గ్రహం మీద పుష్కలంగా ఉంటుంది. హానుమంతుడు సూర్యుని అనుగ్రహం వల్ల ఎన్నో విజయాలు సాధించాడు. హనుమంతుని అనుగ్రహంతో సింహరాశి వారు ఆనందం , శ్రేయస్సు పొందుతారు.
వృశ్చికరాశి
వృశ్చికరాశి అంగారకుడు అధిపతి . ఈ కారణంగా వీరిపై హనుమంతుని ఆశీస్సులు ఎల్లప్పూడూ ఉంటాయి. మీరు కూడా హనుమంతుని అనుగ్రహం పొందాలంటే నేడు దేవుడికి లడ్డూ నైవేద్యంగా పెట్టండి. ఇలా చేయడం వల్ల తెలివితేటలు మరియు కీర్తిని పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి వారు మంగళవారం హనుమంతుడిని పూంజించాలి.
కుంభ రాశి
హనుమంతుడికి కుంభరాశి వారంటే కూడా చాలా ఇష్టం. కుంభరాశికి అధిపతి శని. ఈ రాశి వారికి ఎల్లప్పుడూ హనుమంతుని అనుగ్రహం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారు శనిదేవునికి ఆవాలను నూనె లేదా నువ్వుల నూనె సమర్పిస్తే మీ బాధలన్నీ తొలగిపోతాయి. అదే సమయంలో, హనుమంతుడిని పూజించడం ద్వారా, ప్రజలు శని ప్రభావం నుండి విముక్తి పొందుతారని శని దేవుడు చెప్పాడని చెబుతారు. అప్పటి నుండి హనుమ మరియు శనిని స్నేహితులుగా భావిస్తారు.
హనుమ జయంతి సందర్భంగా ఆంజనేయస్వామిని ప్రసన్నం చేసుకోవడానికి మార్గాలు:
*హనుమాన్ జయంతి నాడు హనుమంతుడికి లడ్డూ ప్రసాదం అందించండి. ఇలా చేయడం వల్ల నవ గ్రహాలను శాంతింపజేస్తుంది. జీవితంలోని అన్ని కష్టాల నుండి మీరు విముక్తి పొందుతారు.
*హనుమాన్ జయంతి నాడు మీరు హనుమాన్ ఆలయంలో తీపి తమలపాకులు మరియు ఎరుపు వస్త్రాన్ని సమర్పించాలి.
*మీపై శనిదేవుని సడేసత్ ప్రభావం ఉంటే, హనుమ జయంతి రోజున ఆవనూనె దీపంలో నల్ల నువ్వులు వేసి హనుమంతుడికి హారతి ఇవ్వండి, ఇది మీ జాతకంలో శని నీడ నుండి విముక్తిని ఇస్తుంది.
* హనుమాన్ జయంతి నాడు మాత్రమే కాకుండా ప్రతి మంగళవారం స్నానం తర్వాత ఎరుపు రంగు దుస్తులు ధరించి హనుమంతుడిని పూజించి సంప్రదాయం ప్రకారం సింధూరాన్ని సమర్పించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications