Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
2025లో అదృష్ట రాశులు ఇవే.. ఈ 6 రాశుల వారు అదృష్టాన్ని జేబులో పెట్టుకొని తిరుగుతారు!
2024వ సంవత్సరం కొంతమంది అనుకూలంగా మరికొంతమందికి అద్భుతంగా గడిచిపోయింది. అయితే 2025వ సంవత్సరం మాత్రం దాదాపు అన్ని రాశుల వారికి అనుకూలంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. గ్రహాల గమనాల్లో మార్పులు, గ్రహాల కలయికలు, అదృష్ట యోగాలు 2025లో భారీగా ఏర్పడనున్నాయి. దీని కారణంగా చాలా రాశుల వారు అదృష్టాన్ని పుట్టుమచ్చ వేసుకున్నట్లు, తమ జేబులో వేసుకొని తిరుగుతారు.
అయితే మరీ ముఖ్యంగా ఈ ఆరు రాశుల వారు మాత్రం 2025 మార్చి వరకు ఓటమి లేకుండా అద్భుతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తారు. కొద్దీ ప్రయత్నంలోనే భారీగా డబ్బులు సంపాదిస్తారు. అనుకున్న పనులన్నిటినీ పూర్తి చేసేస్తారు. శుక్ర, కుజుల అనుగ్రహంతో పాటు ఆ గ్రహాలు ఈ రాశుల వారిపై ఉచ్ఛపట్టడం వల్ల.. ఈ అదృష్ట యోగం కలగనుంది. ఇంతకీ ఆ రాశులు ఏంటి? వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వృషభం
2025 సంవత్సరం ఈ రాశి వారికి అద్భుతంగా, అత్యంత వైభవంగా ప్రారంభంకాబోతుంది. ఈ రాశికి నాథుడు శుక్రుడు ఉచ్ఛపట్టడం వలన ఈ రాశి వారికి అదృష్టం ఫెవిక్విక్ అంటుకున్నట్లు అంటుకుంటుంది. దీని కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులు కొద్దీ ప్రయత్నంలో అనేక విజయాలను సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అద్భుతమైన పురోగతితో పాటు, భారీగా లాభాలను గడిస్తారు. కొన్ని పెండింగ్ పనులు పూర్తవుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. అలాగే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు.
కర్కాటకం
ఈ రాశి వారికి కూడా 2025 ప్రారంభ నెలలు అద్భుతంగా ఉండబోతున్నాయి. ఈ రాశి వారికి శుక్రుడు ఉచ్ఛపట్టడంతో పాటు కుజుడు అనుకూలంగా మారడం వలన ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు అనేక విధాలుగా ఆదాయం వచ్చి జేబులు నిండిపోతాయి. విదేశీ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. లక్ష్మీకటాక్షాలు కలుగుతాయి.
తుల
ఈ రాశి వారికి అధిపతి అయిన శుక్రుడు ఉచ్ఛపట్టడంతో పాటు భాగ్యస్థానంలో కుజుడు ఉండడం వలన ఈ రాశి వారికి కూడా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. ఈ రెండు గ్రహాల అనుగ్రహం కారణంగా ఈ రాశి వారు ఏమనుకుంటే అది ఇట్టే జరిగిపోతుంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగ పరంగా కూడా అనేక మంచి శుభపరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆర్ధిక సమస్యల నుంచి బయటపడడంతో పాటు భారీగా డబ్బులు సంపాదిస్తారు.
వృశ్చిక
ఈ రాశి వారికి అధిపతి అయిన కుజుడు బలంగా ఉండడంతో పాటు పంచమ స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టడంతో ఈ రాశి వారు కూడా చాలా బలంగా తయారవనున్నారు. దీని కారణంగా ఈ రాశి వారికి భారీగా డబ్బులు వచ్చి పడతాయి. అధికార యోగం పట్టడంతో వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. జీతాలు కూడా భారీగా పెరుగుతాయి. ఉన్నత స్థానాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
ధనుస్సు
ఈ రాశి వారికి కుజ, శుక్ర గ్రహాలు ఇద్దరూ కనక వర్షం కురిపించనున్నారు. ఈ రెండు గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉండబోతున్నారు. దీని కారణంగా ఈ రాశి వారికి అనేక విధాలుగా డబ్బులు సంపాదిస్తారు. ఆస్తుల విలువల బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో భారీగా లాభాలు పొందడంతో పాటు స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందడంతో పాటు, జీతాలు పెరుగుతాయి. ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. కుటుంబ జీవితం కూడా సంతోషంగా కొనసాగుతుంది.
మకరం
ఈ రాశి వారికి అత్యంత శుభ గ్రహంగా శుక్రుడు ఉన్నాడు. అలాంటి శుక్రుడు ఉచ్ఛపట్టడం, అలాగే కుజుడు కూడా అనుకూలంగా మారడంతో ఈ రాశి వారికి అనేక శుభపరిణామాలు జరుగుతాయి. డబ్బులు బాగా సంపాదిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కనీవినీ ఎరగని రీతిలో సుఖ సంతోషాలను పొందుతారు. అనేక సమస్యల నుంచి బయటపడతారు. పెట్టుబడుల్లో లాభాలు చూస్తారు. అలాగే వృత్తి, వ్యాపారాల్లో గుర్తింపు, స్థిరత్వంతో పాటు, లాభాలు కూడా పొందుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications