Lucky month : 2025లో ఏ నెలలో మీకు ఎక్కువ అదృష్టం ఉంటుందో చూడండి

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఇబ్బందులు ఎదుర్కొంటున్నవాళ్లు కొత్త ఏడాదిలోనైనా మంచి జరుగుతుందని ఆశపడుతుండగా..కొత్త ఏడాది మరింత మంచిగా ఉండాలని మరికొందరు కోరుకుంటున్నారు.

జోతిష్యశాస్త్రం ప్రకారం 2025 ఏడాది ప్రతి రాశికి అవకాశాలు, సవాళ్లు, విజయాలను అందిస్తుంది. అయితే 2025లో ఏ రాశి వారికి ఏ నెల అత్యంత అదృష్టంగా ఉంటుంది,ఆ సమయాన్ని మీరు ఎలా ఉపయోగించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

lucky month for all zodiac signs in 2025

మేషం (మార్చి 21-ఏప్రిల్ 19 మధ్య పుట్టినోళ్లు)

అదృష్ట నెల: ఫిబ్రవరి 2025
ఫిబ్రవరిలో నక్షత్రాలు మీ విశ్వాసాన్ని, సంకల్పాన్ని బలపరుస్తాయి. అడ్డంకులు తొలగిపోతాయి. కెరీర్, వ్యక్తిగత లక్ష్యాలను సులభంగా సాధించగలుగుతారు. కొత్త ప్రాజెక్ట్‌ని ప్రారంభించినా,మీ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లినా లేదా ఉత్తేజకరమైన ప్రయాణాన్ని ప్రారంభించినా ధైర్యంగా అడుగులు వేయాల్సిన సమయం ఇది. మీ మనసు చెప్పేది మాత్రమే వినండి.

వృషభం(ఏప్రిల్ 20 - మే 20)

అదృష్ట నెల: అక్టోబర్ 2025
అక్టోబర్ వృషభ రాశికి స్థిరత్వం, వ్యక్తిగత అభివృద్ధి నెల అవుతుంది. నెలాఖరు నాటికి మీరు కొత్త ప్రాజెక్ట్‌లు, ఆర్థిక పెట్టుబడులు లేదా సంబంధాలను బలోపేతం చేసుకునే కొత్త అవకాశాలను పొందుతారు. ఈ నెలలో సానుకూల మార్పులను స్వీకరించండి, మీ భవిష్యత్తును మెరుగుపరచుకోండి.

మిథునం(మే 21-జూన్ 20)

అదృష్ట నెల: జూన్ 2025
జూన్ నెలలో మీరు మీ కలలను సాకారం చేసుకునే అవకాశాన్ని పొందుతారు. ఈ నెల శృంగారం,ఆనందంతో నిండి ఉంటుంది. ప్రియమైనవారితో చిరస్మరణీయమైన క్షణాలను గడపడానికి మీకు అవకాశం ఉంటుంది. కెరీర్, ఆర్థిక రంగాలలో కూడా మెరుగుదల సంకేతాలు ఉన్నాయి. మీ ప్రయత్నాలు బంగారు ఫలితాలను ఇస్తాయి.

కర్కాటకం(జూన్ 21 - జూలై 22)

అదృష్ట నెల: ఆగష్టు 2025
ఆగస్టు కర్కాటకరాశి వారికి సానుకూలత,సంతోషాన్ని కలిగిస్తుంది. మీ సంబంధాలు బలపడతాయి. జీవితంలో కొత్త స్పష్టత ఉంటుంది. నెలాఖరు నాటికి ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. కొత్త మార్గాల్లో నడవడానికి సిద్ధంగా ఉంటారు.

సింహం(23 జూలై - 22 ఆగస్టు)

అదృష్ట నెల: మార్చి 2025
మార్చి సింహరాశికి జీవితాన్ని మార్చే అవకాశాలను తెస్తుంది. కెరీర్, వ్యక్తిగత అభివృద్ధికి కొత్త డోర్స్ ఓపెన్ అవుతాయి. మీ కృషి, ఉత్సాహం ఏడాది పొడవునా విజయానికి పునాది వేస్తుంది. కొత్త సాహసాలను స్వీకరించండి. మీ అంతర్గత శక్తిని విశ్వసించండి.

కన్య(23 ఆగస్టు - 22 సెప్టెంబర్)

అదృష్ట నెల: జూలై 2025
జూలై కన్యారాశి వారికి గుర్తింపు నెల అవుతుంది. మీ కృషి ఫలిస్తుంది. మీ ప్రయత్నాలకు అభినందనలు లభిస్తాయి. అది పరీక్ష అయినా,ప్రాజెక్ట్ అయినా విజయం దాదాపు ఖాయం. వ్యక్తిగత,వృత్తిపరమైన వృద్ధికి ఈ సమయాన్ని ఉపయోగించండి.

తుల(సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)

అదృష్ట నెల: ఫిబ్రవరి 2025
ఫిబ్రవరి తులారాశి వారికి ఉత్తేజకరమైన అవకాశాలతో నిండి ఉంటుంది. ప్రయాణాలు, వృత్తిలో పురోగతి సంకేతాలు ఉన్నాయి. ఈ నెలలోని శక్తి మిమ్మల్ని మీ లక్ష్యాల వైపు కదిలిస్తుంది. కొత్త అనుభవాలకు తలుపులు తెరుస్తుంది. మీ ప్రయత్నాల ఫలాలను ఆనందించండి.

వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)

అదృష్ట నెల: మే 2025
మే వృశ్చికరాశి వారికి పరివర్తన కలిగించే సమయం. మీ అంకితభావం, కృషి ఫలిస్తాయి. రిలేషన్స్‌లో కూడా డెప్త్, అందం ఉంటాయి. మీ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించండి.

ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)

అదృష్ట నెల: జనవరి 2025
జనవరి ధనుస్సు రాశి వారికి సంవత్సరంలో అత్యంత అనుకూలమైన నెల. మీ కలలను నిజం చేసుకోవడానికి. కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి ఇది సమయం. ఆర్థిక, వృత్తి రంగాలలో పురోగతి సంకేతాలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసం, ఉత్సాహంతో సంవత్సరాన్ని ప్రారంభించండి.

మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)

అదృష్ట నెల: ఫిబ్రవరి 2025
ఫిబ్రవరి మకర రాశి వారికి ప్రోత్సాహకరమైన నెల. మీ శక్తి సామాజిక కార్యక్రమాలు, ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ప్రతిబింబిస్తుంది. వ్యక్తిగత, వృత్తిపరమైన అభివృద్ధిపై దృష్టి పెట్టండి. మీ ప్రయత్నాలు సంతృప్తిని కలిగిస్తాయి.

కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)

అదృష్ట నెల: జూన్ 2025
జూన్ కుంభ రాశి వారికి సంతోషంతో కూడిన నెల అవుతుంది. ప్రయాణాలు, కొత్త వృత్తిపరమైన ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంటారు. కొత్త ఆదాయ వనరులు, అవకాశాలు కనిపిస్తాయి. ధైర్యంగా అడుగులు వేయడానికి, మీ లక్ష్యాలను సాధించడానికి ఇది సరైన సమయం.

మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)

అదృష్ట మాసం: మార్చి 2025
మీనరాశికి మార్చిలో సంబంధాలలో పురోగతి సంకేతాలు ఉన్నాయి. ఈ నెల ఆనందం,సంతృప్తితో నిండి ఉంటుంది. ఈ నెలలో ప్రతి క్షణం ఆనందించండి.

Note: మత విశ్వాల ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. బోల్డ్ స్కై తెలుగు దీనిని ధృవీకరించలేదు. దీనిని పాటించడం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Thursday, November 21, 2024, 15:59 [IST]
Desktop Bottom Promotion