Latest Updates
-
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి
నేటి అదృష్ట రాశులు ఇవే.. సింహం,ధనస్సు సహా ఈ 5 రాశుల వాళ్లు డబ్బుతో నిండిపోతారు
గ్రహాల రాజుగా పిలువబడే సూర్యభగవానుడు ఇవాళ(మే 11)మేషరాశిలో, మనసుకు కారకుడైన చంద్రుడు తుల రాశిలో ఉన్నారు. ఈ రోజున రవి యోగం కూడా ఏర్పడుతుందని పండితులు తెలిపారు. ఈ సూర్య చంద్ర సంయోగం 5 రాశుల వాళ్ల జీవితంలో అదృష్టాన్ని పెంచుతుంది. పని, డబ్బు, చదువు, ప్రయాణం, రిలేషన్స్ లో అన్నింటా విజయమే ఉంటుంది. కుటుంబంలో సానుకూల మార్పులు ఉంటాయి. ఈ రోజున అదృష్టం పెరిగి భారీగా లాభపడే ఆ 5 రాశులు ఏవో ఇక్కడ చూడండి.
మేషం
మేష రాశి వారికి మే 11 ఒక ప్రత్యేకమైన రోజుగా నిలుస్తుంది. ఒక కొత్త శుభారంభానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఎప్పటి నుంచో ఒక కొత్త పనిని ప్రారంభించాలని యోచిస్తున్నట్లయితే నిస్సందేహంగా ఈ రోజు మీకు విజయాన్ని అందిస్తుంది. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అంతేకాకుండా గతంలో మీరు చేసిన పెట్టుబడులు ఇప్పుడు మీకు లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఊహించని ధనలాభం ఉంటుంది. ఉద్యోగస్తులకు మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించే సమయం ఇది. జీతం పెరుగుదల లేదా పదోన్నతి వంటి శుభవార్తలు మిమ్మల్ని మరింత ఉత్సాహపరుస్తాయి. మీపై బాధ్యతలు పెరిగినా మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి వచ్చే ఒక మంచి విషయం మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.

వృషభం
వృషభరాశి వాళ్లు అదృష్టం ఎదురొచ్చి అడ్డుపడుతుంది. గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న, మధ్యలో ఆగిపోయిన పనులన్నీ ఒక్కసారిగా పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఊహించని విధంగా అడ్డంకులు తొలగిపోతాయి. మీ గౌరవం మరింత పెరుగుతుంది. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రజల్లో మీ నమ్మకం నిలబడుతుంది. చాలా మంది ముఖ్యమైన విషయాల్లో మీ సలహా తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఇది మీలోని నాయకత్వ లక్షణాలను మరింత బలపరుస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల్లో లేదా కోర్టు కేసుల్లో మీకు విజయం లభించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు వస్తాయి. మీ సామర్థ్యాన్ని నిరూపించుకోడానికి ఇదో మంచి ఛాన్స్. వ్యాపారస్తులకు భారీ లాభాలు ఉంటాయి. మీ బిజినెస్ ని మరింత పెంచు ఓ పెద్ద ప్రాజెక్ట్ మీ తలుపు తట్టే ఛాన్స్ ఉంది.
సింహం
ఇవాళ మీరు ఏ పని చేసినా అది సక్సెస్ అవుతుంది. మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది, మీ మనస్సు ఆనందంతో నిండిపోతుంది. ఈ రోజు మీరు ఒక మంచి మిత్రుడిని కలుసుకునే అవకాశం ఉంది. ఈ కలయిక మీ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఒకరికొకరు సహాయం చేసుకునేందుకు ఇది మంచి సమయం. మీ వైవాహిక జీవితంలో ప్రేమ వెల్లివిరుస్తుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు ఈ రోజు చాలా ముఖ్యమైనది. మీరు చదువుపై మరింత శ్రద్ధ చూపగలుగుతారు. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి మే 11 ఒక ప్రత్యేకమైన శక్తినిస్తుంది. ఒక కొత్త అధ్యాయానికి తెరతీయడానికి ఇది సరైన సమయం. మీరు ఒక కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలనుకుంటే ఈ రోజు మీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. మీ ప్రయత్నాలు విజయవంతంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ రోజు ఒక గొప్ప శుభవార్త అందుతుంది. మీ నిరీక్షణ ఫలించి, మీకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొందరికి విదేశాలకు వెళ్లే అద్భుతమైన అవకాశం కూడా రావచ్చు. గతంలో మీరు తీసుకున్న ఒక తెలివైన నిర్ణయం ఈ రోజు మీకు అనుకూలంగా మారవచ్చు. దాని ద్వారా మీరు ఊహించని లాభాలను పొందవచ్చు.
ధనస్సు
ధనుస్సు రాశి వారిలో ఆత్మవిశ్వాసం అనూహ్యంగా పెరుగుతుంది. ఏ పని చేపట్టినా మీలో ఉన్న నమ్మకమే మిమ్మల్ని విజయతీరాలకు చేరుస్తుంది. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు చాలా అనుకూలమైన సమయం. మీరు చేసే ప్రతి ప్రయత్నం మంచి ఫలితాలను ఇస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారస్తులు పెద్ద ఒప్పందం కుదుర్చుకునే లేదా ఒక కొత్త భాగస్వామ్యం ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఇది మీ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తుంది. మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది. మీరు మీ ప్రియమైన వ్యక్తి నుండి ఒక అందమైన సర్ ప్రైజ్ లేదా ఒక ప్రత్యేకమైన బహుమతిని అందుకునే అవకాశం ఉంది. ఈ రోజు మీ హృదయాన్ని ఆనందంతో నింపుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











