Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
సింహ రాశిలో కుజ-చంద్ర సంయోగం..ఈ 3 రాశులకు అదృష్టాన్ని మోసుకొస్తున్న మహాలక్ష్మి యోగం!
జోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం మన జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. కొన్నిసార్లు గ్రహాల కలయిక సవాళ్లను సృష్టిస్తే..మరికొన్నిసార్లు అద్భుతమైన యోగాలను ఏర్పరచి అదృష్టాన్ని ఇస్తుంది.. అలాంటి ఒక అరుదైన,అత్యంత శుభప్రదమైన యోగమే మహాలక్ష్మి యోగం. ఈ నెల చివరిలో ఈ శక్తివంతమైన యోగం ఏర్పడబోతోంది. ఇది కేవలం 54 గంటల పాటు ఉంటుంది..అయితే కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన లాభాన్ని, కీర్తి ప్రతిష్టలను, సుఖ సంతోషాలను తీసుకురాబోతోంది. ఆ లక్ష్మీ కటాక్షం ఎవరిపై ఉంటుందో ఇక్కడ చూడండి.
మహాలక్ష్మి యోగం అంటే ఏంటి? ఇది ఎలా ఏర్పడుతుంది?
ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. చంద్రుడుని మనస్సుకు, భావోద్వేగాలకు కారకుడుగా పరిగణించబడుతుండగా..కుజుడు ధైర్యానికి, శక్తికి, పరాక్రమానికి ప్రతీక. ఈ రెండు గ్రహాల కలయిక ఒక వ్యక్తిలో మానసిక బలాన్ని, కార్యాచరణ శక్తిని ఏకం చేస్తుంది. వేగంగా కదిలే చంద్రుడు జూన్ 29,2025 ఉదయం 6:33 గంటలకు సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. అప్పటికే ఆ రాశిలో శక్తివంతంగా సంచరిస్తున్న కుజుడితో చంద్రుడు కలుస్తాడు. ఈ చంద్ర-కుజ సంయోగమే మహాలక్ష్మి యోగంగా పిలువబడుతుంది. ఈ యోగం జూలై 1వ తేదీ వరకు అంటే దాదాపు 54 గంటల పాటు కొనసాగుతుంది. అయితే ఇదే సమయంలో సింహరాశిలో ఛాయా గ్రహమైన కేతువు కూడా ఉండటం వల్ల కొన్ని రాశుల వారికి పూర్తి ఫలితాలు అందకపోవచ్చు. అయితే 3 రాశులకు మాత్రం ఈ యోగం అద్భుతమైన ఫలితాలను అందించనుంది.

మహాలక్ష్మి యోగం వల్ల ప్రయోజనం పొందే రాశులు
తుల రాశి
తుల రాశి వారికి ఇది ఒక స్వర్ణయుగం లాంటిది. ఈ మహాలక్ష్మి యోగం మీ రాశికి అత్యంత శుభప్రదమైన లాభ స్థానంలో అంటే 11వ ఇంట్లో ఏర్పడుతోంది. ఇది మీ కోరికలు నెరవేరే సమయంగా చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. ఆర్థికంగా ఊహించని మార్పులు ఈ సమయంలో చోటుచేసుకుంటాయి. నిలిచిపోయిన డబ్బు చేతికి అందడం, కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడం, అప్పుల బాధ నుంచి విముక్తి లభించడం వంటివి జరుగుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు సరైన గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. మీ వ్యూహాలతో పోటీదారులను అధిగమించి విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గి, ప్రశాంతత చేకూరుతుంది. కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ యోగం పరాక్రమ స్థానమైన మూడవ ఇంట్లో ఏర్పడుతోంది. ఇది మీకు నూతన ఉత్సాహాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. మీ మాటతీరుతో, చేతలతో అందరినీ ఆకట్టుకుంటారు. చాలాకాలంగా వేధిస్తున్న మానసిక ఆందోళనలు తొలగిపోతాయి. మీ పనుల్లో అద్భుతమైన ప్రగతి కనిపిస్తుంది. వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని లాభాలు గడిస్తారు. మీ కృషికి తగిన ఫలితం దక్కుతుంది. తోబుట్టువులతో మీ సంబంధాలు మరింత బలపడతాయి. వారి నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. కుటుంబం లేదా స్నేహితులతో కలిసి ఒక చిన్న ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఇది మీకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది.
మీన రాశి
మీన రాశి వారికి ఈ యోగం ఆరవ ఇంట్లో ఏర్పడుతోంది. ఈ స్థానంలో శుభ యోగం ఏర్పడటం వల్ల మీరు సవాళ్లను అధిగమించి విజేతలుగా నిలుస్తారు. వృత్తి, వ్యాపారాలలో మీకు ఎదురవుతున్న పోటీని, అడ్డంకులను సులభంగా జయిస్తారు. మీ ప్రత్యర్థులు మీ ముందు నిలవలేరు. కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న అప్పుల సమస్యలు తొలగిపోతాయి. ఊహించని విధంగా డబ్బు చేతికి అంది ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ కృషికి తగిన గుర్తింపు లభించడంతో జీవితంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications