Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
makar sankranti 2025: సంక్రాంతి రోజు మీ రాశి ప్రకారం ఇలా చేస్తే..ఏడాది పొడవునా శుభ ఫలితాలు,ఆర్థిక కష్టాలుండవ్
ఈ సంవత్సరం మకర సంక్రాంతి పండుగను జనవరి 14న జరుపుకుంటారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా మకర సంక్రాంతి పండగ వాతావరణం నెలకొంది. పొరుగు రాష్ట్రాలు,నగరాలు,విదేశాల్లో ఉన్నవాళ్లందరూ మకరసంక్రాంతి పండుగ కోసం సొంతూర్లకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీ,తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మకర సంక్రాంతి పండుగను బాగా సెలబ్రేట్ చేస్తారు. మకర సంక్రాంతి అనేది మతపరమైన దృక్కోణం నుండి మాత్రమే కాకుండా జ్యోతిష్య శాస్త్రం పరంగా కూడా ముఖ్యమైనదే. జ్యోతిషశాస్త్రం ప్రకారం మకర సంక్రాంతి రోజున చేపట్టే కొన్ని చర్యలు జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సును కలిగిస్తాయి.
సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశించడం వల్ల జరుపుకునే ఈ పండుగ భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో విభిన్న సంప్రదాయాలతో ముడిపడి ఉంది. మకర సంక్రాంతి రోజు మీ రాశి ప్రకారం చర్యలు తీసుకుంటే వాటి ప్రయోజనాలు మరింత పెరుగుతాయి.

మకర సంక్రాంతి రోజున ఏ రాశి వారు ఏం చేయాలో చూడండి
మేషరాశి
మకర సంక్రాంతి రోజున మేష రాశి వ్యక్తులు నువ్వుల లడ్డూలు తిని పవిత్ర స్థలంలో దీపం వెలిగించాలి. అలాగే అవసరం ఉన్నవారికి నువ్వులను దానం చేయండి. ఇది జీవితంలో సానుకూల శక్తిని నింపుతుంది, శ్రేయస్సును పెంచుతుంది.
వృషభం
వృషభ రాశి వ్యక్తులు మకర సంక్రాంతి రోజున గోధుమలు లేదా బియ్యం వంటివి దానం చేయండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి.
మిధునం
మిధునరాశి వ్యక్తులు సంక్రాంతి రోజున ఆవుకు నువ్వులు, బెల్లం తినిపించండి. దీనివల్ల మీలో ఏడాది పొడవునా ఆత్మవిశ్వాసం, మనోధైర్యం పెరుగుతాయి.
కర్కాటకం
కర్కాటక రాశి వ్యక్తులు సంక్రాంతి నాడు స్నానం చేసే నీటిలో నువ్వులు వేసి, ఆపై శివుని పూజించండి. ఈ పరిహారం ఆరోగ్యం, ఆనందం, శాంతిని అందిస్తుంది.
సింహం
సింహ రాశి వ్యక్తులు సంక్రాంతి రోజు ఇనుప వస్తువులను దానం చేయండి. అలాగే కుటుంబ సభ్యులకు నువ్వుల ప్రసాదం పంపిణీ చేయండి. ఇది సంబంధాలలో మాధుర్యాన్ని, వ్యాపారంలో పురోగతిని తెస్తుంది.
కన్య రాశి
కన్య రాశి వ్యక్తులు సంక్రాతి రోజు నువ్వులు, బెల్లం కలిపి అరటి మొక్కకు పూజ చేయాలి. దీంతో ఇంట్లో సుఖశాంతులు, శాంతి, సౌభాగ్యాలు ఉంటాయి.
తుల రాశి
సంక్రాంతి రోజున తుల రాశి వ్యక్తులు పసుపు బట్టలు, తేనె దానం చేయండి. ఇది ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది, పనిలో విజయాన్ని తెస్తుంది.
వృశ్చికం
వృశ్చికరాశి వారు మకర సంక్రాంతి నాడు ఆవు దూడకు తాజా ఆకులు,మేత తినిపించండి. నువ్వులు, బెల్లం దానం చేయండి. ఈ పరిహారం మీ ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగిస్తుంది, ఆనందం, శాంతిని ఇస్తుంది.
ధనస్సు
ధనుస్సు రాశి వ్యక్తులు సంక్రాంతి రోజు వెండి లేదా కంచు పాత్రలను దానం చేయండి, సూర్య భగవానుని పూజించండి. దీనివల్ల పనిలో ఆటంకాలు తొలగిపోయి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
మకర రాశి
మకర సంక్రాంతి రోజున మకర రాశి వ్యక్తులు ఉపవాసం ఉండి తాజా పండ్లు, నువ్వులు, బెల్లం నిరుపేదలకు దానం చేయండి. ఈ పరిహారం అడ్డంకులను తొలగిస్తుంది, పుణ్య ప్రయోజనాలను ఇస్తుంది.
కుంభ రాశి
కుంభ రాశి వ్యక్తులు మకర సంక్రాంతి రోజున పసుపు రంగు దుస్తులు ధరించి సూర్యుని పూజించండి. నువ్వులను దానం చేయండి. ఇది ప్రతి పనిలో విజయం సాధిస్తుంది.
మీనం
మీన రాశి వాళ్లు సంక్రాంతి రోజున పేదలకు తినిపించండి. నువ్వులతో చేసిన మిఠాయిలను దానం చేయండి. మాంసాహారానికి దూరంగా ఉండండి. ఇది జీవితంలో సానుకూల మార్పులను తెస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications