Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
100 ఏళ్ల తర్వాత అరుదైన రాజయోగం..ఈ 3 రాశుల వారికి అసలైన సంక్రాంతి!
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, నిర్దిష్ట సమయాల్లో గ్రహాల కలయిక వల్ల ఏర్పడే యోగాలు మనిషి తలరాతనే మార్చేస్తాయి. కేవలం సాధారణ రోజుల్లోనే కాకుండా, పర్వదినాల్లో గ్రహాల కదలికలు మారితే ఆ ప్రభావం మరింత శక్తివంతంగా ఉంటుంది. ముఖ్యంగా గ్రహాల రారాజు అయిన సూర్యుడి గమనంలో మార్పు వస్తే అది ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారడాన్ని సంక్రమణం అంటాం. 2026 జనవరిలో ఒక అద్భుతమైన ఖగోళ ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. 2026 జనవరి 14న మధ్యాహ్నం 2:50 గంటలకు సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ పవిత్రమైన రోజునే మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటాం. అయితే ఈసారి సంక్రాంతి మరింత ప్రత్యేకం కానుంది.

సూర్యుడు మకరంలోకి వెళ్లే క్రమంలో ధనుస్సు రాశిలో బుధుడితో కలవడం వల్ల అత్యంత శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దాదాపు 100 సంవత్సరాల తర్వాత సంక్రాంతి పర్వదినం నాడు ఇలాంటి అరుదైన యోగం ఏర్పడుతోందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ఈ అరుదైన యోగం కారణంగా మూడు రాశుల వారి జీవితాలు ఊహించని విధంగా మలుపు తిరగనున్నాయి. ఆ అదృష్ట రాశులు ఏవో, వారికి ఎలాంటి లాభాలు కలగనున్నాయో ఇక్కడ చూడండి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ బుధాదిత్య రాజయోగం 11వ ఇంట్లో (లాభ స్థానం) ఏర్పడుతోంది. దీని ప్రభావంతో మీ చిరకాల కోరికలు నెరవేరుతాయి. ఆర్థికంగా మీరు ఊహించని స్థాయికి ఎదుగుతారు. స్టాక్ మార్కెట్, ఇతర పెట్టుబడుల ద్వారా భారీ లాభాలు గడిస్తారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇన్నాళ్లు ఆగిపోయిన పనులన్నీ చకచకా పూర్తవుతాయి. మిత్రుల సహకారం లభిస్తుంది, ముఖ్యంగా ఒక దగ్గరి స్నేహితుడి నుండి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
మేష రాశి
మేష రాశి జాతకులకు 9వ ఇల్లు అయిన భాగ్య స్థానంలో ఈ రాజయోగం ఏర్పడుతోంది. ఇది వీరికి అన్ని విధాలా కలిసివచ్చే కాలం. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పెళ్లికాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఃవ్యాపారస్తులకు ఇది స్వర్ణయుగం లాంటిది. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటమే కాకుండా, ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. ప్రతి ప్రయత్నంలోనూ విజయం మీ సొంతమవుతుంది.
కన్య రాశి
కన్య రాశి వారికి 4వ ఇంట్లో (సుఖ స్థానం) సూర్య-బుధుల కలయిక జరుగుతోంది. దీనివల్ల మీకు భౌతిక సుఖాలు పెరుగుతాయి. సొంత ఇల్లు లేదా కొత్త వాహనం కొనుగోలు చేసే యోగం ఉంది. మీరు చేసే పొదుపులు,పెట్టుబడులు భవిష్యత్తులో పెద్ద మొత్తంలో లాభాలను ఇస్తాయి.
దాంపత్య జీవితం అన్యోన్యంగా, మధురంగా సాగుతుంది. ఆధ్యాత్మిక యాత్రలు లేదా విహారయాత్రలకు వెళ్లే మీ కోరికలు నెరవేరుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications