Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
భారీగా డబ్బులు రావాలంటే ఇంట్లో ఈ చిన్న మార్పులు చేయండి.. లక్ష్మీదేవి తాండవం చేస్తుందట!
మనిషి జీవితంలో జ్యోతిష్య శాస్త్రం, వాస్తుశాస్త్రం అనేవి చాలా ముఖ్యమైనవి. ఇవి రెండూ మానవ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. మన జీవితంలో చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న మార్పులు చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ఈ చిన్న చిన్న మార్పులు మానవ జీవితంలో సానుకూలమైన మార్పులు వస్తాయి. ఇంట్లో చిన్న వస్తువులను తగిన దిశలో ఉంచడం వల్ల మంచి సానుకూలమైన శక్తిని ఇంట్లోకి ఆహ్వానించవచ్చు. అయితే ఏ దిశలో ఏ విధంగా వస్తువులను ఉంచితే మంచి ఫలితాలు వస్తాయి? ఏ దిశలో ఉంచి మంచిదని నిపుణులు చెబుతున్నారు? అసలు నిపుణుల అభిప్రాయం ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇంట్లో శాంతి కోసం, బెడ్ దిశను మార్చడం
ఇంట్లో తరచూ వాదనలు, అసహనం, ఉద్వేగాలు కనిపిస్తుంటే, ముందుగా బెడ్ ఉంచిన దిశను పరిశీలించాలి. వాస్తు ప్రమాణాల ప్రకారం మంచం దక్షిణ భాగంలో ఉంచడం మంచిది. అలాగే నిద్రపోతున్నపుడు తల దక్షిణ దిశలో ఉండటం శుభకరం. ఇది మెదడుకు విశ్రాంతిని కలిగిస్తూ, మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. దీనివల్ల ఆరోగ్య పరంగా మరియు మానసికంగా ఉపశమనం లభించుతుంది. అలాగే ఇంట్లో శాంతి కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఆర్థిక శ్రేయస్సు కోసం
కొంత మందికి ఎంత సంపాదించినా డబ్బు ఇంట్లో నిలవదు. వచ్చిన డబ్బు వచ్చినట్లు వెళ్ళిపోతుంది. అలాగే నెల చివరికి చేతుల్లో చిల్లి గవ్వ కూడా ఉండకుండా అయిపోతుంటాము. ఇలాంటి సందర్భాల్లో మనం ఇంట్లో చీపురును ఏ దిశలో ఉంచుతున్నామో గమనించాలని నిపుణులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం చీపురును దక్షిణ దిశలో ఉంచుకోవాలట. దక్షిణ దిశలో చీపురును ఉంచడం వలన ఇంట్లో నష్టాలను తగ్గిస్తుందట. అలాగే ఇంట్లో సంపద నిలిచేలా చేస్తుంది. అలాగే ఇంట్లో ఉండే బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను కూడా దక్షిణ దిశలోనే భద్రపరచాలి వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని, అలాగే మన ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది చెబుతున్నారు.
చెత్తబుట్ట స్థానం కూడా ప్రభావితం చేస్తుంది
ఇంట్లో చెత్తబుట్టను ఎక్కడ ఉంచుతాం అన్నది కూడా శుభాశుభాలను ప్రభావితం చేస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఉత్తర దిశలో చెత్త నిల్వ ఉండటం వలన ఇంట్లో సానుకూల శక్తి తగ్గిపోవచ్చు. ఈ దోషాన్ని నివారించాలంటే చెత్తబుట్టను నైరుతి దిశలో ఉంచాలి. ఇది వ్యయాలను తగ్గించి, ఆర్థిక భద్రతను మెరుగుపరచగలదు. అదే సమయంలో ఇంట్లో శుభ్రతను కాపాడటమూ అవసరం. శుభ్రత ఉంటేనే ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని, లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉంటుందని చెబుతున్నారు.
వాస్తు సూచనల ప్రకారం ఇంట్లో వస్తువుల నిర్వహణ వల్ల:
మానసిక ప్రశాంతత పెరుగుతుంది
కుటుంబసభ్యుల మధ్య పరస్పర సౌహార్ధం మెరుగవుతుంది
ఆర్థికంగా స్థిరత నెలకొంటుంది
సానుకూల శక్తి నివాసం చేస్తుంది
వాస్తు అనేది కేవలం అనుబంధ విశ్వాసం కాదు. ఇది ప్రకృతి శక్తుల సమతుల్యతను సూచించే శాస్త్రం. సరైన దిశల్లో వస్తువులను ఉంచటం ద్వారా ఆ శక్తుల సహకారం అందుకోవచ్చు. ఈ టిప్స్ మీరూ ఓసారి ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో సానుకూల శక్తిని మీరు ఆస్వాదించవచ్చు. అలాగే మార్పులను కూడా మీరు చూడవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications