Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
కన్యారాశిలోకి కుజ సంచారం.. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే.. సమస్యలు తప్పవు!
వేదజ్యోతిష శాస్త్రం ప్రకారం కుజుడు ధైర్యానికి, పరాక్రమానికి, కోపానికి కారకుడిగా పరిగణిస్తారు. అలాగే ఇతర గ్రహాలను పాలించేదిగా భావిస్తారు. కుజుడు కన్యారాశిలోకి ప్రవేశించడం వల్ల కలిగే ప్రభావం ద్వాదశ రాశుల వారిపై కచ్చితంగా ఉంటుంది. ఈ మంగళ్ గోచార్ వల్ల కొన్ని రాశుల వారు లాభపడితే.. కొన్ని రాశుల వారు మాత్రం ప్రతికూలతను ఎదుర్కొంటారు. సమస్యలు, కష్టాలు చుట్టుముడతాయి.
కుజుడు కన్యారాశిలోకి సంచరించడం వల్ల ఏయే రాశుల వారికి ప్రతికూలంగా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభం
కన్యారాశిలోకి కుజుడి సంచారం వల్ల వృషభ రాశి వారు ప్రతికూలతలను ఎదుర్కొంటారు. సృజనాత్మక రంగంలో ఉన్న వారు అతివిశ్వాసం వల్ల ప్రతికూల ఫలితాలు అందుకుంటారు. శృంగారంలో ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల సుఖం పొందలేరు. సహోద్యోగుల నుంచి ఉన్నతోద్యోగుల నుంచి విమర్శలు ఎదురవుతాయి. దీని వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది. కాబట్టి పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే విమర్శలను సానుకూలంగా స్వీకరించడం అలవర్చుకోవాలి.
మిథునరాశి
కన్యారాశిలో కుజుడు సంచారం వల్ల మిథునరాశి వారు కొన్ని కష్టాలను, సమస్యలను ఎదుర్కోనున్నారు. కుజుడి సంచారం మిథునరాశి వారి మానసిక శ్రేయస్సును ప్రభావితం చేయనుంది. ఇంట్లోని కుటుంబసభ్యుల మధ్య సాన్నిహిత్యం దెబ్బతింటుంది. కలహాలు జరగవచ్చు. ఇది ఒత్తిడిని కలిగిస్తుంది. రవాణా సమయంలో మిథునరాశి వారు సమస్యలు ఎదుర్కొంటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా పదాలను ఎంపిక చేసుకోవాలి.
కర్కాటకరాశి
కన్యారాశిలోకి కుజు సంచారం వల్ల కర్కాటక రాశి వారి వ్యతిరేక ప్రభావం పొందనున్నారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు వాడే భాష వల్ల సమస్యలు రావొచ్చు. సహోద్యోగులు, ఉన్నత ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా, ఆచితూచి మాట్లాడాలి. కొన్ని మాటల వల్ల అపార్థాలు రావచ్చు. హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవద్దు.
సింహరాశి
సింహ రాశి వారి ఆర్థిక అంశంపై కుజ సంచారం ప్రభావం చూపించనుంది. ఆర్థిక నిర్ణయాలు నష్ట ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువ. పెట్టుబడి, వ్యాపార లావాదేవీలు నిర్వహించే సమయంలో అత్యంచ జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు, హఠాత్తు ఖర్చులు పెరుగుతాయి. దీని వల్ల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.
మీనరాశి
కన్యారాశిలోకి కుజుడి సంచారం వల్ల మీనరాశి వారు సమస్యలు ఎదుర్కొంటారు. శృంగార సంబంధిత సమస్యలు వస్తాయి. కుటుం సభ్యుల మధ్య కలహాలు రావొచ్చు. జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం దెబ్బతింటుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications