Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
2024లో ఈ రాశుల వారికి ఇదే చివరి అవకాశం.. డబ్బుల వర్షం కురిపిసిస్తున్న కుజ, చంద్రుల కలయిక!
సాధారణంగా రాశి చక్రంలో ఏర్పడే గ్రహాల గమనాల్లో మార్పులు, గ్రహాల రాశి మార్పులు మొత్తం రాశుల ఫలితాలను మార్చేస్తాయి. కొన్ని కొన్ని సార్లు రాశి చక్రంలోని 12 రాశుల వారిని ఈ గ్రహాల రాశి మార్పు ప్రభావితం చేస్తాయి. అయితే ఈ ఏడాది మేష రాశిలో ఉన్న కుజుడుతో కర్కాటక రాశిలో చంద్రుడు కలవబోతున్నారు. వీరి కలయిక ఈ ఏడాది ఇదే చివరిది కావడం విశేషం. వీరి కలయిక గ్రహ చక్రమంలో అనేక సానుకూల మార్పులను తీసుకురాబోతుంది.
మరీ ముఖ్యంగా అయిదు రాశుల వారికి వీరు అనుగ్రహం కలగనుంది. చంద్రుడు, కుజుడు కారణంగా ఈ రాశుల వారి జీవితం సుఖమయం కానుంది. అలాగే కుటుంబ కలహాలు దూరమై ఆరోగ్యవంతమైన, సంతోషమైన జీవితాన్ని గడుపుతారు. ఇంతకీ ఆ అయిదు రాశులు ఏంటి? ఏ రాశుల వారిపై వీరి కటాక్షం ఉండబోతుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మేష రాశి
ఈ గ్రహాల కలయికతో మేషరాశి వారికి శుభం కలుగుతుంది. కెరీర్‌లో ఆకస్మిక పురోగతి కనిపిస్తుంది. ఉన్నట్టుండి ఉన్న స్థానానికి వెళ్లే సూచనలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో తమ ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి ప్రశంసలు పొందుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆదాయం భారీగా పెరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మేషరాశి వారు తమ జీవితాన్ని మార్చుకోవడానికి ఇది అనువైన సమయం ఇది.
మిథున రాశి
ఈ రెండు గ్రహాల కలయిక వల్ల మిథున రాశికి చెందిన జాతకులు అపారమైన ప్రయోజనాలను పొందుతారు. పని ప్రదేశంలో ప్రతి ఒక్క విషయం వీరికి అనుకూలంగా జరుగుతుంది. చాలా కాలంగా ఉద్యోగం కోసం వెతుకుతున్న వ్యక్తులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారుల ఆదాయం రెట్టింపు అవుతుంది. అనారోగ్య సమస్యల నుంచి బాధ పడుతున్న వ్యక్తులు చాలా వరకు ఉపశమనం పొందుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వ్యక్తుల కోరికలు ఫలిస్తాయి.
సింహ రాశి
ఈ రెండు గ్రహాల కలయిక వలన సింహ రాశికి చెందిన జాతకులు అనేక ప్రయోజనాలను పొందుతారు. ఈ రాశి వారు తరచూ ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పటికీ ఆ ప్రయాణాలు వీరికి అనుకూలంగా మారనున్నాయి. ఆ ప్రయాణాలు వీరికి బాగా లాభాలు తీసుకొచ్చే అవకాశం ఉంది. వీరి చిరకాల కోరికలు నెరవేరుతాయి. అన్ని పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. అదనపు ఆదాయం పొందడం వలన ఆర్ధిక అనిశ్చితి తొలిగిపోతుంది.
కుంభ రాశి
చంద్రుడు మరియు కుజుడు కలయిక కుంభ రాశి వారికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ రెండు గ్రహాల కలయిక వలన ఈ రాశి చెందిన వ్యాపారులకు ఆకస్మిక లాభాలు వస్తాయి. ఇది వీరిని ఆశ్చర్యంలో ముంచేస్తుంది. పని పరంగా అంతా సవ్యంగా సాగడం వల్ల ఆఫీసులో టెన్షన్ వాతావరణం ఉండదు. ఎన్నో విజయాలు వారి జీవితంలో ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు చదువులో గొప్ప విజయాలు సాధిస్తారు. ఈ రాశికి చెందిన వారి ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
మీన రాశి
కుజుడు-చంద్రుడు కలయిక వలన మీన రాశి వారికి అదృష్టం తలుపులు తట్టనుంది. ప్రభుత్వం ఇచ్చే కొన్ని ప్రయోజనాలు వారి జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయి. ఆఫీసు పనులన్నీ సక్రమంగా, సులభంగా పూర్తవుతాయి. ఈ రాశికి చెందిన వారి తెలివితేటలు, ప్రతిభ వారి జీవితాల్లో వెలుగులు నింపుతాయి. కార్యాలయంలో మార్పులు వారి మనసులో ఉత్సాహాన్ని కలిగిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications