మరో పది రోజుల్లో మంగళ గోచారం.. వీరికి దీనికి మించిన మంచి సమయం ఉండదు.!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కలయిక, సంచారం ఇలా కొన్ని ఖగోళ మార్పులు మన జీవితాల్లో సానుకూల, ప్రతికూల మార్పులు తీసుకువస్తాయి. కొన్ని రాశుల వారి అదృష్టం తలుపుతడితే మరికొన్ని రాశుల వారికి గడ్డుకాలం కావచ్చు. అంతగా గ్రహాల ప్రభావం ఉంటుంది. కాగా ప్రస్తుతం మిథున రాశిలో ఉన్న కుజుడు త్వరలో తన కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇది కొందరికి సవాల్‌ కాగా, మరికొందరికి మంచి సమయం. కర్కాటక రాశిలోకి ఆగమనం చేసే లోపల ఈ రాశి చక్రం ఉన్నవారికి ప్రత్యేక సమయం కానుంది.

Mars transit these zodiac signs will have a wonderful time until September 18

సెప్టెంబర్‌ 18 కుజుడు మిథునం వదిలి తన అత్యల్ప రాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు నుంచి సెప్టెంబర్‌ 17 వరకు కొన్ని రాశుల వారికి అత్యంత శుభప్రదంగా, అద్భుతంగా ఉండనుంది. మరి ఆ రాశులేంటో చూద్దాం..

మిథునం

ప్రస్తుతం మిథునంలోనే కుజుడు ఉండటంతో ఈ రాశి వారికి ఇది చాలా మంచి సమయం. ఇప్పటివరకూ పూర్తి కాకుండా ఉన్న పనులు పూర్తయిపోయి కాస్త రిలీఫ్‌ పొందుతారు. దాంతోపాటు మీకు ఉన్న అదృష్టం.. విజయం మీకు సులభంగా దక్కేలా చేస్తుంది. కుటుంబీకులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఆశించిన లాభాలు పొందుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. ఆర్థికంగా ఆదాయం బాగుంటుంది. మీరు వృత్తిలో ఉన్నతి చెందడానికి అవకాశాలు అందుకుంటారు. ఫ్రెండ్స్‌తో కలిసి టూర్‌ వెళ్లే అవకాశం ఉంది.

Mars transit these zodiac signs will have a wonderful time until September 18

కన్యా రాశి

కన్యారాశి వారికి సెప్టెంబర్‌ 17 వరకు తమ జీవితంలో ఎన్నో పాజిటివ్‌ అంశాలను అనుభవిస్తారు. వ్యాపారవేత్తలకు ఒక మంచి ఒప్పందం కుదరవచ్చు. ఇది భవిష్యత్తు ప్రయోజనాలను అందిస్తుంది. వ్యాపారం వృద్ధి చెందే అవకాశం ఉండటంతో గతంలో కంటే ఆర్థికంగా లాభదాయకంగా ఉంటారు. ప్రణాళిక, వ్యూహంతో తీసుకున్న నిర్ణయం మీకు కలిసి వస్తుంది. మీ స్కిల్స్‌ను పెంచుకుని మరింత అనుభవజ్ఞులుగా మారతారు. ఉద్యోగులు కొత్త అవకాశాలు అందుకుంటారు. కష్టానికి తగిన గుర్తింపు అందుకుంటారు.

ధనుస్సు రాశి

మిథున రాశిలో కుజ గ్రహ సంచారం విజయం, పురోగతిని అందించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. కుటుంబీకులతో సరదా, సంతోషకరమైన సమయం గడుపుతారు. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో మీరు తీసుకుంటున్న ఒక ప్రాజెక్టు మీకు ఎనలేని ప్రయోజనాలను అందిస్తుంది. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి ప్రతిపాదన రావచ్చు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ప్రమోషన్‌ పొందే అవకాశం ఉంది. ఈ పది రోజు అదృష్టం మీ ఇంటి ముంగిట్లోనే ఉండనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Wednesday, September 9, 2026, 6:17 [IST]
Desktop Bottom Promotion