Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
ఈ ఏడుగురు అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే జీవితం సర్వ నాశనమే!..చాణక్యుడు ఏం చెప్పాడంటే..
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు మాత్రమే కాదు దౌత్యవేత్త, వ్యూహకర్త, ఆర్థికవేత్త కూడా. చాణక్యుడు తన జీవితంలో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు కానీ ఎన్నడూ భయపడలేదు,తన లక్ష్యాన్ని మరువలేదు. అపర మేధావిగా పేరు పొందిన చాణక్యుడు తన నీతిశాస్త్రంలో అనేక విషయాలను వివరించాడు. మానవ సంక్షేమానికి సంబంధించిన దాదాపు అన్ని విషయాలపై తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ప్రేమ,పెళ్లికి సంబంధించిన విషయాలకు సంబంధించి కూడా చాణక్యుడు తన అభిప్రాయాలను తెలిపాడు.
ఆచార్య చాణక్యుడు చెప్పిన మాటలను అనుసరించే ఎవరైనా జీవితంలో ఎప్పుడూ తప్పు చేయరు,విజయవంతమైన స్థితికి చేరుకోగలరు. అయితే జీవితాన్ని నాశనం చేసుకోకూడదంటే మగాళ్లు ఏడు రకాల ఆడవాళ్లను పెళ్లి చేసుకోకూడదని చాణక్యుుడు తెలిపారు. చాణక్యుడు చెప్పిన ఏడు రకాల అమ్మాయిలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

అందం ఉండి,తెలివి లేని
మగాళ్లు సాధారణంగా తెలివైన అమ్మాయిలకన్నా అందంగా ఉండే అమ్మాయిలనే ఎక్కువగా కోరుకుంటారు. అయితే అందంగా ఉండి కామన్ సెన్స్ లేని అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే జీవితం నాశనమే అని చాణక్యుడు తెలిపారు.
అహంకారం,సభ్యత లేని
రూడ్ గా లేదా సభ్యతలేని అమ్మాయిలను పెళ్లి చేసుకోనక్కర్లేదు. బయటకి ఎంత అందంగా కనబడినా అలాంటి అమ్మాయిని ఏ మాత్రం పెళ్లి చేసుకోవద్దని చాణక్యుడు చెప్పాడు. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం తన భర్తని తిడుతూనే ఉంటుంది.
అబద్దాలు
ప్రతిసారీ అబద్దాలు చెప్పే అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే కుటుంబం నాశనమే. ఎందుకంటే ఆమె తన భర్తకు కూడా అబద్దాలు చెప్తుంది..ఫలితంగా ఏదో ఒకరోజు పెద్ద గొడవ జరిగి ఆ కుటంబం మొత్తం నాశనం అవుతుంది. కాబట్టి అబద్దాలు చెప్పే అమ్మాయిలను పెళ్లి చేసుకోకపోవడం మంచిదని చాణక్యుడు చెప్పారు.
ఇంటి పనులు చేయని
చాణక్యుడు ప్రకారం ఇంటికి సంబంధించిన పనులు చేయడం చేతకాని మహిళలు పెళ్లికి అనర్హులు ప్రావీణ్యం లేని స్త్రీ వివాహానికి అనర్హురాలు. ఈ ఆధునిక ప్రపంచంలో ఇది వివాదాస్పదమైన ఇష్యూ అయినప్పటికీ కొంతమంది ఇప్పటికీ దీన్ని నమ్ముతారు.
బ్యాడ్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్
ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకునే ముందు ఆమె గతం తెలుసుకోవాలి. ఒక అమ్మాయి తన కుటుంబానికి పనికిరాని చరిత్ర ఉన్నట్లయితే, ఆమె పెళ్లి తర్వాత మీ కుటుంబాన్ని కూడా చీల్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
చెడు స్వభావం
ఒక చెడ్డ స్త్రీ క్యారెక్టర్ ఎలాంటిదంటే ఏదో ఒక రోజు తన భర్తతో తన సంబంధాన్ని ఈజీగా తెంచుకోగలదు. కాబట్టి పురుషుడు అలాంటి స్త్రీని వివాహం చేసుకోకూడదు.
గమనిక: ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. బోల్డ్ స్కై తెలుగు దీనిని ధృవీకరించలేదు. దీనిని పాటించడం అనేది వ్యక్తిగత ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
