Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
తులారాశిలోకి ప్రవేశించబోతున్న బుధుడు.. ఆ రాశులవారికి ఇకపై అదృష్టమే అదృష్టం!
గ్రహబలం బాగుంటే అన్ని మంచిరోజులే ఉంటాయి అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. గ్రహాల స్థితిని బట్టి మన పరిస్థితులుంటాయని నమ్ముతుంటారు. ఆ విధంగానే ఈనెల 11వ తేదీన బుధుడు తులారాశిలోకి ప్రవేశించబోతున్నాడు. తద్వారా కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టనుంది. వద్దన్నా ఆ రాశుల వారికి ఆర్ధిక బలం, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు.. ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లభించే అవకాశముంది. అయితే బుధుడు అంతగా ప్రభావితం చేయనున్న ఆ రాశులు ఏంటి.. ఆయా రాశుల వారికి ఎలాంటి ఎలాంటి ప్రయోజనాలు చేకూరనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
బుధుడు ఈనెల 11వ తేదీన తులారాశిలోకి ప్రవేశించి ఈనెల 29వ తేదీ వరకు ఆ రాశిలోనే ఉండనున్నాడు. దీని కారణంగా చాలా మంచి ఫలితాలను కొన్ని రాశులను అందించనున్నాడు. వాటిలో మొదటిది..

మిథున రాశి: ఈ రాశికి.. ఆ రాశి అధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో ఉన్నాడు. ఇది విశేష రాజయోగాలను ఆ రాశివారికి సూచిస్తుంది. ఈనెల 11వ తేదీ నుంచి 15 రోజుల పాటు ఈ రాశివారికి ఆదాయపరంగా, ఉద్యోగపరంగా తిరుగుండదు. ఎప్పటినుంచో అలానే ఉండిపోయిన సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కూడా విశేషమైన లాభాలు పొందుతారు. రెండు చేతులా, నాలుగు దిక్కుల నుంచి ఆదాయం సమకూరుతుంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది.
కన్య రాశి: ఈ రాశికి అధిపతి అయిన బుధుడు.. తులా రాశిలోకి ప్రవేశించడం ద్వారా.. కన్య రాశివారికి అనేక విధాలుగా ఆదాయం సమకూరుతుంది. వద్దన్నా డబ్బులు వస్తూనే ఉంటాయి. ఉద్యోగులకు ఆశించిన దానికంటే ఎక్కువ మొత్తంలో వేతనాలు పెరిగే అవకాశముంది. లాభదాయక పరిచయాలు పెంచుకుంటారు. శుభకార్యాలు జరగనున్నాయి. ఆస్తి వ్యవహారాలూ పరిష్కారమవుతాయి. సమాజంలో ఈ రాశివారి మాటకు విలువ పెరుగుతుంది.
తులా రాశి: ఈ రాశిలో బుధుడు ప్రవేశించడం వల్ల.. ఈ రాశివారికి విదేశాల్లో ఉద్యోగాలు లభించే అవకాశముంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. పెళ్లికాని వారికి పెళ్లి జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఏ కార్యక్రమం తలపెట్టినా విజయవంతమై తీరుతుంది.
ధనుస్సు రాశి: ఈ రాశివారికి బుధుడు దశమాధిపతిగా సంచరిస్తున్నాడు. దీని కారణంగా ఈ రాశి వారికి ఉద్యోగంలో పురోగతి లభిస్తుంది. జీతాలు పెరగడం, పదోన్నతులు లభించడం వంటివి జరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశముంది. ధన ప్రాప్తికి మెండుగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉన్నతస్థాయి వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకొస్తాయి.
మకర రాశి: ఈ రాశివారికి కూడా దశమ స్థానంలో బుధుడు సంచరిస్తున్నాడు. దీనికారణంగా ఈ రాశి వారికీ ఉద్యోగంలో అనూహ్యమైన పురోగతి లభిస్తుంది. జీతాలు భారీగా పెరుగుతాయి. ప్రమోషన్స్ లభిస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు లభించే అవకాశముంది. సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యంగా వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు.
కుంభ రాశి: ఈ రాశి వారికి భాగ్య స్థానంలో బుధుడు సంచరిస్తున్నాడు. దీని కారణంగా ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలకు కూడా విదేశీ సంబంధాలు ఏర్పడతాయి. పెళ్లి సంబంధాలు ఖరారయ్యే అవకాశముంది. మనసులోని ఆశలు, కోరికలు నెరవేరతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications