Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
బుధుడి మహిమ..ఈ 3 రాశులు ఇకపై వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు,సిరి సంపదలు
జ్యోతిషశాస్త్రంలో బుధుడు తెలివితేటలకు, వాక్చాతుర్యానికి, వ్యాపార వ్యవహారాలకు, సంపదకు కూడా కారకుడిగా పరిగణించబడతాడు.గ్రహాల యువరాజుగా పేరుగాంచిన బుధుడు మే 23న మేష రాశి ప్రయాణాన్ని ముగించి సౌందర్యానికి, సుఖానికి అధిపతి అయిన శుక్రుని స్వక్షేత్రమైన వృషభ రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ బుధ సంచారం కొన్ని రాశుల వారికి నిజంగానే ఒక శుభ పరిణామం కానుంది. ముఖ్యంగా ఈ గ్రహ మార్పు 3 రాశుల వారికి ప్రతి పనిలో విజయాన్ని, ఊహించని ఆర్థిక లాభాలను తెచ్చిపెట్టడుతుంది.
అదృష్టం పొందే 3 రాశులు ఇవే
సింహ రాశి
వృషభ రాశిలోకి బుధుడి రాక సింహ రాశి వారికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. సింహ రాశి వ్యక్తుత కెరీర్ లో ఒక గొప్ప మలుపు తిరిగే అవకాశం ఉంది. మీ గౌరవం పెరుగుతుంది, సమాజంలో మీ స్థాయి మరింత ఉన్నతంగా మారుతుంది. మీరు ఎప్పటినుంచో కలలు కంటున్న కొన్ని ముఖ్యమైన కోరికలు నెరవేరే సమయం ఆసన్నమైంది. మీ వృత్తి జీవితంలో మీరు ఊహించని వేగంతో అభివృద్ధి చెందే అవకాశాలు మీ ముందు ఉంటాయి. ఉద్యోగం చేస్తున్న వారికి అయితే జీతం పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి, అంతేకాదు ఉన్నత పదవులు కూడా మిమ్మల్ని వరించవచ్చు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా మారుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

మిథున రాశి
బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశించడం మిథున రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. మీరు ఏ రంగంలో ప్రయత్నించినా విజయం సాధించే బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించడం ముఖ్యం. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కానీ ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలకు ఈ సమయం చాలా బాగుంటుంది. వ్యాపారంలో కూడా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ఈ సమయం ఒక గొప్ప అవకాశాల నిధిగా మారవచ్చు. మీ ప్రతిభను నిరూపించుకోవడానికి, ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి ఇది సరైన సమయం.
కుంభ రాశి
వృషభ రాశిలోకి బుధుడి సంచారం కుంభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. బఈ సమయంలో మీరు భౌతిక సుఖాలను అనుభవించే అవకాశం ఉంది. మీ ఇంటిని మరమ్మతులు చేయించుకోవచ్చు లేదా కొత్తగా అలంకరించుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంటి నుండి ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం మీకు విజయాన్ని అందిస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ఇది ఒక మంచి సమయం. మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ సహోద్యోగుల మద్దతు కూడా మీకు లభిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
