Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
కర్కాటక రాశిలో ఉదయించనున్న బుధుడు.. జులై 14 నుంచి ఈ 3 రాశుల వారికి అదృష్టం, డబ్బుల వర్షం
జ్యోతిషశాస్త్రం ప్రకారం బుధ గ్రహం వ్యాపారానికి, విద్యకు, తెలివితేటలకు అధిపతిగా పరిగణిస్తారు. బుధుడు నవగ్రహాల్లో ముఖ్యమైనది. జ్యోతిషం ప్రకారం ఒక గ్రహం అస్తమించినప్పుడు దాని ప్రభావం తగ్గుతుంది. దీని వల్ల కొన్ని రాశుల వారిపై ప్రతికూలతలు ఏర్పడుతుంది. అలాగే ఓ గ్రహం ఉదయిస్తే అది పలు గ్రహాలపై అనుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. జులై 14వ తేదీన కర్కాటక రాశిలో బుధుడు ఉదయించనున్నాడు. దీంతో బుధుడు తిరిగి తన బలాన్ని పొందుతాడు.

కర్కాటక రాశిలో బుధుడి ఉదయం వల్ల జులై 14వ తేదీ నుంచి కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసిరానుంది. అలాగే ఆయా రాశుల వారు తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి ధనలాభం చేకూరుతుంది.
మిథునరాశి:
మిథున రాశికి అధిపతి బుధుడు. బుధ గ్రహం మిథునరాశి వారి 2వ ఇంట్లో ఉదయిస్తాడు. అందువల్ల ఈ సమయంలో మిథున రాశి వారికి అద్భుతంగా ఉండనుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వాహనాలు, కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వ్యాపారులకు లాభం చేకూరుతుంది. వ్యాపార విస్తరణకు అవకాశం చాలా ఉండనుంది. జీవిత భాగస్వామితో సఖ్యత మెరగుపడుతుంది. దంపతుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. అవివాహితులకు ఈ సమయం కలిసి రానుంది. త్వరలోనే పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. ఆదాయం స్థిరంగా వస్తుంది. అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకోగలిగితే ఆర్థిక సమస్యలు దరిచేరవు.
తులారాశి:
బుధుడు తులారాశి వారి 10వ ఇంట్లో ఉదయించనున్నాడు. అలా తులారాశి వారికి బుధ గ్రహం ఉదయించడం వల్ల మంచి సమయం రానుంది. ఇది తులారాశి వారిని అదృష్టవంతులను చేస్తుంది. వ్యాపారులు తమ రంగాల్లో మంచి విజయం సాధిస్తారు. లాభాలు పొందుతారు. ఈ సమయంలో వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు తమ పనితీరు పట్ల ఉన్నతోద్యోగుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సహోద్యోగుల నుంచి సహకారం, మద్దతు పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కొత్త మార్గాల్లో డబ్బు అందుతుంది.
మీనరాశి:
మీనరాశి వారి 5వ ఇంట్లో బుధుడు ఉదయించనున్నాడు. ఈ సమయంలో మీనరాశి వారికి అనేక ప్రయోజనాలను అందించబోతోంది. చిన్నారులకు ఇది చాలా అనుకూల సమయం. వారి నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ జీవితం కూడా మెరుగ్గా ఉంటుంది. రాతపూర్వకంగా, ప్రసంగం చేసే రంగాల్లో ఉన్న వారికి ఈ సమయం అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఆదాయంలో పెరుగుదల వల్ల ఆర్థిక సమస్యలను తొలగిపోతాయి. ఓ చోట చిక్కుకున్న డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది. అప్పుల బాధలు తొలగిపోయిన మానసిక ప్రశాంతత లభిస్తుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications