Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
బుధుడి సొంత రాశి ప్రవేశం..భద్ర రాజయోగంతో ఈ 3 రాశులకు ఊహించని అదృష్టం!
ఖగోళంలో గ్రహాల సంచారం మన జీవితాలపై ఎంతో ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. నవగ్రహాలలో రాకుమారుడిగా, యువరాజుగా కీర్తించబడే బుధ గ్రహం తెలివితేటలకు, వాక్చాతుర్యానికి, విద్యాభ్యాసానికి, వ్యాపార దక్షతకు ప్రతీక. బుధుడు.. మిథున, కన్య రాశులకు అధిపతిగా వ్యవహరిస్తాడు. ప్రస్తుతం వృషభరాశిలో సంచరిస్తున్న బుధుడు..జూన్ 6న తన సొంత రాశి అయిన మిథునరాశిలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ గ్రహ మార్పు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.
బుధుడు మిథునంలో ప్రవేశించడం ద్వారా పంచ మహాపురుష రాజయోగాలలో ఒకటైన శక్తివంతమైన భద్ర రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం శుభ ప్రభావం దాదాపు అన్ని రాశుల వారిపైనా ఉంటుంది. అయితే కొన్ని రాశుల వారికి ఈ యోగం అదృష్టాన్ని రెట్టింపు చేసి వృత్తి, వ్యాపారాలలో అఖండమైన పురోగతిని అందించే సువర్ణావకాశాలను సృష్టిస్తుంది. బుధుడి అనుగ్రహంతో ఈ భద్ర రాజయోగం వల్ల ఏ రాశుల వారికి అదృష్టం తలుపు తట్టనుందో ఇక్కడ చూడండి.

మీన రాశి
బుధ గ్రహ సంచారం మీన రాశి వారికి 4వ గృహంలో జరుగుతుంది. ఈ స్థానంలో బుధుడు భద్ర రాజయోగాన్ని సృష్టించడం వల్ల ఈ రాశి వ్యక్తులకు గొప్ప భౌతిక సుఖాలు, సౌకర్యాలు చేకూరతాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న నూతన గృహ, వాహన యోగాలు సిద్ధిస్తాయి. దీర్ఘకాలంగా ఆగిపోయిన డబ్బు అనూహ్యంగా చేతికి అందుతుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగ, వ్యాపార రీత్యా విదేశీ పర్యటనలు చేసే అవకాశాలు కూడా రావచ్చు. ఆఫీసులో మీ ప్రతిభకు గుర్తింపు లభించి, ప్రమోషన్లు లేదా ఉన్నత పదవులు పొందే సూచనలున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు అద్భుతమైన పురోగతిని సాధిస్తారు, లాభాలు గడిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
కన్య రాశి
బుధుడు కన్యా రాశి వారికి 10వ స్థానమైన వృత్తి, కర్మ స్థానంలోకి ప్రవేశించి భద్ర రాజయోగాన్ని ఏర్పరుస్తాడు. ఇది కన్య రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో అద్భుతమైన పురోగతిని సూచిస్తుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభించి నూతన బాధ్యతలు, కీలక పదవులు అప్పగించబడవచ్చు. సమాజంలో మీ గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. కార్యాలయంలో మీరు చేపట్టిన పనుల్లో అఖండ విజయం సాధిస్తారు, ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. వ్యాపారస్తులకు ఆర్థికంగా మహర్దశ పట్టనుంది. లాభాలు రెట్టింపు అవుతాయి, వ్యాపార విస్తరణకు ఇది అనుకూలమైన సమయం. నూతన పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం. మీ నాయకత్వ లక్షణాలు ప్రకాశిస్తాయి.
సింహ రాశి
సింహ రాశి వారికి బుధుడు 11వ స్థానమైన లాభ స్థానంలోకి ప్రవేశించి భద్ర రాజయోగాన్ని సృష్టిస్తాడు. దీని ఫలితంగా మీ ఆదాయంలో గణనీయమైన వృద్ధి, ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఊహించని రీతిలో నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి, ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది. ఉన్నత విద్యనభ్యసించాలనుకునే విద్యార్థుల చిరకాల కోరికలు నెరవేరతాయి, విదేశీ విద్యాయోగం కూడా ఉండవచ్చు . ఈ సమయంలో మీకు కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి నుండి సంపూర్ణ సహకారం లభిస్తుంది, వారి సపోర్ట్ మీ విజయానికి మరింత దోహదపడుతుంది. షేర్ మార్కెట్, లాటరీలు వంటి ఊహాజనిత వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఇది కొంతవరకు అనుకూలమైన సమయం, మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











