Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ఈ నెల ఆఖరున వృషభ రాశిలో బుధుడు సంచారం ఈ 5 రాశుల వారి ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలం
Mercury Transit in Taurus జ్యోతిషం ప్రకారం, ఒక గ్రహానికి సంబంధించిన రాశి మారినప్పుడు, అది 12 రాశులను మాత్రమే ప్రభావితం చేస్తుంది. బుధుడు ఈ సంవత్సరం రెండవ సారి సంచరిండానికి సిద్దంగా ఉన్నాడు. అది ఈ మేలోనే జరగబోతోంది. బుధుడిని గ్రహాల రాకుమారుడు అంటారు.
ఈ నెలాఖరున వచ్చే శుక్రవారం, మే 31, బుధ గ్రహ సంచారం జరుగుతుంది. మేషరాశి నుండి బుధుడు వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ బుధ సంచారం మధ్యాహ్నం 12.20 గంటలకు జరుగుతుంది. బుధుడు జూన్ 14 వరకు వృషభరాశిలో ఉంటాడు. తర్వాత మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు.

ఇదివరకే మే 10న బుధుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. బుధుడు యొక్క ఈ సంచార ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థికంగా నష్టపోవడానికి దారి తీస్తుంది. బుధుడు మార్పు వల్ల ఏ రాశుల వారికి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం. బుధుడు యొక్క ఈ సంచారం మార్పు 5 రాశులకు ఆర్థిక సమస్యలను కలిగిస్తుంది. ఆ రాశుల వారు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.
మేషరాశి
ఈ రాశికి సంబందించన వారు ఖర్చులు తగ్గించుకోవాలి. బడ్జెట్‌ను వేసుకుని మరీ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అతిగా ఖర్చు పెట్టడం మానుకోండి. మీ ఆదాయంను చూసి ఖర్చులు కూడా ప్లాన్ చేసుకోండి. ఇలా మీరు ప్రతిదీ అర్థం చేసుకుంటే, మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, ఇది భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సహాయపడుతుంది.
మిధునరాశి
బుధుడి సంచార సమయంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఈ రాశికి సంబంధించిన వారు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడతారు . దీని వల్ల చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు మరొకరి వద్ద అప్పు చేయాల్సి ఉంటుంది, కానీ ఎక్కువగా అప్పు తీసుకోకండి. మిథున రాశి వారు ఈ సమస్యలన్నింటి కారణంగా ఒత్తిడిని అనుభవిస్తారు.
సింహ రాశి
ఈ రాశికి చెందిన వారు బుధుడి సంచార సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వృషభరాశిలో బుధుడు సంచరించడం వల్ల సింహ రాశి వారికి ఇబ్బంది కలుగుతుంది. ఆర్థికపరంగా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి లేదా మీకంటే పెద్ద వారి సంప్రదించండి. సింహరాశికి సంబంధించిన వారి ఆర్థిక పరిస్థితికి ఈ సంచారం ఏమాత్రం మంచిది కాదు.
తులారాశి
ఈ రాశి వారు బుధుడు సంచార సమయంలో ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. అకస్మికంగా ఖర్చులు పెరుగుతాయి, దాని ప్రకారం డబ్బును ఖర్చుపెట్టడం కష్టమవుతుంది. ఖర్చులు పెరగడం వల్ల ఆందోళన కూడా పెరుగుతుంది. ఆకస్మికంగా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రి ఖర్చులు భరించవలసి వస్తుంది. కాబట్టి ముందునుంచే డబ్బు పొదుపు చేయడంపై ఎక్కువ శ్రద్ద తీసుకోండి.
వృశ్చికరాశి
బుధుడు వృషభ రాశిలో ప్రవేశిస్తున్నప్పుడు, ఆర్థిక విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలు లేదా ఏ ఇతర విలువైన వాటిపైన కొత్తగా పెట్టుబడులు పెట్టకండి. ప్రతి పనిని ప్రారంభించే ముందు ఆలోచించి చేయడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications