Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మార్చి నెలలో ఏ రాశి వారికి ఎక్కువ డబ్బులు వస్తాయో తెలుసా? ఆ రాశుల వారికి కస్టాలు తప్పవు
మార్చి నెల జాతకం ప్రకారం, పన్నెండు రాశుల వారికి ఆర్థికపరమైన విషయాల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి? ఏ రాశులకు మంచి ఆర్థిక భవిష్యత్తు ఉంటుంది, ఏ రాశులకు సవాలుతో కూడిన సమయం ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు ఆర్థిక లాభాలను పొందుతారు. రావాల్సిన డబ్బు చేతికి వస్తుంది. మీరు ఏదైనా ఆస్తి లేదా వాహనం కొనాలని ఆలోచిస్తుంటే, ఈ కాలం దానికి అనుకూలంగా ఉంటుంది.

వృషభ రాశి
ఈ రాశి వారికి ఈ నెల ఆర్థికంగా చాలా బాగుంటుంది. వ్యాపారులు మంచి లాభాలను ఆర్జించగలుగుతారు. వేరే చోట ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి జీతంతో ఉద్యోగం దొరుకుతుంది.
మిథున రాశి
వీరికి ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు మీ ఖర్చులపై శ్రద్ధ చూపకపోతే, అది కష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి. వ్యాపారవేత్తలకు కూడా ఈ కాలం సవాలుగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది.
కర్కాటక రాశి
ఈ రాశి వారికి ఈ నెలలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కానీ మీరు వస్తువుల కొనుగోలుకు డబ్బు ఖర్చు చేయడంలో సంతోషంగా ఉంటారు. ఈ కాలం వ్యాపారులకు కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు మంచి లాభాలను ఆర్జించగలుగుతారు.
సింహ రాశి
ఈ రాశికి చెందిన వ్యాపారులకు ఈనెల ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. మీరు ఏదైనా పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. ఆరోగ్య సమస్యలు కూడా అధిక ఖర్చులకు కారణమవుతాయి.
కన్య రాశి
ఈ రాశి వారికి ఆదాయం బాగుంటుంది, కానీ ఖర్చులు ఆదాయాన్ని మించిపోవచ్చు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం, అవసరానికి మించి అప్పులు చేయకుండా ఉండటం, విలాసవంతమైన జీవనశైలికి ఖర్చు చేయకుండా డబ్బు ఆదా చేయడంపై దృష్టి పెట్టడం మంచిది.
తులా రాశి
ఈ రాశికి చెందిన వ్యాపారవేత్తలకు ఈనెల చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. కానీ మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. లేకుంటే మీరు ఆసుపత్రిల పాలయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
వృశ్చిక రాశి
ఆర్థిక పరంగా మార్చి నెల వృశ్చిక రాశి వారికి మంచి నెల. గతంలో చేసిన పెట్టుబడులు మీకు ప్రయోజనాలను తెస్తాయి. ఆస్తి లావాదేవీలలో పాల్గొన్న వారు మంచి లాభాలను ఆర్జించగలుగుతారు.
ధనుస్సు రాశి
ఈ రాశి వారికి ఈ కాలం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. గృహ సౌకర్యం పెరుగుతుంది, వ్యాపారవేత్తలు మంచి లాభాలను ఆర్జిస్తారు. ఈ రాశికి చెందిన వారు డబ్బు ఆదా చేసుకోగలుగుతారు.
మకర రాశి
ఆర్థిక పరంగా మార్చి నెల మకర రాశి వారికి మిశ్రమ నెల అవుతుంది. వ్యాపారవేత్తలు ఆశించిన లాభాలను ఆర్జించడంలో ఇబ్బంది పడతారు. అలాగే చాలా ఖర్చులు పెరిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కుంభ రాశి
ఈ రాశి వారికి ఈనెల ఆర్థికంగా మంచి సంకేతం. వ్యాపారవేత్తలు మంచి లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగులకు మంచి సమయం ఉంటుంది. పదోన్నతి పొందే అవకాశం ఉంది.
మీన రాశి
ఈ కాలం మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు లాభాలను ఆర్జించగలుగుతారు. అలాగే వారికి పెద్ద ఆర్డర్లు రావచ్చు. ఈ కాలం ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications